గ్యాస్ట్రిక్ సమస్యలకు ఇవి కూడా కారణాలే.. 

షేర్ చేయండి:

సాక్షి లైఫ్ : గ్యాస్ట్రిక్ సమస్యలకు అనేక కారణాలున్నాయి. వాటిలో ముఖ్యమైనవి: ఆహారపు అలవాట్లు: క్రమం లేని ఆహారపు అలవాట్లు, సమయానికి తినకపోవడం, అతిగా తినడం, పడుకునే ముందు భారీ భోజనం చేయడం వంటివి గ్యాస్ట్రిక్ సమస్యలకు దారితీస్తాయి. మనం తీసుకునే కొన్ని ఆహార పదార్థాలు గ్యాస్ట్రిక్ సమస్యలను మరింత పెంచుతాయి. అటువంటి వాటి గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.. 

ఇది కూడా చదవండి..వైద్యుల భరోసానే బాధితులకు ఔషధం.. 

ఇది కూడా చదవండి..కొత్తగా దంతాలు వచ్చిన పిల్లలకూ బ్రష్ చేయాలా..? 

ఇది కూడా చదవండి.. క్షయవ్యాధి ఏయే అవయవాలపై ప్రభావం చూపుతుంది..? 

  ఇది కూడా చదవండి.. డయాబెటీస్ కు ప్రధాన కారణాలు ఏంటి..?

 

ఒత్తిడి : మానసిక ఒత్తిడి నేరుగా జీర్ణవ్యవస్థపై ప్రభావం చూపుతుంది. ఒత్తిడి పెరిగినప్పుడు కడుపులో యాసిడ్ ఉత్పత్తి పెరిగి గ్యాస్ట్రిక్ సమస్యలు తలెత్తుతాయి.

వేగంగా తినడం: ఆహారాన్ని సరిగ్గా నమలకుండా వేగంగా మింగేయడం వల్ల గాలి కడుపులోకి వెళ్లి గ్యాస్ ఏర్పడుతుంది.

శారీరక శ్రమ లేకపోవడం: వ్యాయామం లేకపోవడం వల్ల జీర్ణక్రియ మందగిస్తుంది, ఇది గ్యాస్ట్రిక్ సమస్యలకు దారితీస్తుంది.

కొన్ని మందులు: నొప్పి నివారణ మందులు వంటి కొన్ని రకాల మందులు కడుపులో పుండ్లు, గ్యాస్ట్రిక్ సమస్యలను కలిగిస్తాయి.

అధిక బరువు: అధిక బరువు కూడా గ్యాస్ట్రిక్ సమస్యలకు కారణం కావచ్చు.

ధూమపానం, మద్యం: పొగతాగడం, మద్యం సేవించడం జీర్ణవ్యవస్థను దెబ్బతీసి గ్యాస్ట్రిక్ సమస్యలను పెంచుతాయి.

 

ఇది కూడా చదవండి..40 ఏళ్ల తర్వాత ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేసుకోవచ్చా..? 

ఇది కూడా చదవండి.. లివర్ సంబంధిత సమస్యలను ఎలా గుర్తించాలి..?

 

 గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.