Vitamin H: ఒత్తైన జుట్టుకు 'బయోటిన్' ఎలా పనిచేస్తుంది..? సప్లిమెంట్లపై వైద్యనిపుణులు ఏమంటున్నారు..?  

సాక్షి లైఫ్ : జుట్టు రాలడం (Hair Loss) అనేది ఈ రోజుల్లో చాలా మందిని బాధిస్తున్న సాధారణ సమస్య. జుట్టు పలుచబడటం, ఒత్తు తగ్గిపోవడంతో మనోవేదనకు గురవుతున్నవారు కోకొల్లలు. ఈ సమస్యకు పరిష్కారం వెతికే క్రమంలో చాలామంది 'బయోటిన్' (Biotin) సప్లిమెంట్లను ఆశ్రయిస్తారు. 'జుట్టు పెరుగుదలకు, బలానికి బయోటిన్ దివ్యౌషధం' అంటూ మార్కెట్‌లో విపరీతమైన ప్రచారం చేస్తూ ఉంటారు. అసలు బయోటిన్ అంటే ఏమిటి? ఇది నిజంగా జుట్టు రాలడాన్ని ఆపగలదా? ఈ సప్లిమెంట్లు తీసుకోవడం అందరికీ అవసరమా? అనే సందేహాలపై నిపుణులు, అధ్యయనాలు ఏం చెబుతున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం..   

 

ఇది కూడా చదవండి.. నోటి దుర్వాసనను తగ్గించే చిట్కాలు 

ఇది కూడా చదవండి..అధిక బరువు తగ్గాలంటే రోజుకి ఎన్ని క్యాలరీలు బర్న్ అవ్వాలి..? 

ఇది కూడా చదవండి..టిపికల్ ఫీవర్స్ అంటే ఏమిటి..? వాటి లక్షణాలు ఎలా ఉంటాయి..? 

 

బయోటిన్ అంటే ఏమిటి.. ? 

బయోటిన్‌ను విటమిన్-బి7 (Vitamin B7) లేదా విటమిన్-హెచ్ (Vitamin H) అని కూడా పిలుస్తారు. ఇది నీటిలో కరిగే (Water-soluble) బి-కాంప్లెక్స్ విటమిన్లలో ఒకటి. మన శరీరంలో కొవ్వులు, కార్బోహైడ్రేట్లు, ప్రొటీన్ల జీవక్రియ (Metabolism) ప్రక్రియలలో బయోటిన్ కీలక పాత్ర పోషిస్తుంది. జుట్టు, చర్మం, గోళ్లకు మూలమైన కెరాటిన్ (Keratin) అనే ప్రొటీన్‌ను ఉత్పత్తి చేయడంలో ఇది సహాయపడుతుంది. ఈ కారణంగానే దీనిని సౌందర్య పోషకం (Beauty Nutrient) అంటారు. 

బయోటిన్ సప్లిమెంట్లు జుట్టు రాలడాన్ని ఆపుతాయా? బయోటిన్ సప్లిమెంట్ల విషయంలో శాస్త్రీయ అధ్యయనాల ఫలితాలు కొంత మిశ్రమంగా ఉన్నాయి.

 లోపం ఉంటేనే అద్భుత ఫలితం (Proven Deficiency Cases) ఉంటుందని వైద్య నిపుణులు, అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి.  

 బయోటిన్ సప్లిమెంట్లు అత్యంత ప్రభావవంతంగా పనిచేసేది ఎప్పుడంటే..? శరీరంలో బయోటిన్ లోపం (Biotin Deficiency) ఉన్న వ్యక్తులలో మాత్రమే ఈ సప్లిమెంట్లు జుట్టు పెరుగుదలను గణనీయంగా మెరుగుపరుస్తాయని, రాలడాన్ని తగ్గిస్తాయని పరిశోధనల్లో తేలింది.  జన్యుపరమైన సమస్యలు, దీర్ఘకాలిక మద్యపానం, గర్భం లేదా కొన్ని రకాల మందుల వాడకం వంటి అరుదైన సందర్భాలలో మాత్రమే సాధారణంగా బయోటిన్ లోపం ఏర్పడుతుంది. ఈ లోపం ఉన్నవారిలో జుట్టు రాలడం, దద్దుర్లు, గోర్లు పెళుసుబారడం వంటి లక్షణాలు కనిపిస్తాయి.  

