సాక్షి లైఫ్ : ప్రస్తుతం భారతదేశంలో 101 మిలియన్ల మందికి పైగా డయాబెటిస్ బారిన పడుతున్నారు. 2045 నాటికి ఈ సంఖ్య 125 మిలియన్లకు చేరుకుంటుందని అంచనా వేస్తున్నారు పరిశోధకులు. గుండె జబ్బులు, దీర్ఘకాలిక మూత్రపిండాల వ్యాధి, డయాబెటిక్ రెటినోపతి (డిఆర్) వంటి అనేక అనారోగ్య సమస్యలు మధుమేహంతో ముడిపడి ఉన్నాయి.
ఇది కూడా చదవండి..కొత్తగా దంతాలు వచ్చిన పిల్లలకూ బ్రష్ చేయాలా..?
ఇది కూడా చదవండి.. లివర్ సంబంధిత సమస్యలను ఎలా గుర్తించాలి..?
ఇది కూడా చదవండి.. 40 ఏళ్ల తర్వాత ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేసుకోవచ్చా..?
ఇతర ప్రమాదాలు తరచుగా లక్షణాలతో ఉన్నప్పటికీ, డయాబెటిక్ రెటినోపతి అనేది మధుమేహం కారణంగా కంటి చూపుకి ముప్పు కలిగించే సమస్య, ఇది నిశ్శబ్దంగా అభివృద్ధి చెందుతుంది, ఫలితంగా దృష్టి లోపంతలెత్తడమేకాకుండా కొన్ని సందర్భాల్లో అంధత్వం వస్తుంది. ప్రపంచవ్యాప్తంగా మధ్య వయస్కులు దృష్టి కోల్పోవడానికి ఇది ప్రధాన కారకం.
ఇటీవల నిర్వహించిన స్మార్ట్ ఇండియా అధ్యయనం 6వేల మందికి పైగా మధుమేహ వ్యాధిగ్రస్తుల్లో డయాబెటిస్ ప్రాబల్యాన్ని పరిశీలించింది. డయాబెటిక్ రోగులలో రెటినోపతి ప్రాబల్యం 12.5% ఉందని వెల్లడించింది. ఇందులో 4శాతం మందికి కంటి చూపునకు ముప్పు కలిగించే డయా బెటిక్ రెటినో పతి ఉంది. ఇది కంటి చూపు పూర్తిగా పోవడానికి కారణమవుతుంది. దీర్ఘకాలిక అధిక బ్లడ్ షుగర్ కారణంగా రెటీనా చిన్న రక్త నాళాలు ఉబ్బి లీక్ అవుతాయి, దీనివల్ల డయాబెటిక్ రెటినోపతి వస్తుంది.
లేదా అవి మూసుకుపోతాయి, దాంతో రక్తం వాటి గుండా వెళ్ళకుండా ఆగిపోతుంది. దీంతో దృష్టి లోపానికి కారణ మవుతుంది. డయాబెటిక్ రెటినోపతి ఎలాంటి ప్రారంభ లక్షణాలు లేకుండా అభివృద్ధి చెందుతుంది. ఫలితంగా, చాలా మంది రోగులు ఈ పరిస్థితి గురించి తెలియకుండానే ముదిరిపోయే ప్రమాదం ఉంటుంది.
హైదరాబాద్‌లోని ఎల్‌వి ప్రసాద్ ఐ ఇన్‌స్టిట్యూట్‌లోని టెలిఆఫ్తాల్మాలజీ, కన్సల్టెంట్ విట్రియోరెటినల్ సర్వీసెస్ నెట్‌వర్క్ అసోసియేట్ డైరెక్టర్ డాక్టర్ పద్మజ కుమారి రాణి మాట్లాడుతూ.. “డయాబెటిక్ రెటినోపతి (డిఆర్) అనేది డయాబెటిస్ కారణంగా వచ్చే సమస్య. రెటినోపతి ప్రారంభ సంకేతాలను గుర్తించడానికి క్రమం తప్పకుండా కంటి పరీక్షలు అవసరం, తద్వారా సకాలంలో చికిత్స చేయవచ్చు" అని అన్నారు.
ఈ ప్రమాదాన్ని పరిష్కరించడానికి, రీసెర్చ్ సొసైటీ ఫర్ ది స్టడీ ఆఫ్ ఇండియా ఇన్ డయాబెటిస్ (RSSDI), విట్రియో రెటినల్ సొసైటీ ఆఫ్ ఇండియా (VRSI) సంయుక్తంగా మార్గదర్శకాలను రూపొందించాయి. ఇవి డయాబెటిస్ ఉన్న వారందరికీ క్రమం తప్పకుండా స్క్రీనింగ్ చేయాలని అవి సిఫార్సు చేస్తున్నాయి. ప్రతి ఏటా కంటి పరీక్షలను తప్పనిసరిగా చేయించుకోవాలని చెబుతున్నాయి.
ఇది కూడా చదవండి.. ప్రోస్టేట్ క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచే కారకాలు
ఇది కూడా చదవండి.. సంపూర్ణ ఆరోగ్యంగా ఉండాలంటే ఎలాంటి ఫుడ్ తీసుకోవద్దంటే..?
ఇది కూడా చదవండి.. సమ్మర్ లో చర్మ సంరక్షణ ఎలా..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
Tags :Please subscribe for more updates...!
గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.
Door No 6-3-249/1, Sakshi Towers, Beside Care Hospital, Near City Center, Road No 1, Banjara Hills-500034
040 2325 6000
life@sakshi.com
© News. All Rights Reserved. by sakshi.com