సాక్షి లైఫ్ : మార్నింగ్ వాక్ ఆరోగ్యానికి చాలా ఉపయోగకరమైనది. ఇది శరీరాన్ని శక్తివంతంగా ఉంచడమేకాకుండా, చురుకుగా ఉంచడానికి అవకాశం ఉంటుంది. సరైన సమయం ఎంచుకోండి, సరైన పధ్ధతిలో సన్నద్ధం అవ్వండి.. నడవడానికి కమ్ఫర్టబుల్ షూస్, ఆహ్లాదకరమైన దుస్తులు తప్పనిసరి. అయితే మార్నింగ్ వాక్ చేసేటప్పుడువీటితోపాటు మరి కొన్ని విషయాల్లో జాగ్రత్తలు తీసుకోకపోతే మోకాళ్ల నొప్పులు, ఇతర సమస్యలు వస్తాయని మీకు తెలుసా..? అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
ఇది కూడా చదవండి..లవ్ హార్మోన్ అంటే ఏమిటి..?
ఇది కూడా చదవండి..ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్ అంటే ఏమిటి..?
ఇది కూడా చదవండి..టాటూ వేయించుకున్న వాళ్లు రక్తదానంచేయకూడదా..?
నడవడం..
ఉదయాన్నే నడవడం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. మీరు నడిచేటప్పుడు జాగ్రత్తగా ఉండకపోతే, మీ మోకాళ్లు దెబ్బతినే అవకాశం ఉంది. మార్నింగ్ వాక్ చేస్తున్నప్పుడు మోకాళ్లు ఆరోగ్యంగా ఉండాలంటే కొన్ని విషయాలను గుర్తుంచుకోవాలి. మార్నింగ్ వాక్ చేయడంవల్ల మోకాలి కండరాలు దృఢంగా ఉంటాయి. అంతేకాదు మోకాలి క్వాడ్రిస్ప్స్ , హామ్ స్ట్రింగ్స్ వంటి కండరాలను యాక్టివేట్ చేస్తుంది. వాకింగ్ సమయంలో మీరు సరైన బూట్లు ధరించకపోయినా, ఏటవాలుగా ఉన్ననేలపై నడవడం లేదా మీరు అనుసరించే వాకింగ్ టెక్నిక్ సరైనది కానట్లయితే, మీ మోకాళ్లపై అదనపు ఒత్తిడి పడి మోకాలి సంబంధిత సమస్యలు పెరుగుతాయి.
ముఖ్యంగా మోకాలి నొప్పి, వాపు లేదా ఇతర మోకాలి సంబంధిత సమస్యల ప్రమాదాలు తలెత్తుతాయి. కాబట్టి అటువంటి పరిస్థితిలో మార్నింగ్ వాక్ చేసేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం చాలా ముఖ్యం. లేకుంటే మార్నింగ్ వాక్ చేయడంవల్ల ప్రయోజనం కంటే నష్టమే ఎక్కువ.
మార్నింగ్ వాక్ చేసేటప్పుడు..
సరైన బూట్లు మీ మోకాళ్లకు రక్షణ అందిస్తాయి. మంచి బూట్లు అంటే తగినంత వంపు మద్దతు, పాడింగ్ కలిగి ఉండాలి. ఇవి నడుస్తున్నప్పుడు పాదాలకు అసౌకర్యాన్ని కలిగించవు. దీనితో పాటు, మీ పాదాలు, మోకాళ్లపై ఒత్తిడి లేకుండా, షూల పరిమాణం కూడా సరిగ్గా ఉండేలా చూసుకోవాలి.
నెమ్మదిగా ప్రారంభించండి..
తక్కువ దూరంతో నడక ప్రారంభించండి. ఒకేసారి ఎక్కువ దూరం నడవడం వల్ల మోకాళ్లపై అదనపు ఒత్తిడి పడుతుంది. కాబట్టి క్రమంగా దూరంతోపాటు నడక సమయాన్ని పెంచండి.
సరైన నడక పద్ధతి..
నడుస్తున్నప్పుడు మీ పాదాలను సరిగ్గా ఉంచండి. పాదాన్ని పూర్తిగా కిందకు ఉంచే బదులు, తేలికగా అడుగులు వేయండి. మోకాళ్లను నిటారుగా ఉంచండి. దీంతో మోకాళ్లపై అనవసర ఒత్తిడి తగ్గుతుంది.
చదునైన ప్రదేశం..
నడక కోసం మృదువైన, చదునైన ప్రదేశాన్ని ఎంచుకోండి. కాంక్రీటు లేదా ఇతర గట్టి ఉపరితలాలు మోకాళ్లపై అదనపు ఒత్తిడిని కలిగిస్తాయి. పార్కులో లేదా పచ్చని గడ్డిపై నడవడం మోకాళ్లకు చాలా మంచిది.
వార్మప్..
నడకకు ముందు, తర్వాత స్ట్రెచింగ్ చేయండి. క్వాడ్రిస్ప్స్ , హామ్ స్ట్రింగ్స్ వంటి కండరాలను సాగదీయడం వల్ల మోకాళ్లపై ఒత్తిడి తగ్గుతుంది.
అంతేకాదు కండరాలు ఫ్లెక్సిబుల్‌గా ఉంటాయి. లైట్ వార్మప్ శరీరాన్ని సిద్ధం చేయడంలో సహాయపడుతుంది.
బరువును అదుపులో ఉంచండి..
మీ బరువును అదుపులో ఉంచండి. ఎందుకంటే అధిక బరువు మోకాళ్లపై అదనపు ఒత్తిడిని కలిగిస్తుంది. సమతుల్య ఆహారం, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడంవల్ల మీ బరువును అదుపులో ఉంచడానికి వీలవుతుంది.
ఇది కూడా చదవండి..ఓరల్ క్యాన్సర్ కు కారణాలు..?
ఇది కూడా చదవండి..సహజంగా ఆక్సిటోసిన్ పెంచడానికి మార్గాలు..
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి..
Tags :Please subscribe for more updates...!
గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.
Door No 6-3-249/1, Sakshi Towers, Beside Care Hospital, Near City Center, Road No 1, Banjara Hills-500034
040 2325 6000
life@sakshi.com
© News. All Rights Reserved. by sakshi.com