 సాధారణ స్థాయిలలో ప్రభావం తక్కువ (Normal Biotin Levels)శరీరంలో సాధారణ స్థాయిలో బయోటిన్ ఉన్న వ్యక్తులు సప్లిమెంట్లు తీసుకోవడం వల్ల జుట్టు పెరుగుదలలో ఎక్కువ తేడా కనిపించకపోవచ్చని కొన్ని సమీక్షా అధ్యయనాలు పేర్కొన్నాయి. జుట్టు రాలడానికి అసలైన కారణం హార్మోన్ల మార్పులు, ఒత్తిడి, ఐరన్ లోపం లేదా థైరాయిడ్ సమస్యలు.. 

 బయోటిన్ సప్లిమెంట్లు తీసుకోవడం వల్ల ప్రయోజనం ఉండకపోవచ్చు. జుట్టు రాలడానికి అనేక కారణాలు ఉంటాయి. కేవలం బయోటిన్ సప్లిమెంట్లు మాత్రమే అద్భుతాలు చేయలేకపోవచ్చు. మీ జుట్టు సమస్యకు అసలు కారణాన్ని తెలుసుకోవడానికి చర్మ వైద్య నిపుణులను  (Dermatologist) సంప్రదించాలి. 

బయోటిన్ ఎక్కడ దొరుకుతుంది..?

మన శరీరానికి అవసరమయ్యే బయోటిన్ చాలా వరకు మనం తీసుకునే సాధారణ ఆహారం నుంచే అందుతుంది. కాబట్టి సప్లిమెంట్ల కంటే సహజ ఆహారానికే ప్రాధాన్యత ఇవ్వడం మంచిది. గుడ్లు ముఖ్యంగా పచ్చసొన, ప్రొటీన్, బయోటిన్ లకు అద్భుతమైన మూలం. బాదం, వాల్‌నట్, వేరుశెనగ, పొద్దుతిరుగుడు గింజలు, కాలీఫ్లవర్, చిలగడదుంపలు, పీచు పదార్థాలతోపాటు, ఇతర పోషకాలలో కూడా బయోటిన్ ఉంటుంది. మాంసం.. కాలేయం (Liver), ఇతర మాంస ఉత్పత్తుల్లో అధికంగా ఉంటుంది. ఆకు కూరలలో బయోటిన్ లభిస్తుంది. 

మరి బయోటిన్ సప్లిమెంట్లు ఎప్పుడు తీసుకోవాలి..?

మీకు విపరీతంగా జుట్టు రాలడం, గోళ్లు పెళుసుగా మారడం వంటి లక్షణాలు ఉంటే, ముందుగా వైద్యుడిని సంప్రదించాలి. రక్త పరీక్షల ద్వారా బయోటిన్ లోపం నిర్ధారణ అయితే, వైద్యుల సలహా మేరకు సరైన మోతాదులో బయోటిన్ సప్లిమెంట్లను తీసుకోవడం సురక్షితం, ప్రయోజనకరం. 

జుట్టు రాలడానికి ఇతర పోషకాల లోపాలు అంటే ఐరన్, విటమిన్-డి వంటివి కూడా కారణం కావచ్చు కాబట్టి, మల్టీవిటమిన్ సప్లిమెంట్లు అవసరమా..? లేదా అనేది కూడా డాక్టర్‌ను అడిగి తెలుసుకోవాలి.  ఆరోగ్యకరమైన, ఒత్తైన జుట్టు కావాలంటే సమతుల్య ఆహారం, ఒత్తిడి లేని జీవనశైలి, సరైన జుట్టు సంరక్షణ విధానం తప్పనిసరి. కేవలం ఒకే ఒక్క సప్లిమెంట్‌పై ఆధారపడటం కంటే, మీ మొత్తం ఆరోగ్యంపై దృష్టి పెట్టడం మంచిది.

ఇది కూడా చదవండి.. మీరు ఆరోగ్యంగా బరువు తగ్గాలంటే..? 

ఇది కూడా చదవండి..రోజూ బెల్లం తింటే బరువు పెరుగుతారా..? 

ఇది కూడా చదవండి.. ఎలాంటి ఆసనాలు, ముద్రలు వేస్తే జ్ఞాపకశక్తి పెరుగుతుంది..? 

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

Tags : women-health hair-loss hair-loss-causes hair-loss-cure hair-loss-remedy collagen-supplements biotin vitamin-b7 health-benefits-of-biotin biotin-health-benefits
Newsletter

Please subscribe for more updates...!

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.

Get In Touch

Door No 6-3-249/1, Sakshi Towers, Beside Care Hospital, Near City Center, Road No 1, Banjara Hills-500034

040 2325 6000

life@sakshi.com

Follow Us

© News. All Rights Reserved. by sakshi.com