Axial Spondyloarthritis : దీర్ఘకాలంగా వెన్నునొప్పి వేధిస్తోందా..? అది 'ఆక్సియల్ స్పాండిలో ఆర్థరైటిస్' కావచ్చు..!
సాక్షి లైఫ్ : ప్రతి చిన్న వెన్నునొప్పిని సాధారణ అలసటగా భావించి నిర్లక్ష్యం చేస్తున్నారా? అయితే జాగ్రత్త! అది దీర్ఘకాలికంగా వేధించే 'ఆక్సియల్ స్పాండిలో ఆర్థరైటిస్' (Axial Spondyloarthritis - axSpA) కావచ్చని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇటీవల సౌదీ అరేబియాలో జరిగిన ఒక పరిశోధన ఈ వ్యాధి లక్షణాలు, జన్యుపరమైన అంశాలపై ఆసక్తికర విషయాలను వెల్లడించింది.
ఇది కూడా చదవండి..విటమిన్ సి లోపించినప్పుడు కనిపించే ముఖ్య లక్షణాలు ఇవే..
ఇది కూడా చదవండి..రాత్రి 9 గంటల తర్వాత డిన్నర్ చేయడం వల్ల కలిగే నష్టాలు ఇవే..
ఇది కూడా చదవండి..ఓఆర్ఎస్ ఆరోగ్యానికి మంచిదేనా..? ఎనర్జీ డ్రింక్స్ వల్ల కలిగే అనారోగ్య సమస్యలు..?
ఏంటీ వ్యాధి అసలు..?
ఇది వెన్నెముక దానికి అనుబంధంగా ఉండే కీళ్లపై ప్రభావం చూపే ఒక రకమైన 'కీళ్ల వాత' వ్యాధి. సాధారణ వెన్నునొప్పి విశ్రాంతి తీసుకుంటే తగ్గుతుంది, కానీ ఈ వ్యాధి వల్ల వచ్చే నొప్పి విశ్రాంతి తీసుకుంటే పెరుగుతుంది, నడక లేదా వ్యాయామం చేస్తే తగ్గుతుంది.
'HLA-B27' జన్యువుతో ముప్పు ఎక్కువేనా..?
మన శరీరంలోని HLA-B27 అనే జన్యువు ఈ వ్యాధి తీవ్రతను నిర్ధారించడంలో కీలక పాత్ర పోషిస్తుందని తాజా పరిశోధనలో తేలింది. ఈ జన్యువు పాజిటివ్ ఉన్న వారిలో శరీరంలో ఇన్ఫ్లమేషన్ (Inflammation) ఎక్కువగా ఉంటోంది. రక్త పరీక్షల్లో 'సి-రియాక్టివ్ ప్రోటీన్' (CRP) స్థాయిలు అధికంగా కనిపిస్తున్నాయి. వీరిలో కేవలం వెన్నునొప్పే కాకుండా, కళ్లు ఎర్రబడటం, చూపు మందగించడం (యూవియైటిస్) వంటి సమస్యలు కూడా తలెత్తుతున్నాయి. మహిళల కంటే పురుషుల్లోనే ఈ జన్యువు ప్రభావం వల్ల వ్యాధి లక్షణాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
నిశ్శబ్ద శత్రువును పట్టించే అస్త్రం..!
చాలా మందిలో రక్త పరీక్షల్లో ఏమీ తేలకపోయినా, వెన్నునొప్పి బాధిస్తూనే ఉంటుంది. అటువంటి సమయాల్లో ఎమ్ ఆర్ ఐ స్కాన్ సంజీవనిలా పనిచేస్తుంది. ఈ పరిశోధన ప్రకారం, జన్యువు ఉన్నా లేకపోయినా.. వెన్నెముకలో వచ్చే మార్పులను ఎమ్ ఆర్ ఐ ద్వారా మాత్రమే కచ్చితంగా గుర్తించవచ్చు. వ్యాధిని గుర్తించడంలో జరిగే జాప్యం (Diagnostic Delay) వల్ల వెన్నెముక పూసలు ఒకదానికొకటి కలిసిపోయే ప్రమాదం ఉంది. అందుకే లక్షణాలు కనిపించిన వెంటనే వైద్యులను సంప్రదించాలి.
చికిత్స ఎలా..?
వ్యాధి ఏ దశలో ఉందనే దానిపై ఆధారపడి వైద్యులు చికిత్స అందిస్తారు. నొప్పి నివారణ మందులతో పాటు 'బయోలాజిక్స్' (Biologics) వంటి అధునాతన ఇంజెక్షన్లు ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి.
క్రమం తప్పకుండా చేసే వ్యాయామం ఈ వ్యాధిని అదుపులో ఉంచడానికి ప్రాణవాయువులా పనిచేస్తుంది. మూడు నెలలకు పైగా వరుసగా వెన్నునొప్పి ఉన్నా, తెల్లవారుజామున వెన్ను బిగుసుకుపోయినట్లు అనిపించినా వెంటనే 'రుమటాలజిస్టులను సంప్రదించండి.
ఇది కూడా చదవండి..లవ్ హార్మోన్ అంటే ఏమిటి..
ఇది కూడా చదవండి..వేగంగా బరువు తగ్గించే ఓట్జెంపిక్ డ్రింక్ ట్రెండ్.. డైటీషియన్లు ఏమంటున్నారంటే..?
ఇది కూడా చదవండి..ఎలాంటి కొలెస్ట్రాల్ ఆరోగ్యానికి హానికరం..?
ఇది కూడా చదవండి..హార్ట్ ఎటాక్ తర్వాత తొలి 60 నిమిషాలు ఎందుకంత కీలకం..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
