Myths -facts : హెచ్ పీవీ వ్యాక్సిన్ బాలికలకు మాత్రమే అవసరమా..?  

షేర్ చేయండి:
Myths -facts : హెచ్ పీవీ వ్యాక్సిన్ బాలికలకు మాత్రమే అవసరమా..?  

సాక్షి లైఫ్ : గర్భాశయ క్యాన్సర్ పై ప్రతిఒక్కరికి అవగాహన చాలా అవసరం. ఇది ప్రపంచవ్యాప్తంగా మహిళలను ప్రభావితం చేసే తీవ్రమైన రకం క్యాన్సర్. అయితే, హ్యూమన్ పాపిలోమా వైరస్ (హెచ్ పీవీ) వ్యాక్సిన్  సకాలంలో తీసుకుంటే ఈ మహమ్మారిని నివారించవచ్చు. హెచ్ పీవీ టీకాకు సంబంధించిన కొన్ని సాధారణ అపోహలు,వాస్తవాలను గురించి ఇప్పుడు తెలుసుకుందాం..   

 

ఇది కూడా చదవండి..ఇంటిగ్రేటివ్ మెడిసిన్ అంటే ఏమిటి..? ఇది సాంప్రదాయ వైద్యంతో పోలిస్తే భిన్నంగా ఎలా ఉంటుంది..?

ఇది కూడా చదవండి..దీర్ఘకాలిక మూత్రపిండ వ్యాధి (సికెడి)ప్రారంభ సంకేతాలు, లక్షణాలు ఎలా ఉంటాయి..?

ఇది కూడా చదవండి..మీ మూత్రపిండాలు ఆరోగ్యంగా ఉన్నాయా..?

 

 

 

గర్భాశయ క్యాన్సర్ అనేది ఎక్కువగా మహిళలను ప్రభావితం చేసే తీవ్రమైన వ్యాధి. దీని నుంచి రక్షించుకోవడానికి తప్పనిసరిగా హెచ్ పీవీ వ్యాక్సిన్ తీసుకోవాలి.ప్రపంచవ్యాప్తంగా ఎక్కువమంది మహిళల మరణానికి కారణమవుతుంది ఇది. హెచ్ పీవీ టీకా సహాయంతో ఈ క్యాన్సర్ ను నివారించవచ్చు. అయితే, చాలా మందికి ఈ టీకా (హెచ్ పీవీ వ్యాక్సిన్ వాస్తవాలు) గురించి అవగాహన లేదు, దీని కారణంగా ఈ క్యాన్సర్ ప్రజలలో వేగంగా వ్యాపిస్తోంది.


అపోహ : హెచ్ పీవీ వ్యాక్సిన్ ప్రారంభ లైంగిక కార్యకలాపాలను పెంచుతుంది.. 


వాస్తవం : కొంతమంది తల్లిదండ్రులు తమ పిల్లలకు హెచ్ పీవీ వ్యాక్సిన్ ఇవ్వడం వల్ల వారిలో చిన్న వయస్సులోనే లైంగిక ప్రవర్తనలో మార్పులు వస్తాయని ఆందోళన చెందుతుంటారు. అయితే, ఇది ఒక అపోహ మాత్రమే, ఎందుకంటే హెచ్ పీవీ వ్యాక్సిన్ తీసుకోవటానికి, లైంగిక ప్రవర్తనలో మార్పులకు మధ్య ఎటువంటి సంబంధం లేదని పరిశోధకులు వెల్లడిస్తున్నారు. హెచ్ పీవీ వ్యాక్సిన్  ఉద్దేశ్యం హెచ్ పీవీ కి సంబంధించిన వ్యాధులను అంటే హ్యూమన్ పాపిల్లోమావైరస్‌ను నివారించడం.

అపోహ : బాలికలకు మాత్రమే హెచ్ పీవీ వ్యాక్సిన్ అవసరమా..? 

వాస్తవం: మొదట్లో హెచ్ పీవీ వ్యాక్సిన్ అనేది బాలికలకు మాత్రమే అన్నది నిజమే. కానీ ఈ వ్యాక్సినేషన్ అబ్బాయిలకు కూడా అంతే ముఖ్యమైనది. పురుషులలో హెచ్ పీవీ మెడ, పురుషాంగ క్యాన్సర్‌కు కారణమవుతుంది. అటువంటి పరిస్థితిలో అబ్బాయిలకు టీకాలు వేయడం ద్వారా హెచ్ పీవీ వైరస్ వ్యాప్తిని తగ్గించవచ్చు, ఇది క్యాన్సర్ రాకుండా రక్షణ కల్పిస్తుంది.

 

ఇది కూడా చదవండి..డయాబెటిక్ రెటినోపతిపై అవగాహన అవసరం.. 

ఇది కూడా చదవండి..కొత్తగా దంతాలు వచ్చిన పిల్లలకూ బ్రష్ చేయాలా..? 

ఇది కూడా చదవండి.. లివర్ సంబంధిత సమస్యలను ఎలా గుర్తించాలి..? 

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.