ఆబ్సెన్స్‌ సీజర్స్‌ అంటే ఏమిటి..? వాటివల్ల ఎలాంటి సమస్యలు వస్తాయి..?

సాక్షి లైఫ్ : అలసట, వేగంగా శ్వాస తీసుకోవడం, టీవీ,మొబైల్ స్క్రీన్ల నుంచి వచ్చే మెరిసే కాంతి - ఇవన్నీ పిల్లల్లో ఆబ్సెన్స్ సీజర్స్‌కు కారణం కావొచ్చు. ఈ సీజర్స్ 4-14 ఏళ్ల పిల్లల్లో ఎక్కువగా కనిపిస్తాయి. ఇవి దాదాపు 10-20 సెకన్ల పాటు మెదడు పనితీరుని నిలిపివేస్తాయి. ఈ సమయంలో పిల్లలు స్పృహ కోల్పోతారు.పేరెంట్స్, టీచర్లు దీన్ని పగటి కలలుగా లేదా పిల్లలు తమ లోకంలో ఉన్నారని తప్పుగా భావిస్తుంటారు. సాధారణంగా కనిపించే ఫిట్స్‌కు భిన్నంగా, ఆబ్సెన్స్ సీజర్‌లను గుర్తించడం కష్టం.

 

 ఇది కూడా చదవండి.. ఫ్యాటీ లివర్ ఏ ఏ అవయవాలపై ప్రభావం చూపుతుంది..? 

 ఇది కూడా చదవండి.. టీ లో ఎన్నిరకాల వెరైటీలున్నాయో తెలుసా..? 

ఇది కూడా చదవండి..కిడ్నీలు పనిచేయడం లేదని ఎలా తెలుసుకోవాలి..?

 

పిల్లలలో ఆబ్సెన్స్ సీజర్స్: కారణాలు, లక్షణాలు, నిర్ధారణ & చికిత్స.. 


పిల్లలలో కనిపించే ఫిట్స్‌లో 20-25% అబ్సెన్స్ సీజర్స్‌ ఉంటాయి. ఇవి సాధారణంగా జన్యుపరమైన (జెనెటిక్) లేదా జీవక్రియ (మెటబాలిక్) సమస్యల వల్ల వస్తాయి. అబ్బాయిల కంటే అమ్మాయిల్లో ఇవి ఎక్కువగా కనిపిస్తాయి. 

కొందరి పిల్లల్లో పుట్టిన ఏడాది లోపే ఇవి ప్రారంభం కావొచ్చు. ఆరోగ్యంగా ఉన్న పిల్లల్లో అకస్మాత్తుగా ఇవి మొదలైనప్పటికీ, కొందరిలో జ్వరం వచ్చినప్పుడు కనిపించే ఫిట్స్‌తో ఇవి ప్రారంభమవుతాయి. ఎదుగుదలలో లోపాలు (డెవలప్‌మెంటల్ డిలే) వంటి నరాల సంబంధిత సమస్యలు ఉన్నవారిలో కూడా ఇవి కనిపిస్తాయి. చాలా మంది తల్లిదండ్రులు లేదా టీచర్లు వీటిని ఆలస్యంగా గుర్తిస్తుంటారు.

ఆబ్సెన్స్ సీజర్స్ కు ప్రధాన కారణాలు.. 

టీవీ, మొబైల్ స్క్రీన్ల నుంచి వచ్చే మెరిసే కాంతి: పిల్లలు టీవీ, మొబైల్ చూస్తున్నప్పుడు తరచుగా హఠాత్తుగా మారిపోయే కాంతి కిరణాలు, ఫ్లాష్ లైట్ల వల్ల అబ్సెన్స్ సీజర్స్ సమస్య తలెత్తుతుంది. తీవ్రమైన అలసట..వేగంగా శ్వాస తీసుకోవడం.. 

ఆబ్సెన్స్ సీజర్స్ లక్షణాలు.. 

అకస్మాత్తుగా ఏం చేయాలో తెలియని పరిస్థితిని బిహేవియరల్ అరెస్ట్ అంటారు.

షాక్‌లో ఉండిపోవడం.

ముఖంలో ఎలాంటి కదలికలు లేకపోవడం.

నిరంతరం కళ్ళు రుద్దడం.

బట్టలను లేదా ముఖాన్ని చేతి వేళ్లతో తడబడుతూ నలపడం.

నోరు చప్పరించడం.

మాటలు తప్పుగా, అస్పష్టంగా ఉచ్ఛరించడం.

చేస్తున్న పనిని అకస్మాత్తుగా ఆపివేయడం.

 పిలిచినా స్పందించకపోవడం.

ఈ లక్షణాలు ఉన్నప్పుడు కూడా పిల్లలు సాధారణంగా కనిపించవచ్చు. మాట్లాడటం దాదాపు సాధారణంగానే ఉంటుంది, కొందరిలో మాత్రం కొంచెం అస్పష్టత కనిపించవచ్చు. ఈ లక్షణాలు ఆడుకుంటున్నప్పుడు, టీవీ చూస్తున్నప్పుడు, లేదా కొన్నిసార్లు నిద్రలో కూడా కొనసాగవచ్చు. పిల్లలు అన్యమనస్కంగా ఉన్నట్టు లేదా ఏదో లోకంలో ఉన్నట్టు తల్లిదండ్రులు గమనిస్తే వెంటనే డాక్టర్‌ను సంప్రదించాలి.

 ఇది కూడా చదవండి.. క్షయవ్యాధి ఏయే అవయవాలపై ప్రభావం చూపుతుంది..?

ఇది కూడా చదవండి..ఆరోగ్యప్రయోజనాలు పొందాలంటే సలాడ్ ను ఏ టైమ్ లో తినాలి..?

ఇది కూడా చదవండి..మంచి కొలెస్ట్రాల్ ను పెంచే దానిమ్మ.. 

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

Tags : mental-health kids-health epilepsy neurological-disorders causes-of-epilepsy causes-of-nonepileptic-seizrues types-of-epilepsy pediatric-health absence-seizures pediatric-epilepsy childhood-seizures
Newsletter

Please subscribe for more updates...!

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.

Get In Touch

Door No 6-3-249/1, Sakshi Towers, Beside Care Hospital, Near City Center, Road No 1, Banjara Hills-500034

040 2325 6000

life@sakshi.com

Follow Us

© News. All Rights Reserved. by sakshi.com