Walking Mistakes: వాకింగ్ చేసేటప్పుడు ఈ తప్పులు చేస్తున్నారా..?
సాక్షి లైఫ్: రోజూ నడవడం (వాకింగ్) ఆరోగ్యానికి చాలా మంచిది. బరువు తగ్గడం, గుండె ఆరోగ్యం మెరుగుపడటం, మానసిక ప్రశాంతత, శక్తిని పెంచుకోవడానికి వాకింగ్ ఎంతో సహాయ పడుతుంది. అయితే, వాకింగ్ చేసేటప్పుడు మీరు కొన్ని తప్పులు చేస్తున్నట్లయితే, అవి మీ గుండెకు తీవ్ర నష్టం కలిగించవచ్చు. చాలాసార్లు మనం తెలియకుండానే చేసే కొన్ని పొరపాట్లు గుండె ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతాయి. అవేంటో తెలుసుకుని, వాటిని సరిదిద్దుకోవడం చాలా ముఖ్యం.
ఇది కూడా చదవండి..కుంకుమ పువ్వుతో ఎనిమిది అద్భుతమైన ఆరోగ్యప్రయోజనాలు..
ఇది కూడా చదవండి..కొలెస్ట్రాల్ అంటే ఏమిటి..? ఇది ఎన్ని రకాలు..?
ఇది కూడా చదవండి.. 30 ఏళ్ల తర్వాత శరీరానికి కొల్లాజెన్ ఎందుకు ముఖ్యమంటే..?
అతి వేగంగా లేదా అతి నెమ్మదిగా నడవడం..
వాకింగ్ చేసేటప్పుడు సరైన వేగం చాలా ముఖ్యం. మీరు చాలా వేగంగా నడిస్తే, హార్ట్ బీట్ ఒక్కసారిగా పెరిగి గుండెకు ప్రమాదం కావచ్చు, ముఖ్యంగా గుండె జబ్బులు ఉన్నవారికి. అదే సమయంలో, చాలా నెమ్మదిగా నడిస్తే మీ గుండె కండరాలు బలోపేతం కావు.
తప్పు భంగిమలో నడవడం..
వాకింగ్ చేసేటప్పుడు శరీర భంగిమ (పోస్చర్) సరిగా లేకపోతే గుండె ఆరోగ్యం దెబ్బతింటుంది. వంగి నడవడం లేదా తప్పుగా నడవడం వల్ల సరిగా శ్వాస తీసుకోలేరు.
దీనివల్ల ఊపిరితిత్తులకు సరిపడా ఆక్సిజన్ అందదు. దీంతో గుండె ఎక్కువ శ్రమ పడాల్సి వస్తుంది. నిటారుగా నిలబడి, భుజాలను వదులుగా ఉంచి, ముందుకు చూస్తూ నడవాలి.
వార్మ్-అప్ చేయకుండానే మొదలు పెట్టడం..
వెంటనే వేగంగా నడవడం మొదలుపెడితే హార్ట్ బీట్ వేగంగా పెరిగి గుండెపై ఒత్తిడి పెరుగుతుంది. దీనిని నివారించడానికి, వాకింగ్ ముందు 5-10 నిమిషాలు స్ట్రెచింగ్ లేదా నెమ్మదిగా నడవడం వంటి వార్మ్-అప్ తప్పనిసరి. ఇది శరీరాన్ని, గుండెను వ్యాయామానికి సిద్ధం చేస్తుంది.
శరీరంలో నీటి శాతం తక్కువగా ఉండటం (డిహైడ్రేషన్)..
శరీరంలో నీటి శాతం తక్కువగా ఉంటే రక్తపోటు ప్రభావితమై, గుండె ఎక్కువ కష్టపడాల్సి వస్తుంది. వాకింగ్ ముందు, తర్వాత సరిపడా నీరు తాగాలి, ముఖ్యంగా వేసవిలో. ఒకవేళ మీరు ఎక్కువ దూరం నడిచేటట్లయితే, మధ్యలో కూడా నీరు తాగుతూ ఉండాలి.
టిఫిన్ తిన్న తర్వాత వేగంగా నడవడం..
కొంతమంది అల్పాహారం లేదా భోజనం చేసిన వెంటనే వేగంగా నడవడం మొదలుపెడతారు. ఇది గుండెకు హానికరం. తిన్న తర్వాత శరీరం ఎక్కువ శక్తిని జీర్ణక్రియ కోసం ఉపయోగిస్తుంది. ఇలాంటి సమయంలో వేగంగా నడిస్తే గుండెపై అదనపు భారం పడుతుంది. తిన్న తర్వాత కనీసం 30-45 నిమిషాలు ఆగి, ఆ తర్వాత నెమ్మదిగా నడవడం ప్రారంభించాలి.
క్రమం తప్పకుండా నడవకపోవడం..
కొంతమంది కొన్ని రోజులు నడవకుండా ఉండి, ఆ తర్వాత ఒకే రోజులో ఎక్కువ సేపు నడుస్తారు. ఈ క్రమరహిత విధానం గుండెకు మంచిది కాదు. గుండె ఆరోగ్యంగా ఉండాలంటే రోజూ 30-45 నిమిషాలు క్రమం తప్పకుండా నడవాలి.
కాలుష్యం ఉన్న ప్రాంతాల్లో నడవడం..
కాలుష్యం, వాహనాల పొగ ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో నడిస్తే, అది మీ ఊపిరితిత్తులు, గుండె రెండింటికీ హానికరం. వీలైనంత వరకు పార్కులు లేదా పచ్చదనం ఉన్న ప్రదేశాల్లో నడవడానికి ప్రయత్నించండి. ఉదయం పూట స్వచ్ఛమైన గాలిలో నడవడం మంచిది.
ఇది కూడా చదవండి..గుండెపోటు సంకేతాలు పురుషులు, మహిళలలో భిన్నంగా ఉంటాయా..?
ఇది కూడా చదవండి..వర్షాకాలంలో నివారించాల్సిన ఆహారాలు, కూరగాయలు
ఇది కూడా చదవండి..ఒత్తిడి, ఆందోళనను తగ్గించడానికి బెస్ట్ ఫుడ్ ఏది..?
ఇది కూడా చదవండి..వేగంగా బరువు తగ్గించే ఓట్జెంపిక్ డ్రింక్ ట్రెండ్.. డైటీషియన్లు ఏమంటున్నారంటే..?
ఇది కూడా చదవండి..మైక్రోసైటిక్ అనీమియా అంటే ఏమిటి..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
