సీజనల్ హెల్త్ కేర్ : సీజనల్ వ్యాధులకు దూరంగా ఉండాలంటే..?
సాక్షి లైఫ్ : వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు, దోమల ద్వారా సంక్రమించే డెంగ్యూ, మలేరియా, చికున్ గున్యా వంటివి ఈ సమయంలో మరింతగా వ్యాప్తి చెందుతాయి. ఈ వ్యాధుల బారిన పడకుండా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో వైద్యనిపుణులు చెబుతున్నారు.
ఇది కూడా చదవండి.. పిల్లల స్క్రీన్ టైమ్ గురించి భారతీయ తల్లుల ఆందోళన
ఇది కూడా చదవండి..వాక్సిన్ గురించి వాస్తవాలు- అవాస్తవాలు..
ఇది కూడా చదవండి..డిప్రెషన్ ఉన్న వారిలో ఎలాంటి మార్పులు కనిపిస్తాయి..?
సీజనల్ వ్యాధులు - జాగ్రత్తలు..
వర్షాకాలంలో సాధారణంగా వచ్చే జ్వరాలు, జలుబు, దగ్గు, టైఫాయిడ్, కామెర్లు వంటి సీజనల్ వ్యాధులు చిన్నా, పెద్ద అనే తేడా లేకుండా అందర్నీ ఇబ్బంది పెడతాయి. వీటిని నివారించడానికి వ్యక్తిగత పరిశుభ్రత, పరిసరాల శుభ్రత చాలా అవసరమని వైద్యనిపుణులు వెల్లడిస్తున్నారు.
పరిశుభ్రమైన ఆహారం, నీరు: వర్షాల సమయంలో బయట ఆహారాన్ని తినడం తగ్గించండి. శుభ్రమైన, వేడి చేసిన ఆహారాన్ని మాత్రమే తీసుకోండి. నీటిని బాగా మరిగించి తాగడం లేదా ఫిల్టర్ చేసిన నీటిని ఉపయోగించడం తప్పనిసరి.
వ్యక్తిగత పరిశుభ్రత: తరచుగా చేతులను సబ్బుతో కడుక్కోవడం, ముఖ్యంగా భోజనానికి ముందు, తరువాత, వాష్ రూమ్ కి వెళ్లొచ్చిన తర్వాత తప్పనిసరిగా చేతులు కడుక్కోవాలి. బయట నుంచి ఇంటికి రాగానే కాళ్లు, చేతులు శుభ్రం చేసుకోవాలి.
పరిసరాల శుభ్రత: ఇంటి చుట్టూ నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలి. ఇది దోమల వృద్ధికి కారణమవుతుంది. డ్రైనేజీలు మూసుకుపోకుండా, చెత్తాచెదారం లేకుండా పరిశుభ్రంగా ఉంచుకోవాలి. రోగనిరోధక శక్తి పెంపు: విటమిన్ సి అధికంగా ఉండే పండ్లు, కూరగాయలు ఆహారంలో చేర్చుకోవడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఇది వ్యాధులతో పోరాడటానికి సహాయపడుతుంది.
ఇది కూడా చదవండి.. లివర్ సంబంధిత సమస్యలను ఎలా గుర్తించాలి..?
ఇది కూడా చదవండి..ఒత్తిడి, ఆందోళనను తగ్గించడానికి బెస్ట్ ఫుడ్ ఏది..?
ఇది కూడా చదవండి.. మైక్రోసైటిక్ అనీమియా అంటే ఏమిటి..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి..
