ముఖంపై మచ్చలు ఏ విటమిన్ లోపంతో వస్తాయి..? 

షేర్ చేయండి:
ముఖంపై మచ్చలు ఏ విటమిన్ లోపంతో వస్తాయి..? 

సాక్షి లైఫ్: ఒక్కోసారి ముఖం చిన్న చిన్న మచ్చలు వస్తుంటాయి. దీనికి ప్రధాన కారణాలేంటి..? చర్మ సంరక్షణ విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ, విటమిన్ లోపం కారణంగా ముఖంలో మార్పులు చోటుచేసుకుంటాయని, ముఖ్యంగా కొన్నిరకాల విటమిన్స్ లోపించడం వల్ల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడుతుందని వైద్య నిపుణులు వెల్లడిస్తున్నారు. అదేవిధంగా విటమిన్ బి 12లోపం కారణంగా ముఖంపై మచ్చలు వస్తాయని, ఆయా విటమిన్ ను పొందడానికి ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి అనేది ఇప్పుడు తెలుసుకుందాం.. 

వయస్సుపెరుగుతున్న కొద్దీ చర్మం స్థితిస్థాపకత తగ్గడం మొదల వుతుంది. అదే సమయంలో శరీరంలో కొన్ని విటమిన్లు తగ్గి పోతుంటాయి. తగ్గిన విటమిన్లను ఎలా పొందాలో తెలుసుకొని ఆయా ఆహారం తీసుకోవడం ద్వారా వాటిని పొందవచ్చని పోషకాహార నిపుణులు వెల్లడిస్తున్నారు. శరీరంలో విటమిన్ బి12 లోపిస్తే చర్మ సౌందర్యం దెబ్బతింటుంది. దీని వల్ల మొటిమలు ఏర్పడతాయి, అంతేకాదు ముఖంపై మచ్చలు వస్తాయి, చర్మంపొడిగా మారుతుంది, పెదవులు పగిలిపోతాయి. కాబట్టి "విటమిన్ B12" లభించే ఆహారం తీసుకోవాలి.  

"విటమిన్ B12" లభించే ఆహారం.. 

విటమిన్ బి12 పెరుగులో పుష్కలంగా ఉంటుంది. శాకాహారులకు విటమిన్ బి12కి ఇది ఉత్తమమైన మూలం. ఒక కప్పు పెరుగులో 28శాతం  విటమిన్ B12 ఉంటుంది.

పాలతో తయారు చేసిన ఉత్పత్తుల్లో "విటమిన్ B12" ఉంటుంది. దీనిని పొందడం కోసం పాలు, చీజ్ వంటివి ప్రధానమైనవి.  

తృణధాన్యాలు "విటమిన్ బి12"తో పాటు ఫోలేట్, ఐరన్, విటమిన్ "ఏ "ను అందిస్తాయి. బలవర్థకమైన తృణధాన్యాలను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల మీ శరీరంలో విటమిన్ బి12 స్థాయిని పెంచడంలో సహాయపడుతుంది.

 ఇది కూడా చదవండి.. నడుము చుట్టుకొలతకు, సంతానలేమికి మధ్య ఏంటి సంబంధం..? 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి..

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.