ఔషధాల తయారీలో తేలు విషాన్ని వాడతారా..?   

షేర్ చేయండి:
ఔషధాల తయారీలో తేలు విషాన్ని వాడతారా..?   

సాక్షి లైఫ్ : తేలు కుట్టినా పాము కుట్టిన దాంతో సమానం. అంటే చాలా ప్రమాదకరం. తేలు విషం ఎంత డేంజరో..! ఆ విషం రేటు కూడా చాలా కాస్ట్లీ . మనిషికి  తేళ్లు చాలా ప్రమాదకరం. ఎందుకంటే ఇవి కుట్టాయి అంటే చాలు మనిషి ప్రాణాలు కోల్పోయే ప్రమాదం కూడా ఉంటుంది. ఇక పాములు తేళ్ల కు సంబంధించిన విషం మనిషి శరీరం లోకి వెళ్తే మనిషి బతకడం చాలా కష్టం. 

ఇది కూడా చదవండి.. ఆరోగ్యంగా ఉన్నవాళ్లకు ప్రోటీన్ సప్లిమెంట్లు అవసరంలేదంటున్న వైద్యులు..

ఇది కూడా చదవండి..టిపికల్ ఫీవర్స్ అంటే ఏమిటి..? వాటి లక్షణాలు ఎలా ఉంటాయి..? 

ఇది కూడా చదవండి..మీరు ఆరోగ్యంగా బరువు తగ్గాలంటే..? 

 అసలు విషయం ఏమిటంటే..? వీటి విషంతో మనిషికి ఉపయోగపడే  ఔషధాలను తయారు చేస్తున్నారు. ఈ క్రమంలోనే సర్పాలు కీటకాలు గా పేరున్న తేలు విషం కోట్లలోనే పలుకుతుంది. ఏకంగా లీటరు తేలు విషయం 80 కోట్ల రూపాయలు పలుకుతుందట. ఇది ఎంత చెప్పినా నమ్మాలి అనిపించేలా లేదు కదా. 

కానీ ఇది నిజమే టర్కీకి చెందిన మెటీన్ ఒరిన్లెర్ అనే వ్యక్తి తేళ్ల కు ఓ ఫామ్హౌస్ ఏర్పాటు చేసిమరీ అందులో వాటిని పెంచుతున్నాడు. వేల సంఖ్యలో తేళ్లను పెంచుతూ.. వాటి విషాన్ని సేకరిస్తూన్నాడు. ఆ తర్వాత ఆ విషాన్ని గడ్డకట్టేలా చేసి తరువాత పొడిగా మార్చి విక్రయిస్తాడు. అయితే లీటర్ తేలు విషం ధర 80 కోట్ల పైమాటే.. ఇలా తీసిన తేలు విషాన్ని యాంటీబయోటిక్స్, కాస్మోటిక్స్, పెయిన్ కిల్లర్ ల తయారీలో ఉపయోగిస్తారట. అయితే 300 నుంచి 400 తేళ్ల నుంచి ఒక గ్రాము విషాన్నిసేకరిస్తున్నారు.  

ఇది కూడా చదవండి.. 40 ఏళ్ల తర్వాత ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేసుకోవచ్చా..? 

ఇది కూడా చదవండి..లివర్ సంబంధిత సమస్యలను ఎలా గుర్తించాలి..? 

ఇది కూడా చదవండి..నడక, పరుగు.. ఈ రెండిటిలో ఏది ఉత్తమం..? 

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి. 

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.