E. Coli Bacterial Infection : తీవ్రమైన కడుపునొప్పికి ‘ఈ-కోలి’ బ్యాక్టీరియా ఇన్‌ఫెక్షన్ కారణం కావచ్చు.. బీకేర్ ఫుల్..!

షేర్ చేయండి:

సాక్షి లైఫ్ : మారిన జీవనశైలి, ఆహారపు అలవాట్ల వల్ల ఈ రోజుల్లో కడుపునొప్పి, గ్యాస్, అజీర్తి వంటి సమస్యలు సర్వసాధారణ మైపోయాయి. చాలామంది ఇవి కేవలం మసాలాలు, వేపుళ్లు ఎక్కువగా తినడం వల్లే వస్తున్నాయని సరిపెట్టుకుంటారు. కానీ, పదే పదే వేధించే తీవ్రమైన కడుపునొప్పి వెనుక ‘ఈ-కోలి’ (E. coli) బ్యాక్టీరియా ఇన్‌ఫెక్షన్ ఉండే ప్రమాదం ఉందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా వేసవి, వర్షాకాలాల్లో ఈ ముప్పు మరీ ఎక్కువ.

ఇది కూడా చదవండి.. టీబీని సకాలంలో గుర్తించకపోతే ఏమౌతుంది..? 

ఇది కూడా చదవండి.. పీడకలలు రావడానికి కారణాలేంటి..?

 

 ఇది కూడా చదవండి.. ఎర్ర రక్త కణాలు, తెల్ల రక్త కణాల మధ్య వ్యత్యాసం..?

 

ఈ-కోలి అంటే ఏమిటి..? ఎలా వ్యాపిస్తుంది..?

సాధారణంగా ‘ఈ-కోలి’ అనే బ్యాక్టీరియా మన ప్రేగులలో సహజంగానే ఉంటుంది. అయితే, ఇందులో కొన్ని ప్రమాదకరమైన రకాలు (Strains) శరీరంలోకి ప్రవేశించినప్పుడు మాత్రమే తీవ్ర అనారోగ్యానికి దారితీస్తుంది.

కలుషిత నీరు, ఆహారం.. సరిగ్గా ఉడకని మాంసం, కడగని పండ్లు, కూరగాయలు తినడం వల్ల.

పరిశుభ్రత లోపించడం.. కలుషితమైన తాగునీరు లేదా ఇన్‌ఫెక్షన్ ఉన్న వ్యక్తిని తాకినప్పుడు చేతులు శుభ్రం చేసుకోకపోవడం వల్ల ఇది వేగంగా వ్యాపిస్తుంది.

ఇన్‌ఫెక్షన్ లక్షణాలు ఎలా ఉంటాయి..?

ఈ-కోలి ఇన్‌ఫెక్షన్ బారిన పడితే సాధారణంగా 3 నుంచి 4 రోజుల్లో లక్షణాలు బయటపడతాయి.

తీవ్రమైన కడుపునొప్పి, తిమ్మిర్లు (Cramps)..

నిరంతర విరేచనాలు..కొన్నిసార్లు రక్తంతో కూడిన విరేచనాలు..

వికారం, వాంతులు..

తేలికపాటి జ్వరం, నీరసం..

ఇన్‌ఫెక్షన్ తీవ్రమైతే విరేచనాల వల్ల శరీరంలోని నీరు, ఎలక్ట్రోలైట్లు హరించుకుపోయి 'డీహైడ్రేషన్' బారిన పడే ప్రమాదం ఉంది. చిన్నపిల్లలు, వృద్ధులు, రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నవారిలో ఈ సమస్య మరింత జటిలంగా మారుతుంది.

 ఈ-కోలి ఇన్‌ఫెక్షన్ రాకుండా తీసుకోవాల్సిన ప్రధాన జాగ్రత్తలు..

ఈ-కోలి బ్యాక్టీరియా బారిన పడకుండా ఉండాలంటే మన దైనందిన జీవితంలో కొన్ని ముఖ్యమైన ఆరోగ్య సూత్రాలను పాటించాలి. అన్నింటికంటే మొదటిది చేతుల శుభ్రత. భోజనానికి ముందు, అలాగే మరుగుదొడ్డిని ఉపయోగించిన తర్వాత చేతులను సబ్బు, శుభ్రమైన నీటితో కనీసం 20 సెకన్ల పాటు బాగా కడుక్కోవడం వల్ల చేతుల ద్వారా బ్యాక్టీరియా శరీరంలోకి చేరకుండా అడ్డుకోవచ్చు.

రెండవది ఆహార నియమాలు. మనం తినే ఆహారం ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండాలి. ముఖ్యంగా మాంసాహారాన్ని తక్కువ ఉష్ణోగ్రత వద్ద కాకుండా, బాగా ఉడికించి బాక్టీరియా నశించేలా మాత్రమే తినాలి. అలాగే పచ్చి కూరగాయలు, ఆకుకూరలు, పండ్లను నేరుగా తినకుండా మొదట ఉప్పు నీటిలో లేదా మంచి నీటిలో శుభ్రంగా కడిగిన తర్వాతే ఉపయోగించాలి.

అత్యంత కీలకమైనది సురక్షిత తాగునీరు. కలుషిత నీటి ద్వారా ఈ ఇన్‌ఫెక్షన్ వేగంగా వ్యాపిస్తుంది కాబట్టి, ఎల్లప్పుడూ కాచి చల్లార్చిన నీటిని లేదా సరిగ్గా ఫిల్టర్ చేసిన నీటిని మాత్రమే తాగాలి. ఈ చిన్నపాటి జాగ్రత్తలు పాటించడం ద్వారా కడుపు ఇన్‌ఫెక్షన్ల ముప్పు నుంచి  మనల్ని మనం కాపాడుకోవచ్చు.

ఎప్పుడు వైద్యుడిని సంప్రదించాలి..?

కడుపునొప్పి భరించలేనంతగా ఉన్నా, విరేచనాలలో రక్తం పడుతున్నా, జ్వరం తగ్గకపోయినా అస్సలు నిర్లక్ష్యం చేయవద్దు. వెంటనే నిపుణులైన వైద్యుడిని సంప్రదించాలి. వైద్యుల సలహా లేకుండా సొంతంగా యాంటీబయాటిక్స్ లేదా విరేచనాలు తగ్గే మందులు వాడకూడదు. ఇది ఇన్‌ఫెక్షన్‌ను మరింత తీవ్రం చేసే అవకాశం ఉంది. శరీరంలో నీటి శాతం తగ్గకుండా ఉండటానికి కొబ్బరినీళ్లు, ఓఆర్‌ఎస్ ద్రావణం లాంటి ద్రవపదార్థాలు ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి.

 

ఇది కూడా చదవండి.. తినే ఆహారానికి, అనారోగ్య సమస్యలకు లింక్ ఏంటి..? 

ఇది కూడా చదవండి.. వేసవికాలంలో కళ్లను కాపాడుకునేదెలా..?  

ఇది కూడా చదవండి.. పీడకలలు రావడానికి కారణాలేంటి..? 

ఇది కూడా చదవండి.. ప్రాణాంతకమైన వ్యాధులకు కారణమయ్యే జంతువులు.. 

ఇది కూడా చదవండి.. వేసవికాలంలో కళ్లను కాపాడుకునేదెలా..?  

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.