అనారోగ్యకరమైన ఆహారంతోనే 50శాతంపైగా వ్యాధులు..
సాక్షి లైఫ్: అనారోగ్యకరమైన ఆహారంతో 56.4 శాతం వ్యాధులు తలెత్తుతున్నాయని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ , నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ (ఐసిఎమ్ఆర్-ఎన్ఐఎన్) తెలిపింది. గుండె జబ్బులు, బీపీ , మధుమేహాన్ని నిరోధించడానికి ఆరోగ్యకరమైన ఆహారం, వ్యాయామం చాలా అవసరమని వెల్లడించింది.
ఇది కూడా చదవండి.. కిడ్నీలకు హాని కలిగించే ఫుడ్..
ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ పోషకాహార లోపాలను నివారించడానికి 17 ఆహార మార్గదర్శకాలను విడుదల చేసింది. అలాగే ఊబకాయం, మధుమేహం ,హృదయ సంబంధ వ్యాధుల వంటి నాన్-కమ్యూనికేబుల్ వ్యాధుల ప్రమాదాన్ని పరిష్కరించడానికి అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. భారతదేశంలో మొత్తం వ్యాధి భారంలో 56.4 శాతం అనారోగ్యకరమైన ఆహారాల వల్లనే జబ్బులు వస్తున్నట్లు తెలిపింది.
అపెక్స్ హెల్త్ రీసెర్చ్ బాడీ కింద నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ ,ఆరోగ్యకరమైన ఆహారాలు, శారీరక శ్రమ కరోనరీ హార్ట్ డిసీజ్,హైపర్‌టెన్షన్ , టైప్ 2 మధుమేహం గణనీయమైన నిష్పత్తిని తగ్గించగలవని పేర్కొంది. ఆరోగ్యకరమైన జీవనశైలిని పాటించడం ద్వారా టైప్ 2 డయాబెటిస్ కేసులలో 80 శాతం వరకు నిరోధించవచ్చని బీపీ, గుండె సంబంధిత సమస్యల ప్రమాదాన్ని గణనీయంగా తగ్గించవచ్చని, ఆరోగ్యకరమైన జీవనశైలిని అనుసరించడం ద్వారా అకాల మరణాలలో గణనీయమైన నిష్పత్తిని నివారించవచ్చు" అని ఐసిఎమ్ఆర్ పేర్కొంది.
ఆరోగ్యకరమైన ఆహారం కోసం చేసిన సిఫార్సులు
నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ అందించిన ఆహార మార్గదర్శకాలు పోషకాలు పొందడానికి, సూక్ష్మపోషకాల లోపాలను నివారించడానికి, పెరుగుతున్న ఊబకాయ సంబంధిత రుగ్మతలను ఎదుర్కోవడానికి రూపొందించిన పలు సిఫార్సులు చేసింది.
మార్గదర్శకాలలో ముఖ్య సిఫార్సులు..
- ఉప్పు పరిమితంగా తీసుకోవాలి.
- నూనెలు , కొవ్వును మితంగా ఉపయోగించాలి.
- సరైన వ్యాయామం చేయాలి.
- చక్కెర, అల్ట్రా-ప్రాసెస్డ్ ఫుడ్స్ వినియోగాన్ని తగ్గించాలి.
స్థూలకాయాన్ని నివారించడానికి ఆరోగ్యకరమైన జీవనశైలిని అనుసరించాలని, ఆరోగ్యకరమైన ఆహార ఎంపిక విషయంలో ఫుడ్ ప్రోడక్ట్స్ లేబుల్‌లపై ఉన్న సమాచారాన్ని చదవాలని కూడా సూచించింది. ఐసిఎమ్ఆర్-ఎన్ఐఎన్ డైరెక్టర్ డాక్టర్ హేమలత నేతృత్వంలోని నిపుణులతో కూడిన మల్టీడిసిప్లినరీ కమిటీ ఈ సిఫార్సులను రూపొందించింది. అనేక శాస్త్రీయ సమీక్షల తర్వాత వీటిని విడుదల చేశారు.
ఇది కూడా చదవండి.. భారతీయ ఆహార మార్గదర్శకాలను విడుదల చేసిన ఎన్ఐఎన్
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
