సాక్షి లైఫ్ : గుండె అనేది మనిషి శరీరంలో అత్యంత కీలకమైన అవయవం. కాబట్టి ప్రతి ఒక్కరికీ గుండె ఆరోగ్యం చాలా ముఖ్యం. గత కొన్ని సంవత్సరాలుగా ప్రపంచవ్యాప్తంగా గుండె జబ్బుల కేసులు వేగంగా పెరుగుతున్నాయి. కొన్ని దశాబ్దాల క్రితం వరకు గుండె సంబంధిత సమస్యలు కేవలం అరవై ఏళ్లు దాటిన వారిలోనే ఎక్కువగా వచ్చేవి. కానీ ఇప్పుడు వయస్సుతో సంబంధం లేకుండానే హార్ట్ ప్రోబ్లమ్స్ వస్తున్నాయి. రోజురోజుకీ గుండె జబ్బులు ప్రాణాంతకమైన వ్యాధులుగా మారుతున్నాయని, కాబట్టి గుండె విషయంలో మరింత అప్రమత్తంగా ఉండాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
గుండె జబ్బులకు సంబంధించిన వాస్తవాలు..
హృదయ సంబంధ వ్యాధులు (CVD) కార్డియో వాస్క్యూలర్ డిసీజెస్ అంటారు. ఈ వ్యాధులకారణంగా 2019లో ప్రపంచవ్యాప్తంగా 17.9 మిలియన్ల మంది మరణించారని అంచనా. ఈ మరణాలలో 85శాతం హార్ట్ ఎటాక్ , హార్ట్ స్ట్రోక్ కారణంగా సంభవించాయి. అభివృద్ధి చెందుతున్న దేశాలతోపోలిస్తే వెనుకబడిన దేశాల్లోనే గుండె జబ్బుల కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ లెక్కలు వెల్లడిస్తున్నాయి.
హార్ట్ ప్రోబ్లమ్స్.. ఎలాంటి వారిలో ఎక్కువ..?
గుండె జబ్బులు వయసుతో సంబంధం లేదని, ఎవరికైనా వస్తాయని, అందుకే చిన్నప్పటి నుంచి జీవనశైలి, ఆహారం విషయంలో అప్రమత్తంగా ఉండాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఊబకాయం, షుగర్ వ్యాధిగ్రస్తులు, హైబీపీ ఉన్నవారు, పొగతాగేవారు, ఆల్కహాల్ ఎక్కువగా తీసుకునేవాళ్ళకు గుండె జబ్బులు ఎక్కువగా వచ్చే ప్రమాదం ఉందని పరిశోధకులు చెబుతున్నారు. రోజులో ఎక్కువసేపు ఒకే చోట కూర్చుని జాబ్ చేసేవారు, జంక్ ఫుడ్, ప్రాసెస్డ్ ఫుడ్స్ తీసుకునేవాళ్ల గుండె ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతుంది.
రాకుండా జాగ్రత్తలు..
40 ఏళ్ల వయస్సు తర్వాత, కొన్ని పరీక్షలు క్రమం తప్పకుండా చేయించుకోవాలి.
-తద్వారా ప్రమాదాలను గుర్తించడం సాధ్యమవుతుంది.
- ఫాస్ట్ ఫుడ్, కల్తీ ఆహారం, డ్రగ్స్ వంటి వాటికి దూరంగా ఉండాలి.
- ప్రతిరోజూ గంటసేపు నడవాలి, బరువు కూడా తగ్గించుకోవాలి.
- ఉప్పు, చక్కెరతోపాటు కొవ్వు పెంచే ఉత్పత్తులు తీసుకోకూడదు.
- మానసిక ఒత్తిడిని తగ్గించుకోవడం చాలా మంచిది.
-ప్రతిరోజూ సరిపడా నిద్ర అవసరం.
- ఛాతీ నొప్పిగా అనిపిస్తే వెంటనే డాక్టర్ వద్దకు వెళ్లి చెక్ చేయించుకోవడం ఉత్తమం.
-ప్రతిరోజూ పోషకాహారం తీసుకోవాలి. అందుకు తగినవిధంగా వ్యాయామం చేయాలి.
-రక్తంలో 200 mg/dL కొలెస్ట్రాల్ స్థాయి సాధారణమైనదిగా పరిగణిస్తారు. 239 mg/dL అంతకంటే ఎక్కువగా ఉంటే అది గుండెకు హానికరంగా భావిస్తారు.
ఎలాంటి ఫుడ్ తీసుకుంటే మంచిది..?
ఆకు కూరలలో విటమిన్ "కే "తోపాటు నైట్రేట్లు అధికంగా ఉంటాయి. ఇవి రక్తపోటును తగ్గించడంలోను, ధమనుల పనితీరును మెరుగుపరచడంలో సహాయపడతాయి. ఆకు కూరలు ఎక్కువగా తీసుకోవడం వల్ల గుండె జబ్బులు వచ్చే ప్రమాదం తక్కువ.
శుద్ధి చేసిన కార్బోహైడ్రేట్లు కరోనరీ హార్ట్ డిసీజ్ ప్రమాదాన్ని పెంచుతాయి. తృణధాన్యాలు మాత్రం గుండె ను సంరక్షిస్తాయి.
బెర్రీస్‌లో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. వాటిని తినడం వల్ల గుండె జబ్బులకు సంబంధించిన సమస్యలు తగ్గుతాయి. కాబట్టి స్ట్రాబెర్రీస్, బ్లూ బెర్రీస్ వంటివి తప్పనిసరిగా తినాలి.
కొవ్వు చేపలు, చేప నూనెలో ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు అధికంగా ఉంటాయి. ఇవి రక్తపోటు, ట్రైగ్లిజరైడ్స్, కొలెస్ట్రాల్‌తో సహా గుండె జబ్బుల ప్రమాద కారకాలను తగ్గించడంలో సహాయపడుతాయి.
కొలెస్ట్రాల్, బ్లడ్ ప్రెజర్ ను తగ్గించడంలో వాల్‌నట్స్ ఎంతగానో సహాయపడతాయి. అంతేకాదు గుండె జబ్బులు వచ్చే ప్రమాదాన్ని తగ్గిస్తాయని అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి.
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
Please subscribe for more updates...!
గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.
Door No 6-3-249/1, Sakshi Towers, Beside Care Hospital, Near City Center, Road No 1, Banjara Hills-500034
040 2325 6000
life@sakshi.com
© News. All Rights Reserved. by sakshi.com