లిప్ స్టిక్ తో ఇవే దుష్ప్రభావాలు.. 

సాక్షి లైఫ్ : లిప్‌స్టిక్‌ తయారీలో అనేక రసాయనాలు కలుపుతారు. వీటిని నిరంతరం ఉపయోగించడం వల్ల అలర్జీలు లేదా ఇన్‌ఫెక్షన్లు తలెత్తుతాయి. లిప్‌స్టిక్‌ను నిరంతరం అప్లై చేయడం వల్ల పెదవుల రంగు నల్లబడుతుంది.పెదవులకు వేసుకున్న లిప్ స్టిక్ ఏదైనా తినేటప్పుడు ఆహారం ద్వారా కడుపులోకి ప్రవేశించి అనేక వ్యాధులకు కారణమవుతుంది.

చాలా ప్రమాదం.. 

ఇది కూడా చదవండి..మధుమేహ సమస్య ఉన్నవారు ఏమేం పండ్లు తినాలి..? ఏమేం తినకూడదు..? 

 లిప్ స్టిక్ లో ఉండే లెడ్, అల్యూమినియం, క్రోమియం, కాడ్మియం, మెగ్నీషియం శరీరంలోకి చేరితే చాలా ప్రమాదం. లిప్ స్టిక్ లో ఉండే అల్యూమినియం అల్సర్ వంటి ప్రమాదకరమైన వ్యాధులకు కారణమవుతుంది.కొంతమంది మహిళలు లిప్‌స్టిక్‌ను ఐషాడోగా ఉపయోగిస్తారు. ఇది కళ్ళకు తీవ్రమైన హాని కలిగిస్తుంది. ప్రెగ్నెన్సీ సమయంలో లిప్ స్టిక్ ను నిరంతరం వాడటం వల్ల సమస్యగా మారవచ్చు.నిరంతరం లిప్ స్టిక్ వేసుకోవడం వల్ల కూడా కిడ్నీపై తీవ్ర ప్రభావం 

లిప్‌స్టిక్ హానిని ఎలా నివారించాలంటే..? 

 హెర్బల్ లిప్‌స్టిక్స్ మాత్రమే ఎంచుకోండి. ఇలాంటివి వాడడం వల్ల  ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. 
 లిప్ స్టిక్ వేసుకునే ముందు, పెదవులపై బేస్ అప్లై చేయండి, దీని కోసం కన్సీలర్ ఉపయోగించండి.
 డార్క్ లిప్‌స్టిక్‌ను ఎంచుకునేటప్పుడు, పదార్థాన్ని చూడండి.
 గర్భధారణ సమయంలో లిప్ స్టిక్ వేసుకోవడం మానుకోండి.
 వారానికి 3 సార్లు కంటే ఎక్కువ లిప్ స్టిక్ వేసుకోకూడదు.
కెమికల్స్ లేని,  పారాబెన్ లేని లిప్‌స్టిక్‌ను మాత్రమే ఎంచుకోండి.
  లిప్ స్టిక్ ను ఎక్కువ సమయం ఉంచొద్దు.
మంచి బ్రాండ్ లిప్ స్టిక్ మాత్రమే వాడండి..  

ఇది కూడా చదవండి.. ఆయుష్షు రహస్యాలను గురించి చెప్పిన 111ఏళ్ల వృద్ధుడు..    

ఇది కూడా చదవండి.. WHO Report : ఈ వ్యాధి ప్రపంచంలో అత్యధిక మరణాలకు కారణమవుతోంది.. 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

Tags : women-health skin-disease skin-care-tips side-effects skin-cancer skin-problems healthy-skin skin-health skin-problem cosmetics-products beauty-products skin-infection lipsticks
Newsletter

Please subscribe for more updates...!

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.

Get In Touch

Door No 6-3-249/1, Sakshi Towers, Beside Care Hospital, Near City Center, Road No 1, Banjara Hills-500034

040 2325 6000

life@sakshi.com

Follow Us

© News. All Rights Reserved. by sakshi.com