సాక్షి లైఫ్ : కాలాన్ని బట్టి ఆహారంలో మార్పు చేర్పులుచేసుకోవడం అనేది ఎప్పటినుంచో వస్తోంది. సీజన్ మారిందంటే చాలు రకరకాల అనారోగ్య సమస్యలు సహజంగానే తలెత్తుతుంటాయి. వాటినుంచి ఆరోగ్యాన్ని సంరక్షించుకోవాలంటే తప్పనిసరిగా హెల్తీ ఫుడ్ తీసుకోవాలి. శీతాకాలంలో శరీరంలో రోగ నిరోధక శక్తి తగ్గుతూ ఉంటుంది. అందుకోసం రోగ నిరోధక శక్తిని పెంపొందించే సూపర్ ఫుడ్ తీసుకోవాలి. బ్రోకలీ, కాలిఫ్లవర్లు ఈ కోవకు చెందిన కాయగూరలే.
శరీరానికి అనేక ప్రయోజనాలు..
సూపర్‌ఫుడ్‌లు అంటే అనేక పోషకాలు పుష్కలంగా ఉండే ఆహార పదార్థాలు. వీటిని తిన్నప్పుడు, శరీరానికి అనేక ప్రయోజనాలు లభిస్తాయి. అటువంటి కూరగాయలలో బ్రోకలీ, కాలిఫ్లవర్లు ఉంటాయి. వీటిని ఆహారంలో భాగంగా చేసుకోవడం వల్ల రోగనిరోధక శక్తి పెరగడమే కాకుండా శరీరంలో ఎనర్జీని మెయింటైన్ చేస్తుంది. బ్రోకలీ, కాలిఫ్లవర్లు రెండూ ఒకే జాతికి చెందిన కాయగూరలు. రెండింటిలో ఉన్న విటమిన్లు, ఖనిజాలు దాదాపుగా సమానం. కాకపోతే బ్రోకోలిలో విటమిన్ కే మోతాదు కాలిఫ్లవర్ కంటే మూడు నాలుగు రెట్లు ఎక్కువగా ఉంటుంది.
బ్రోకలీతో ఆరోగ్య ప్రయోజనాలు..
బ్రోకలీ కూడా ప్రయోజనకరమైన కూరగాయలలో ప్రధానమైంది. ఇందులో విటమిన్ "సి", "కె" "ఏ "తో పాటు, మంచి మొత్తంలో ఫోలేట్, కాల్షియం, పొటాషియం కూడా బ్రోకలీలో కనిపిస్తాయి. విటమిన్ "కె" క్యాల్షియం సమృద్ధిగా ఉండటం వల్ల బ్రోకలీ ఎముకల ఆరోగ్యాన్ని కాపాడుతుంది.
యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలకు మంచి మూలం..
ఇది కాకుండా, ఇది యాంటీ-ఆక్సిడెంట్లను కలిగి ఉంటుంది. యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలకు మంచి మూలం. బ్రోకలీ తినడం ద్వారా, శరీరానికి కావాల్సినంత ఫైబర్ లభిస్తుంది. అంతేకాదు శరీరాన్ని డిటాక్సిఫికేషన్ చేస్తుంది. బ్రోకలీ ప్రయోజనాలు జీర్ణక్రియను, చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో కీలక పాత్ర పోషిస్తుంది.
ఆహారంలో బ్రోకలీని ఎలా భాగం చేసుకోవాలి..?
ఆహారంలో బ్రోకలీని చేర్చడానికి అనేక మార్గాలు ఉన్నాయి. దీన్ని ఉడికించిన బ్రోకలీని సలాడ్ రూపంలో తింటే మంచిది. దీనికి ఎండుమిర్చి కలుపుకుంటే రుచి కూడా పెరుగుతుంది. అంతేకాదు
బ్రోకలీని సూప్ రూపంలో కూడా తీసుకోవచ్చు.
బ్రోకలీని కూడా వేయించి తినవచ్చు. కాల్చిన బ్రోకలీని ఆలివ్ నూనె , ఉప్పుతో కలిపి స్టార్టర్‌గా తింటారు. బ్రోకలీని శాండ్‌విచ్‌లు, పిజ్జా ,పాస్తా మొదలైన వాటితో కూడా కలిపి తినవచ్చు. బ్రోకోలి బదులుగా కాలిఫ్లవర్ అంటే గోబీని తీసుకున్నా ఆరోగ్య ప్రయోజనాలు దాదాపు సమానం.
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
Please subscribe for more updates...!
గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.
Door No 6-3-249/1, Sakshi Towers, Beside Care Hospital, Near City Center, Road No 1, Banjara Hills-500034
040 2325 6000
life@sakshi.com
© News. All Rights Reserved. by sakshi.com