Liquid Biopsy : బ్రెస్ట్ క్యాన్సర్ చికిత్సలో 'లిక్విడ్ బయాప్సీ'తో విప్లవాత్మక మార్పులు..!

సాక్షి లైఫ్ : రొమ్ము క్యాన్సర్ బాధితులకు ఊరటనిచ్చే వార్త. క్యాన్సర్ చికిత్స ఎంతవరకు ఫలిస్తోంది? మందులు సరిగ్గా పనిచేస్తున్నాయా లేదా? అనే విషయాన్ని ఇప్పుడు మరింత వేగంగా తెలుసుకునే అవకాశం కలిగింది. సంప్రదాయ 'టిష్యూ బయాప్సీ' (tissue biopsy) కంటే వేగంగా ఫలితాలను, నొప్పి లేకుండా బ్లడ్ టెస్ట్ ద్వారానే 'లిక్విడ్ బయాప్సీ' చేయవచ్చని తాజా పరిశోధనలు వెల్లడిస్తున్నాయి.

 

ఇది కూడా చదవండి..Prediabetes : ప్రీడయాబెటిస్‌ కు గుండె జబ్బుల ప్రమాదానికి లింక్ ఏంటి..?

ఇది కూడా చదవండి..Shock for Tattoo Lovers..! టాటూస్ తో 29శాతం స్కిన్ క్యాన్సర్ ముప్పు..

ఇది కూడా చదవండి..Coconut Water : కొబ్బరి బొండం నీళ్లతో బరువు తగ్గొచ్చా..?

ఇది కూడా చదవండి..Obesity and inflammation : ఒబెసిటీకి ఇన్‌ఫ్లమేషన్‌కు లింక్ ఏమిటి..?

 

కణితి ఉన్న చోట..

సాధారణంగా క్యాన్సర్ తీవ్రతను తెలుసుకోవాలంటే కణితి ఉన్న చోట కణజాలాన్ని సేకరించి పరీక్షించాల్సి ఉంటుంది. ఇది రోగికి కొంత ఇబ్బందికరమైన ప్రక్రియ. అయితే, లిక్విడ్ బయాప్సీ ద్వారా కేవలం కొద్దిపాటి రక్తాన్ని సేకరించి, అందులో ప్రవహించే క్యాన్సర్ కణాల DNA (ctDNA)ను విశ్లేషిస్తారు.

వేగవంతమైన ఫీడ్‌బ్యాక్..

 కీమోథెరపీ లేదా ఇతర టార్గెటెడ్ థెరపీలు ప్రారంభించిన కేవలం నాలుగు వారాల్లోనే అవి ఎంతవరకు పని చేస్తున్నాయో ఈ పరీక్ష ద్వారా గుర్తించవచ్చు.

చికిత్సలో మార్పులు..

 ఒకవేళ మందులు ఆశించిన ఫలితాన్ని ఇవ్వకపోతే, క్యాన్సర్ మరింత ముదరక ముందే చికిత్స విధానాన్ని మార్చడానికి వైద్యులకు ఇది వీలు కల్పిస్తుంది.

ప్రాణాలు నిలిపే 'ముందస్తు' హెచ్చరిక..

లండన్‌లోని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ క్యాన్సర్ రీసెర్చ్ (ICR) చేసిన అధ్యయనం ప్రకారం.. చికిత్స ప్రారంభమైన కొద్ది రోజుల్లోనే రక్తంలో క్యాన్సర్ DNA స్థాయిలు తగ్గుముఖం పట్టకపోతే, ఆ చికిత్స విఫలమయ్యే అవకాశం ఉందని ముందుగానే తెలుసుకోవచ్చు. తద్వారా సమయం వృథా కాకుండా రోగికి ప్రత్యామ్నాయ మందులను అందించవచ్చు. ఇది రోగి జీవన కాలాన్ని (Survival rate) గణనీయంగా పెంచుతుందని నిపుణులు చెబుతున్నారు.

ప్రయోజనాలు..? 

ఆపరేషన్ లేదా కోత అవసరం లేదు, కేవలం రక్త పరీక్ష మాత్రమే. స్కాన్‌లలో కణితులు కనిపించక ముందే రక్తంలోని మార్పులను ఇది పసిగడుతుంది. చికిత్స కాలంలో ఎన్నిసార్లైనా ఈ పరీక్షను సురక్షితంగా నిర్వహించవచ్చు. క్యాన్సర్ చికిత్స అనేది ప్రతి రోగికి భిన్నంగా ఉంటుంది. లిక్విడ్ బయాప్సీ ద్వారా ఏ రోగికి ఏ మందు సరిపోతుందో త్వరగా నిర్ణయించవచ్చు. ఇది రొమ్ము క్యాన్సర్ కేర్ లో ఒక 'గేమ్ ఛేంజర్' కానుంది. 

 

ఇది కూడా చదవండి..మీరు ఆరోగ్యంగా బరువు తగ్గాలంటే..? 

ఇది కూడా చదవండి..Brain health : మీ బ్రెయిన్ కంప్యూటర్ లాగా పనిచేయాలంటే ఈ ఆహారపదార్థాలు తినండి..

ఇది కూడా చదవండి..అధిక బరువు తగ్గాలంటే రోజుకి ఎన్ని క్యాలరీలు బర్న్ అవ్వాలి..? 

ఇది కూడా చదవండి..టిపికల్ ఫీవర్స్ అంటే ఏమిటి..? వాటి లక్షణాలు ఎలా ఉంటాయి..? 

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

Tags : breast-cancer cancer-treatment breast-cancer-treatment breast-cancer-support breast-cancer-screening breast-health liquid-biopsy medical-revolution
Newsletter

Please subscribe for more updates...!

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.

Get In Touch

Door No 6-3-249/1, Sakshi Towers, Beside Care Hospital, Near City Center, Road No 1, Banjara Hills-500034

040 2325 6000

life@sakshi.com

Follow Us

© News. All Rights Reserved. by sakshi.com