20 ఏళ్లలోపు వారికే గుండెపోటు ఎక్కువగా రావడానికి ప్రధాన కారణాలు.. 

షేర్ చేయండి:

సాక్షి లైఫ్ : యువతలో గుండెపోటు కేసులు పెరగడానికి అనేక కారణాలున్నాయి.. వాటిలో ప్రధానంగా కొన్ని కేసులను పరిశీలిస్తే గుండె జబ్బులతో మరణించేవారిలో ఎక్కువగా ముప్పై ఏళ్ల వయసు లోపు ఉన్నవారే ఎక్కువగా ఉన్నారని వైద్యనిపుణులు చెబుతున్నారు. డాక్టర్ సలహా మేరకు క్రమం తప్పకుండా పలురకాల వైద్య పరీక్షలు చేయించుకోవాలి. ఇటీవల ఇండోర్‌లో 18 ఏళ్ల బాలుడు గుండెపోటుతో మరణించాడు, భారతదేశంలోని యువకులు ఈ ప్రమాదాన్ని ఎందుకు ఎదుర్కొంటున్నారు. యువకుల్లో గుండెపోటు ప్రమాదం పెరగడంపై కార్డియాలజిస్ట్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 

 ఇది కూడా చదవండి..బాడీ బిల్డింగ్ కోసం ఎక్కువగా ఎక్సర్సైజ్ చేస్తున్నారా..? 

 ఇది కూడా చదవండి..జామపండు తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలుసా..?

 ఇది కూడా చదవండి..గట్ మైక్రోబయోమ్ జీర్ణవ్యవస్థను ఎలా ప్రభావితం చేస్తుంది..?

 

గుండెపోటు ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న ఆరోగ్య సమస్య, ఇది కాలక్రమేణా తీవ్రమవుతోంది. వృద్ధాప్య సమస్య కాదు,  20 ఏళ్లలోపు వారు కూడా గుండెపోటుకు గురువుతున్నారు. ఇటీవల రెండు కేసులు వైద్యనిపుణులను ఆశ్చర్యపోయేలా చేశాయి.మొదటి కేసు మధ్యప్రదేశ్‌లోని ఇండోర్లోని ద్వారకాపురి ప్రాంతంలో 18 ఏళ్ల యువకుడు గుండెపోటుతో మరణించాడు. రాత్రి అతనికి ఛాతీలో తీవ్రమైన నొప్పి వచ్చి భయాందోళనకు గురయ్యాడు. కుటుంబ సభ్యులు అతన్ని ఆసుపత్రికి తీసుకెళ్లారు, కానీ వైద్యులు అతను చనిపోయినట్లు నిర్ధారించారు. వైద్య నివేదికలో మరణానికి కారణం గుండెపోటు అని పేర్కొన్నారు.
 
 ఇంట్లో పూజ నిర్వహించగా, ఆ యువకుడు కూడా పూజలో పాల్గొన్నాడు. రాత్రి వరకు అతను నార్మల్ గానే కనిపించాడు, కానీ తెల్లవారుజామున 2.30 గంటలకు అతను మేల్కొని ఛాతీ నొప్పిగా ఉందని చెప్పాడు. ఆ తర్వాత కొంత సమయం తరువాత అతను గుండె పోటుతో చనిపోయాడు.

రెండవ కేసు మహారాష్ట్రలోని ధరాశివ్ జిల్లాలోని షిండే కళాశాలలో జరిగింది, అక్కడ 20 ఏళ్ల విద్యార్థి వీడ్కోలు సమయంలో వేదికపై ప్రసంగిస్తుండగా అకస్మాత్తుగా పడిపోయి మరణించింది. మాట్లాడుతుండగానే వేదికపైనే పడిపోయింది. ఆసుపత్రికి తీసుకెళ్లడంతో మరణించినట్లు వెల్లడించారు డాక్టర్లు, మరణానికి కారణం గుండెపోటు అని వెల్లడించారు.

గత కొన్ని సంవత్సరాల డేటాను పరిశీలిస్తే, ఆఫీసులో పనిచేస్తున్నప్పుడు, పరిగెత్తుతున్నప్పుడు చాలా మందికి గుండెపోటు రావడం, లేదా గుండెపోటుతో మరణిస్తున్నారు. ఆశ్చర్యకరంగా, ఇందులో 30 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్నవారే ఎక్కువగా ఉన్నారు.

గుండెను ఆరోగ్యంగా ఉంచుకొనేందుకు చాలా మంది అనేక రకాల ప్రయోగాలు చేస్తున్నారు. సరైన ఆహారం తీసుకోవడంతోపాటు క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తున్నారు. అయితే, ఇటీవలి కాలంలో, క్రమం తప్పకుండా యోగా సాధన చేసేవారు, శారీరకంగా దృఢంగా ఉండే వాళ్లకు కూడా గుండెపోటు వచ్చినట్లు వార్తలు వెలుగులోకి వచ్చాయి. జీవనశైలి అలవాట్లు, అతిగా తినే రుగ్మతలు గుండె పోటు ప్రమాదాలను మరింతగా పెంచుతున్నాయని వైద్యనిపుణులు చెబుతున్నారు. అంతేకాదు పని ఒత్తిడి పెరగడంతోపాటు, పరిమితి లేని శారీరక వ్యాయామం కూడా హార్ట్ అటాక్ కు ప్రధాన కారణాలుగా పరిగణిస్తున్నారు డాక్టర్లు.

 

 ఇది కూడా చదవండి..టిపికల్ ఫీవర్స్ అంటే ఏమిటి..? వాటి లక్షణాలు ఎలా ఉంటాయి..? 

 ఇది కూడా చదవండి.. మీరు ఆరోగ్యంగా బరువు తగ్గాలంటే..? 

 ఇది కూడా చదవండి..వర్షాకాలంలో అజీర్ణ సమస్యతో బాధపడుతున్నారా..? ఈ ఆహారాలను తినకండి.. 

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.