నడుము చుట్టుకొలతకు, సంతానలేమికి మధ్య ఏంటి సంబంధం..? 

షేర్ చేయండి:

సాక్షి లైఫ్ : వంధ్యత్వం అనేది ప్రపంచవ్యాప్తంగా చాలా మంది ఎదుర్కొంటున్న సమస్య. నడుము చుట్టుకొలత, వంధ్యత్వానికి మధ్య కొంత సంబంధం ఉందని ఒక అధ్యయనం తేల్చింది. దీనికి సంబంధించిన కారణాన్ని కూడా ఈ అధ్యయనం వెల్లడించింది. అందువల్ల ఆరోగ్యకరమైన బరువును నిర్వహించడం చాలా ముఖ్యం. నడుము చుట్టుకొలతకు,వంధ్యత్వానికి మధ్య ఈ అధ్యయనంలో ఏం తేలింది..?  

మహిళల నడుము సైజుకు, సంతానలేమికి మధ్య సంబంధం ఏంటనే దానిపై పరిశోధన చేశారు శాస్త్రవేత్తలు. ఈ అధ్యయనంలో షాకింగ్ విషయాలు వెల్లడయ్యాయి. నడుము పరిమాణం, వంధ్యత్వానికి మధ్య సంబంధాన్ని ఈ అధ్యయనం ద్వారా తేల్చారు. 

మహిళల నడుము సైజుకు, సంతానలేమికి మధ్య సంబంధాన్ని గురించి అధ్యయనం చేసేందుకు 18 నుంచి 45 సంవత్సరాల వయస్సు గల 3,239 మంది మహిళల డేటాను విశ్లేషించారు. నడుము పరిమాణం పెరగడం వల్ల సంతానలేమి ముప్పు పెరుగుతుందని పరిశోధకులు గుర్తించారు. 
 
నడుము చుట్టుకొలత, పిల్లలను కనే వయస్సు గల స్త్రీలలో వంధ్యత్వానికి మధ్య ఉన్న సంబంధాన్ని చైనాలోని హుయిజౌ సెంట్రల్ పీపుల్స్ హాస్పిటల్ నుంచి జిరోంగ్ కే బృందం పరిశీలించింది. ఈ విశ్లేషణలో యూఎస్ నేషనల్ హెల్త్ అండ్ న్యూట్రిషన్ ఎగ్జామినేషన్ సర్వేలో పాల్గొన్న 3,239 మంది మహిళలు (18 నుంచి 45 సంవత్సరాల వయస్సు) ఉన్నారు.

బాడీమాస్ ఇండెక్స్, స్త్రీ వంధ్యత్వానికి ,నడుము చుట్టుకొలతకు సంబంధం కలిగి ఉందని విశ్లేషణలో పరిశోధకులు కనుగొన్నారు. నడుము చుట్టుకొలతలో ప్రతి ఒక సెంటీ మీటర్ పెరుగుదలకు, వంధ్యత్వానికి సంబంధించిన ప్రమాదం 3 శాతం పెరిగినట్లు పరిశోధకులు గుర్తించారు.   

ఇది కూడా చదవండి.. ఈ వయస్సు వాళ్లు క్యాల్షియం ట్యాబ్లేట్స్ వేసుకోకూడదా..?

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి..

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.