Breast Cancer in male : హెచ్చరిస్తున్న అధ్యయనాలు.. రొమ్ము క్యాన్సర్ పట్ల పురుషులు జాగ్రత్తగా ఉండాలి..  

షేర్ చేయండి:

సాక్షి లైఫ్ : రొమ్ము క్యాన్సర్ అనగానే అది కేవలం మహిళలకు మాత్రమే పరిమితం అనే భావన మన సమాజంలో బలంగా ఉంది. కానీ, తాజా గణాంకాలు పురుషుల్లోనూ ఈ ముప్పు పెరుగు తోందని హెచ్చరిస్తు న్నాయి. అవగాహన లేమి, నిర్లక్ష్యం కారణంగా నలుగురిలో ఒక పురుషుడు క్యాన్సర్ నాలుగో దశకు చేరుకున్న తర్వాతే ఆసుపత్రికి వస్తున్నారని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

 

ఇది కూడా చదవండి..టిపికల్ ఫీవర్స్ అంటే ఏమిటి..? వాటి లక్షణాలు ఎలా ఉంటాయి..? 

ఇది కూడా చదవండి..ఓఆర్ఎస్ ఆరోగ్యానికి మంచిదేనా..? ఎనర్జీ డ్రింక్స్ వల్ల కలిగే అనారోగ్య సమస్యలు..? 

ఇది కూడా చదవండి..ఒత్తిడి, ఆందోళనను తగ్గించడానికి బెస్ట్ ఫుడ్ ఏది..?

 

హైదరాబాద్‌ లోని సనత్‌నగర్ ఈఎస్‌ఐసీ మెడికల్ కాలేజీలో 2019 నుంచి 2025 మధ్య నిర్వహించిన ఆరేళ్ల అధ్యయనం ప్రకారం.. ఈ వ్యాధి బారిన పడిన పురుషుల్లో దాదాపు 87 శాతం మంది మొదటిసారి వైద్యుడిని సంప్రదించే సమయానికే క్యాన్సర్ ముదిరిన స్థితి స్టేజ్-3 లేదా స్టేజ్-4 లో ఉంటున్నారు. దీనికి ప్రధాన కారణం వ్యాధి గుర్తింపులో జాప్యం. లక్షణాలు కనిపించినా అవి క్యాన్సర్ కావచ్చని చాలా మంది పురుషులు ఊహించకపోవడమే ఇందుకు కారణం.

లక్షణాలు ఎలా ఉంటాయి..? 

గడ్డలు ఏర్పడటం, చనుమొనలు లోపలికి కుంచించుకుపోవడం లేదా చర్మం మందంగా మారడం వంటివి ప్రాథమిక సంకేతాలు. లక్షణాలు కనిపించినప్పటి నుంచి రోగ నిర్ధారణ జరిగే వరకు సగటున ఆరు నెలల సమయం వృధా అవుతోంది.

 వ్యాధి ముదిరిన తర్వాత చికిత్స అందించడం సవాలుగా మారుతోంది. అధ్యయనంలో పాల్గొన్న వారిలో కొందరు వ్యాధి తీవ్రత పెరగడం వల్ల మరణించగా, మరికొందరు మధ్యలోనే చికిత్సను నిలిపివేసినట్లు తేలింది.

అవగాహన ఉంటేనే రక్షణ.. 

పురుషుల్లో రొమ్ము క్యాన్సర్ కేసుల శాతం 1 శాతం కంటే తక్కువ అయినప్పటికీ, అది ప్రాణాంతకం కాకముందే గుర్తించడం అత్యంత కీలకం. పురుషులకు సంబంధించిన ప్రత్యేక మార్గదర్శకాలు (Guidelines) లేకపోవడం, సామాజిక వివక్ష, అవగాహన లేకపోవడం వల్ల వ్యాధి ముదిరిన తర్వాతే చికిత్సకు వస్తున్నారు. పురుషులు కూడా ఇలాంటి లక్షణాలను గమనిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలని వైద్య నిపుణులు సూచుస్తున్నారు. 

మనం ఏం చేయాలి..?

రొమ్ము భాగంలో ఏదైనా మార్పు కనిపిస్తే అది సాధారణమైనదిగా భావించవద్దు. కుటుంబంలో ఎవరికైనా ఈ సమస్య ఉంటే జెనెటిక్ టెస్టింగ్ చేయించుకోవడం ఉత్తమం. ఇది కేవలం మహిళల వ్యాధి అనుకోవడం పొరపాటు. సిగ్గు పడకుండా వైద్య చికిత్స పొందడం ద్వారా ప్రాణాలను కాపాడుకోవచ్చు. తెలంగాణ ప్రభుత్వం క్యాన్సర్‌ను 'నోటిఫైబుల్ డిసీజ్' తప్పనిసరిగా నమోదు చేయాల్సిన వ్యాధిగా గుర్తించడం వల్ల భవిష్యత్తులో మెరుగైన గణాంకాలు, చికిత్సా విధానాలు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.

 

ఇది కూడా చదవండి..అధిక బరువు తగ్గాలంటే రోజుకి ఎన్ని క్యాలరీలు బర్న్ అవ్వాలి..? 

ఇది కూడా చదవండి..బ్లడ్ క్యాన్సర్ ను గుర్తించడానికి ఎలాంటి పరీక్షలు చేస్తారు..?

ఇది కూడా చదవండి..రాత్రి 9 గంటల తర్వాత డిన్నర్ చేయడం వల్ల కలిగే నష్టాలు ఇవే..

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి..

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.