ఎముకల ఆరోగ్యానికి చిట్కాలు..
సాక్షి లైఫ్ : పలురకాల ఆహారాలు తీసుకోవడం వల్ల కాల్షియం తగ్గడం ఆస్టియో పోరోసిస్, ఎముకల విరగడం, కీళ్ల నొప్పుల వంటి సమస్యలకు దారితీస్తుంది. ముఖ్యంగా యవ్వనంలోనే ఎముకలు బలహీనపడటం ఆందోళనకలిగిస్తోంది. ఎముకల ఆరోగ్యానికి కాల్షియం చాలా కీలకం. అయితే, రోజూ తీసుకునే కొన్ని ఆహారాలు శరీరంలోని కాల్షియాన్ని తగ్గించి, ఎముకలను బలహీనపరుస్తాయని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఇది కూడా చదవండి..బ్లడ్ క్యాన్సర్ ను గుర్తించడానికి ఎలాంటి పరీక్షలు చేస్తారు..?
ఇది కూడా చదవండి..బ్లడ్ క్యాన్సర్‌లో ఎన్ని రకాలు ఉన్నాయి..?
ఇది కూడా చదవండి..మార్నింగ్ వాక్ చేసేటపుడు ఈ ఆరు విషయాలు గుర్తుంచుకోండి..ఎందుకంటే..?
కాల్షియంను తొలగించే ఆహారాల గురించి తెలుసుకుని, వాటిని నియంత్రించడం ద్వారా ఎముకల బలాన్ని కాపాడుకోవచ్చు. కాల్షియం, విటమిన్ "డి" సమృద్ధిగా ఉన్న ఆహారాలు (పాల ఉత్పత్తులు, ఆకుకూరలు, బాదం) తీసుకోండి.
ఉప్పు, చక్కెర, కెఫీన్, ఆల్కహాల్‌ను నియంత్రించడంతోపాటు రోజూ వ్యాయామం (వెయిట్ బేరింగ్ ఎక్సర్‌సైజ్‌లు) చేయడం ఎముకలను బలపరుస్తుంది. ఎముకల ఆరోగ్య పరీక్షలు (బోన్ డెన్సిటీ టెస్ట్) చేయించుకోండి.
ఎముకల ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి సమతుల ఆహారం, ఆరోగ్యకరమైన జీవనశైలి అవసరమని నిపుణులు సూచిస్తున్నారు. పై ఆహారాలను అతిగా తీసుకోవడం మానేసి, కాల్షియం నష్టాన్ని నివారించండి. ఎముకల సమస్యలు కనిపిస్తే వైద్యులను సంప్రదించాలి.
ఇది కూడా చదవండి..డిప్రెషన్ ఉన్న వారిలో ఎలాంటి మార్పులు కనిపిస్తాయి..?
ఇది కూడా చదవండి..ఒత్తిడి, ఆందోళనను తగ్గించడానికి బెస్ట్ ఫుడ్ ఏది..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి..
