Boost Longevity : ఇలాంటి వ్యాయామాలు చేస్తే మీ ఆరోగ్యానికి, ఆయుర్దాయానికి తిరుగుండదు..
సాక్షి లైఫ్ : నిండు నూరేళ్లు ఆరోగ్యంగా జీవించాలని ప్రతి ఒక్కరికీ ఉంటుంది. అయితే ఆ శతమానం కేవలం అదృష్టం మీదో, జన్యువుల మీదో ఆధారపడి ఉండదని.. మనం చేసే శారీరక శ్రమే మన ఆయుష్షును నిర్ణయిస్తుందని తాజా పరిశోధనలు వెల్లడిస్తున్నాయి. హార్వర్డ్ హెల్త్ అండ్ బ్రిటీష్ మెడికల్ జర్నల్ (BMJ) ప్రచురించిన తాజా నివేదికల ప్రకారం.. కేవలం ఒకే రకమైన వ్యాయామం కంటే, రకరకాల శారీరక శ్రమల మేళవింపుతో ఆయుష్షు గణనీయంగా పెరుగుతుందని తేలింది.
ఇది కూడా చదవండి..కిడ్నీ దానం చేసిన తర్వాత ఆ వ్యక్తికి ఎలాంటి ఫాలో-అప్ కేర్ అవసరం..
ఇది కూడా చదవండి..పీసీఓడీ సమస్యకు ప్రధాన కారణాలు ఏమిటి..?
ఇది కూడా చదవండి..ఈ 5 సప్లిమెంట్స్ కు డబ్బు దండగ అంటున్న వైద్యనిపుణులు..!
ఏయే వ్యాయామాలు ఎంత ప్రయోజనం..?
కొన్ని రకాల క్రీడలు, వ్యాయామాలు అకాల మరణ ముప్పును తగ్గిస్తాయని పరిశోధకులు చెబుతున్నారు. టెన్నిస్, బ్యాడ్మింటన్ వంటి క్రీడల వల్ల ప్రాణాంతక ముప్పు సుమారు 15శాతం తగ్గుతుంది. సామాజిక అనుబంధం, శారీరక శ్రమ రెండూ తోడవ్వడం దీనికి ప్రధాన కారణం.
బ్రిస్క్ వాకింగ్ అంటే వేగంగా నడక.. రోజుకు కనీసం 20 నిమిషాల వేగవంతమైన నడక వల్ల గుండె జబ్బుల ముప్పు 31శాతం వరకు తగ్గుతుంది. వారానికి రెండు రోజులు కండరాలకు పనిచెప్పే వ్యాయామాలు (Resistance Training) చేస్తే ఆయుష్షు 13శాతం పెరిగే అవకాశం ఉంది. ఈత, సైక్లింగ్ వంటివి ఊపిరితిత్తుల సామర్థ్యాన్ని పెంచి, జీవక్రియను మెరుగుపరుస్తాయి.
ఇవన్నీ ముఖ్యమే..
ఒకే పనిని రోజూ చేయడం కంటే.. నడకతో పాటు అప్పుడప్పుడు యోగా, వారానికి ఒకసారి ఈత, వీలున్నప్పుడు మెట్లు ఎక్కడం వంటి రకరకాల పనులు చేసేవారిలో అకాల మరణ ముప్పు 19శాతం తక్కువగా ఉంటుందని నిపుణులు గుర్తించారు. మన శరీరం కొత్త రకమైన శ్రమకు అలవాటు పడే క్రమంలో కణాలు మరింత దృఢంగా మారుతాయని పరిశోధకులు వివరిస్తున్నారు.
నిపుణుల సూచనలు..
కనీసం వారానికి రెండున్నర గంటల పాటు మధ్యస్థ స్థాయి వ్యాయామం తప్పనిసరి. ఆఫీసులో పని చేసేవారు ప్రతి గంటకు ఒకసారి 5 నిమిషాల పాటు నడవడం వల్ల రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. లిఫ్టుకు బదులు మెట్లు వాడటం వల్ల కాళ్ళ కండరాలు దృఢపడటమే కాకుండా ఆయుష్షు 10శాతం పెరుగుతుంది. వ్యాయామంతో పాటు 7 నుంచి 8 గంటల నిద్ర, సమతుల ఆహారం తోడైతేనే 'ఆరోగ్యవంతమైన ఆయుష్షు' సాధ్యమవుతుందని వైద్యనిపుణులు చెబుతున్నారు.
ఇది కూడా చదవండి..సంతానోత్పత్తిని పెంచడానికి ఎలాంటి ఫుడ్స్ తప్పనిసరి అంటే..?
ఇది కూడా చదవండి..వేగంగా బరువు తగ్గించే ఓట్జెంపిక్ డ్రింక్ ట్రెండ్.. డైటీషియన్లు ఏమంటున్నారంటే..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
