Non-Alcoholic Liver Disease Cases : పెరుగుతున్న 'నాన్ ఆల్కహాలిక్' లివర్ డిసీజెస్ : 2050 నాటికి 180 కోట్లకు బాధితుల సంఖ్య..!

షేర్ చేయండి:

సాక్షి లైఫ్ : ప్రపంచవ్యాప్తంగా కాలేయ వ్యాధులు ప్రమాదకర స్థాయిలో పెరుగుతున్నాయని ప్రముఖ అంతర్జాతీయ వైద్య పత్రిక 'లాన్సెట్' (Lancet) తన తాజా అధ్యయనంలో హెచ్చరించింది. ముఖ్యంగా మారుతున్న జీవనశైలి, ఆహారపు అలవాట్ల కారణంగా 'మెటబాలిక్ అసోసియేటెడ్ స్టీటోటిక్ లివర్ డిసీజ్' (MASLD) బారిన పడుతున్న వారి సంఖ్య ఆందోళనకరంగా మారుతోంది.

 

ఇది కూడా చదవండి..Weight loss : బరువు తగ్గడం కోసం 'ఫేక్ ఫాస్టింగ్' ఉపయోగపడుతుందా..?

ఇది కూడా చదవండి..విటమిన్ సి లోపించినప్పుడు కనిపించే ముఖ్య లక్షణాలు ఇవే.. 

ఇది కూడా చదవండి.. ఎసిడిటీని అంతమొందించే ఇంటి చిట్కాలు.. 

 

అధ్యయనం ఏం చెబుతోంది..?

లాన్సెట్ నివేదిక ప్రకారం.. 2023 నాటికి ప్రపంచవ్యాప్తంగా సుమారు 130 కోట్ల మంది ఈ రకమైన కాలేయ వ్యాధితో బాధపడుతున్నారు. ఇదే ధోరణి కొనసాగితే, 2050 నాటికి ఈ బాధితుల సంఖ్య 180 కోట్లకు చేరుకునే ప్రమాదం ఉందని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు.

ప్రధాన కారణాలు ఇవే..

ఈ వ్యాధి విస్తరించడానికి ప్రధానంగా రెండు అంశాలు దోహదం చేస్తున్నాయని పరిశోధకులు గుర్తించారు. అధిక బరువు (Obesity): శరీరంలో పెరిగే కొవ్వు కాలేయంపై తీవ్ర ప్రభావం చూపుతోంది. మధుమేహం (High Blood Sugar): రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో లేకపోవడం వల్ల కాలేయ కణాలు దెబ్బతింటున్నాయి.

ముంచుకొస్తున్న ముప్పు.. 

సాధారణంగా కనిపించే ఈ కొవ్వు కాలేయ సమస్య (Fatty Liver) సకాలంలో గుర్తించకపోతే ప్రాణాంతక పరిస్థితులకు దారితీస్తుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.

సిర్రోసిస్ (Cirrhosis)..కాలేయం పూర్తిగా గట్టిపడిపోయి పనికిరాకుండా పోవడం.

కాలేయ క్యాన్సర్..ఇన్ఫ్లమేషన్ పెరిగి క్యాన్సర్ గడ్డలు ఏర్పడటం.

కాలేయం వైఫల్యం..పరిస్థితి విషమించి కాలేయ మార్పిడి తప్పనిసరి కావడం.

జాగ్రత్త పడండి ఇలా..


కాలేయాన్ని పదిలంగా ఉంచుకోవడానికి నిపుణులు ఈ సూచనలు చేస్తున్నారు..

బరువు నియంత్రణ: సరైన వ్యాయామం, యోగా ద్వారా శరీర బరువును అదుపులో ఉంచుకోవాలి.

ఆహార నియమాలు: చక్కెర, నూనె పదార్థాలు తగ్గించి.. పీచు పదార్థాలు (Fiber) ఎక్కువగా ఉండే పండ్లు, కూరగాయలు తీసుకోవాలి.

క్రమం తప్పకుండా పరీక్షలు: ముందస్తుగా కాలేయ పనితీరు పరీక్షలు (LFT) చేయించుకోవడం ద్వారా ముప్పును గుర్తించవచ్చు.

షుగర్ వ్యాధి ఉన్నవారు మందులు వాడుతూ చక్కెర స్థాయిలను ఎప్పటికప్పుడు తనిఖీ చేసుకోవాలి. కాలేయ వ్యాధి మొదట్లో ఎటువంటి లక్షణాలను చూపదు. అందుకే నిశ్శబ్దంగా ప్రాణాలు తీసే ఈ వ్యాధి పట్ల ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.

 

ఇది కూడా చదవండి..డిప్రెషన్ ఉన్న వారిలో ఎలాంటి మార్పులు కనిపిస్తాయి..?

ఇది కూడా చదవండి.. రసాయనాలతో పండిన పుచ్చకాయను ఎలా కనుక్కోవచ్చు..

ఇది కూడా చదవండి..అధిక బరువు తగ్గాలంటే రోజుకి ఎన్ని క్యాలరీలు బర్న్ అవ్వాలి..?  

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.