Warning Signs : శరీరం ఇచ్చే ఈ సంకేతాల వెనుక తీవ్ర వ్యాధి దాగి ఉండవచ్చు..
సాక్షి లైఫ్ : మారుతున్న జీవనశైలి, ఆహారపు అలవాట్ల కారణంగా చిన్న వయసులోనే మధుమేహం, బీపీ, గుండె జబ్బుల బారిన పడుతున్నారు. అయితే, మన శరీరంలో కనిపించే కొన్ని చిన్నచిన్న మార్పులను ముందే పసిగడితే తీవ్రమైన అనారోగ్య సమస్యల నుంచి బయటపడవచ్చు.
కళ్లు, చర్మం రంగు మారడం..
కళ్లలోని తెల్లటి భాగం, చర్మం పసుపు రంగులోకి మారితే అది పచ్చకామెర్లకు (jaundice) సంకేతం కావచ్చు. శరీరంలో బిలిరుబిన్ స్థాయిలు పెరగడం, హెపటైటిస్ వంటి కాలేయ సమస్యలు ఉన్నప్పుడు ఇలా జరుగుతుంది. పెదవులు లేదా చర్మం నీలిరంగులోకి మారితే శరీరంలో ఆక్సిజన్ కొరత ఉందని అర్థం. మూత్రం ముదురు రంగులో రావడం, ఆకలి తగ్గడం కూడా కాలేయ సమస్యలకు సూచనలు.
ఇది కూడా చదవండి..టిపికల్ ఫీవర్స్ అంటే ఏమిటి..? వాటి లక్షణాలు ఎలా ఉంటాయి..?
ఇది కూడా చదవండి.. మీరు ఆరోగ్యంగా బరువు తగ్గాలంటే..?
ఇది కూడా చదవండి..కాలేయ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారా..? మౌనంగా పెరుగుతున్న ఈ వ్యాధి గురించి తెలుసా..?
ఇది కూడా చదవండి..లవ్ హార్మోన్ అంటే ఏమిటి..?
కాళ్లు, ముఖంపై వాపు..
ఎక్కువసేపు నిలబడటం వల్ల కాళ్ల వాపు వస్తుందని చాలామంది నిర్లక్ష్యం చేస్తుంటారు. కానీ, ఇది కిడ్నీ లేదా కాలేయ సమస్యల వల్ల శరీరంలో అదనంగా నీరు చేరడానికి సంకేతం కావచ్చు.
కళ్లు, ముఖం చుట్టూ వాపు వస్తే అది నిద్రలేమి లేదా అలర్జీ అని భావిస్తారు. కానీ, ఆ వాపు తగ్గకుండా అలాగే ఉంటే మూత్రపిండాల సమస్యల వల్ల శరీరంలో ప్రోటీన్ స్థాయిలు పడిపోయాయని గుర్తించాలి.
చర్మంపై తీవ్రమైన దురద, దద్దుర్లు..
సాధారణంగా అలర్జీ లేదా ఇన్ఫెక్షన్ వల్ల దురద వస్తుంది. కానీ, దీర్ఘకాలం పాటు దద్దుర్లు తగ్గకపోతే అది ఆటోఇమ్యూన్ వ్యాధులకు (lupus) కారణం కావచ్చు. నిరంతరంగా చర్మంపై తీవ్రమైన దురదగా అనిపిస్తే అది కాలేయం లేదా కిడ్నీ సమస్యలకు ముందస్తు హెచ్చరికగా కూడా భావించాలి.
విపరీతమైన జుట్టు రాలడం..
రోజువారీగా కొద్దిగా జుట్టు రాలడం సహజమే. కానీ అకస్మాత్తుగా గుత్తులు గుత్తులుగా జుట్టు రాలిపోతుంటే పోషకాహార లోపం, థైరాయిడ్ సమస్యలు లేదా తీవ్రమైన ఒత్తిడి కారణం కావచ్చు.
ముఖ్యంగా మహిళల్లో హార్మోన్ల అసమతుల్యత వల్ల కూడా ఈ సమస్య తీవ్రంగా కనిపిస్తుంది.
శరీరం అందించే ఇలాంటి ముందస్తు హెచ్చరికలను సాధారణ మైనవిగా భావించి నిర్లక్ష్యం చేయకూడదు. ఈ లక్షణాలు తరచుగా కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించి అవసరమైన పరీక్షలు చేయించుకోవడం ద్వారా ప్రాణాపాయ స్థితికి చేరకుండా కాపాడుకోవచ్చు.
ఇది కూడా చదవండి..అధిక బరువు తగ్గాలంటే రోజుకి ఎన్ని క్యాలరీలు బర్న్ అవ్వాలి..?
ఇది కూడా చదవండి..ఆరోగ్యప్రయోజనాలు పొందాలంటే సలాడ్ ను ఏ టైమ్ లో తినాలి..?
ఇది కూడా చదవండి..లవ్ హార్మోన్ అంటే ఏమిటి..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
