Winter care : సైనస్ ఉంటే చలికాలంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి..?
సాక్షి లైఫ్ : చల్లని పానీయాలు అస్సలు తీసుకోకూడదు. వేడి పానీయాలు మాత్రమే తీసుకోవడం ఉత్తమం. సైనస్ సమస్య ఉంటే హాట్ వాటర్ తీసుకోవడం వల్ల ఉపశమనం లభిస్తుంది. హాట్ వాటర్ తాగడం వల్ల మూసుకుపోయిన ముక్కు క్లియర్ అవుతుంది.సైనస్ సమస్య ఉన్నవారికి తరచుగా ముక్కు కారుతున్న సమయంలో ఆవిరి తీసుకోవడం వల్ల కొంతమేర ఉపశమనం కలుగుతుంది.
ఇది కూడా చదవండి..ఓఆర్ఎస్ ఆరోగ్యానికి మంచిదేనా..? ఎనర్జీ డ్రింక్స్ వల్ల కలిగే అనారోగ్య సమస్యలు..?
ఇది కూడా చదవండి..విటమిన్ సి లోపించినప్పుడు కనిపించే ముఖ్య లక్షణాలు ఇవే..
ఇది కూడా చదవండి..అధిక బరువు తగ్గాలంటే రోజుకి ఎన్ని క్యాలరీలు బర్న్ అవ్వాలి..?
ఇది కూడా చదవండి..టిపికల్ ఫీవర్స్ అంటే ఏమిటి..? వాటి లక్షణాలు ఎలా ఉంటాయి..?
ఇది కూడా చదవండి..మీరు ఆరోగ్యంగా బరువు తగ్గాలంటే
నాసికా రంధ్రాలు మూసుకుపోయినట్లు అనిపించినా కూడా ఆవిరి పట్టడంవల్ల సమస్య తాత్కాలికంగా కొంత వరకు పరిష్కారం అవుతుంది. ఆల్కహాల్ సేవించడం వల్ల సైనస్ సమస్యలు మరింతగా పెరుగుతాయి. కాబట్టి పొరపాటున కూడా మద్యం తీసుకోకపోవడం మంచిది. చల్లని గాలి, చల్లని నీరు, చల్లని పదార్థాలకు దూరంగా ఉండడం మంచిదని వైద్యనిపుణులు సూచిస్తున్నారు. అంతేకాదు చల్లని నీటితో కూడా తలస్నానం చేయవద్దని వారు చెబుతున్నారు.
మద్యం సేవించడం వల్ల సైనస్ సమస్యలు మరింతగా పెరుగుతాయా..? చల్లని గాలి, చల్లని నీరు, చల్లని పదార్థాలకు దూరంగా ఉండకాపోతే సైనస్ సమస్య మరింతగా పెరుగుతుందా..?అసలు సైనసిటిస్ అనేది ఎన్నిరకాలున్నది..? క్రానిక్ సైనసిటిస్ కు అక్యూట్ సైనసిటిస్ తేడా ఏంటి..? ఈ రెండిటిలో ఏది తీవ్రమైంది..? సైనస్ ఉంటే చల్లని నీటితో కూడా తలస్నానం చేయకూడదా..? అనే అంశాలకు సంబంధించి ప్రముఖ ఈఎన్టీ సర్జన్ డా. మొయినుద్దీన్ మహమ్మద్ సాక్షి లైఫ్ కు వివరించారు. ఆ విశేషాలను తెలుసుకోవాలంటే ఈ కింది వీడియోను చూడండి..
ఇది కూడా చదవండి..రాత్రి 9 గంటల తర్వాత డిన్నర్ చేయడం వల్ల కలిగే నష్టాలు ఇవే....?
ఇది కూడా చదవండి..రోజూ బెల్లం తింటే బరువు పెరుగుతారా..?
ఇది కూడా చదవండి..అధిక బరువు తగ్గాలంటే రోజుకి ఎన్ని క్యాలరీలు బర్న్ అవ్వాలి..?
ఇది కూడా చదవండి..టిపికల్ ఫీవర్స్ అంటే ఏమిటి..? వాటి లక్షణాలు ఎలా ఉంటాయి..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
