సాక్షి లైఫ్ : వేసవి కాలం అయినా లేదా పార్టీ అయినా, బయట తినడం అయినా లేదా మెంటల్ గా రిఫ్రెష్ అవ్వడానికి అయినా, చాలా మంది శీతల పానీయాలు తప్పనిసరిగా తీసుకుంటూ ఉంటారు. దీని తీపి, చల్లదనాన్నిచ్చే రుచి మళ్లీ మళ్లీ తాగకుండా ఉండలేని విధంగా ఉంటుంది. ఇలాంటి పానీయాలు తాగినప్పుడు శరీరానికి ఎలాంటి హాని కలుగుతుందో మీకు తెలుసా..?
ఇది కూడా చదవండి..వంట నూనెలలో ఉండే కొవ్వు కారణంగా రొమ్ము క్యాన్సర్..
ఇది కూడా చదవండి..వరల్డ్ లివర్ హెల్త్ డే-2025: కాలేయ పనితీరు తెలుసుకునే ముఖ్యమైన వైద్య పరీక్షలు..
ఇది కూడా చదవండి..మీకు అధిక కొలెస్ట్రాల్ ఉందా..? ఈ 5 కూరగాయలు తినండి..
ఇది కూడా చదవండి..ఫుడ్ అనేది పిల్లలపై ఎలాంటి ఎఫెక్ట్ చూపిస్తుంది..?
శీతల పానీయాలు అనేవి చక్కెర బాంబులు లాంటివి అని వైద్యనిపుణులు చెబుతున్నారు. ఒక చిన్న సైజు డబ్బాలో దాదాపు 7 నుంచి 10 చెంచాల చక్కెర ఉంటుంది. ఇంత చక్కెర శరీరానికి అనారోగ్యకరమైనది. అంతేకాదు, అది రక్తంలో చక్కెర స్థాయిని అకస్మాత్తుగా పెంచుతుంది. ప్రతిరోజూ శీతల పానీయాలు తాగే అలవాటు వల్ల భవిష్యత్తులో మధుమేహం వంటి తీవ్రమైన వ్యాధి బారిన పడే అవకాశం ఎక్కువగా ఉంటుందని పలు అధ్యయనాలు హెచ్చరిస్తున్నాయి.
చక్కర ఎముకల్లోని కాల్షియంను తగ్గిస్తుంది..
శీతల పానీయాలు మీ గొంతును చల్లబరుస్తాయని మీరు అనుకోవచ్చు, కానీ అవి మీ ఎముకలలోని కాల్షియంను నెమ్మదిగా తగ్గిస్తాయని మీకు తెలుసా? నిజానికి, ఇందులో ఫాస్పోరిక్ ఆమ్లం అనే మూలకం ఉంటుంది. ఇది శరీరంలో కాల్షియం శోషణకు ఆటంకం కలిగిస్తుంది. ఫలితంగా ఎముకలు బలహీనపడటం ప్రారంభమవుతుంది. కీళ్ల నొప్పులు, బలహీనత, ఆస్టియోపోరోసిస్ వంటి సమస్యలు చిన్న వయస్సులోనే తలెత్తుతాయి.
బరువు..
మీరు బరువు తగ్గడానికి ప్రయత్నిస్తున్నప్పటికీ ప్రతిరోజూ శీతల పానీయాలు తాగడం ఆపకపోతే - మీరు బ్రేక్ మరియు యాక్సిలరేటర్‌ను ఒకేసారి నొక్కుతున్నట్లే. ఎందుకంటే..? శీతల పానీయాలలో ఎక్కువ కేలరీలు, పెద్దమొత్తంలో చక్కెర ఉంటాయి, అవి శరీరంలో కొవ్వుగా పేరుకుపోతాయి. ముఖ్యంగా పొట్ట, నడుము చుట్టూ కొవ్వు పేరుకుపోవడం ప్రారంభమవుతుంది, ఇది ఊబకాయ సమస్యను పెంచుతుంది.
దంతాలకు..
శీతల పానీయాలలో ఉండే ఆమ్లం, చక్కెర మీ దంతాల ఆరోగ్యంపై చెడు ప్రభావాన్ని చూపుతాయి. ఇది క్రమంగా మీ దంతాలపై ఉండే పొర ఎనామెల్ పొరను బలహీన పరుస్తుంది, వాటిని సున్నితంగా మారుస్తాయి. ఇది కాకుండా, ఎక్కువగా శీతల పానీయాలు తీసుకోవడం వల్ల కావిటీస్, దంతాల దుర్వాసన వంటి సమస్యలు కూడా వస్తాయి.
కాలేయం, గుండెపై తీవ్ర ప్రభావం..
క్రమం తప్పకుండా శీతల పానీయాలు తీసుకునేవారికి ఫ్యాటీ లివర్ డిసీజ్, గుండె జబ్బులు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంది. అధిక చక్కెర, రసాయనాలు, కెఫిన్ కలయిక. ఇవి కాలేయంపై ఒత్తిడిని కలిగించడమే కాకుండా శరీరంలోని కొలెస్ట్రాల్ స్థాయిని కూడా పాడు చేస్తాయి.