Reasons Behind Rising Heart Attack Risk : యువతలో గుండెపోటు ముప్పునకు కారణాలివే..

షేర్ చేయండి:

సాక్షి లైఫ్ : ఒత్తిడి, ఉరుకుల పరుగుల జీవితం, జంక్ ఫుడ్ సంస్కృతి చిన్నారుల ప్రాణాల మీదకు తెస్తోంది. వృద్ధాప్య సమస్యగా భావించే గుండెపోటు.. నేడు పదిహేనేళ్ల ప్రాయంలోనే పలకరిస్తోంది. అప్రమత్తతే దీనికి ఏకైక పరిష్కారం. గుండె జబ్బులు అనగానే ఒకప్పుడు అరవై ఏళ్లు పైబడిన వారి సమస్యగా భావించేవారు. కానీ, ప్రస్తుత పరిస్థితులు భీతి గొల్పుతున్నాయి. కౌమారదశలో (Adolescence) ఉన్న వారు కూడా ధమనులు మూసుకుపోయే ప్రమాదాన్ని ఎదుర్కొంటున్నారు. అసమతుల్య ఆహారం, శారీరక శ్రమ లేకపోవడం, మితిమీరిన ఒత్తిడి వంటివి చిన్న వయసులోనే గుండెను బలహీనపరుస్తున్నాయి.

ఇది కూడా చదవండి..ఒత్తిడి, ఆందోళనను తగ్గించడానికి బెస్ట్ ఫుడ్ ఏది..?

ఇది కూడా చదవండి..మార్నింగ్ వాక్ చేసేటపుడు ఈ ఆరు విషయాలు గుర్తుంచుకోండి..ఎందుకంటే..?

ఇది కూడా చదవండి..బ్లడ్ క్యాన్సర్ ను గుర్తించడానికి ఎలాంటి పరీక్షలు చేస్తారు..?

 

ముప్పునకు కారణాలు..

ఆధునిక జీవనశైలిలో భాగంగా తీసుకుంటున్న జంక్ ఫుడ్, ప్యాక్ చేసిన స్నాక్స్, అధిక నూనెలు, మసాలా పదార్థాలు శరీరంలో చెడు కొలెస్ట్రాల్‌ను పెంచుతున్నాయి. ఇవి రక్త నాళాల్లో కొవ్వు పేరుకుపోయేలా చేసి, రక్త ప్రసరణకు అడ్డంకులు కలిగిస్తున్నాయి. వీటికి తోడు గంటల తరబడి స్మార్ట్‌ఫోన్లు, కంప్యూటర్లకే పరిమితం కావడం. నిద్రలేమి, విపరీతమైన పోటీ వల్ల కలిగే మానసిక ఒత్తిడి, ధూమపానం, మద్యపానం వంటి దురలవాట్లకు లోనుకావడం. శారీరక వ్యాయామం లేకపోవడం.

లక్షణాలను గుర్తించండిలా..

చిన్నపాటి పనికే తీవ్రంగా నీరసించిపోవడం, మెట్లు ఎక్కినా, కాసేపు వేగంగా నడిచినా ఆయాసం రావడం. మధ్యమధ్యలో ఛాతిలో ఒత్తిడి లేదా నొప్పిగా అనిపించడం. గుండె వేగంగా కొట్టుకోవడం లేదా కళ్లు తిరగడం. రక్తపోటులో మార్పుల వల్ల తరచుగా తలనొప్పి రావడం.


గుండెను పదిలంగా ఉంచుకోవడానికి నిపుణుల సూచనలు.. 

డైట్‌లో ఆకుకూరలు, తాజా పండ్లు, తృణధాన్యాలు ఉండేలా చూసుకోవాలి. తీపి పానీయాలు, జంక్ ఫుడ్‌కు దూరంగా ఉండాలి. ప్రతిరోజూ కనీసం 30 నుంచి 45 నిమిషాల పాటు నడక, యోగా, సైక్లింగ్ లేదా క్రీడల్లో పాల్గొనాలి. మొబైల్, ల్యాప్‌టాప్ వాడకాన్ని తగ్గించి.. ఆరుబయట గడిపేలా ప్రణాళిక చేసుకోవాలి. ధ్యానం చేయడం, సంగీతం వినడం వంటి అలవాట్లతో మానసిక ప్రశాంతతను పొందాలి.గుండె ,మెదడు ఆరోగ్యానికి రోజుకు 7-8 గంటల నిద్ర తప్పనిసరి. రక్తపోటు, కొలెస్ట్రాల్ స్థాయిలను ఎప్పటికప్పుడు పరీక్షించుకోవడం ద్వారా ముప్పును ముందే గుర్తించవచ్చు.

ఇది కూడా చదవండి.. కొరియన్ డైట్ తో వేగంగా బరువు తగ్గడం ఎలా..?  

ఇది కూడా చదవండి..డిప్రెషన్ ఉన్న వారిలో ఎలాంటి మార్పులు కనిపిస్తాయి..?

ఇది కూడా చదవండి..బ్లడ్ క్యాన్సర్‌లో ఎన్ని రకాలు ఉన్నాయి..?

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.