కాలేయానికి హాని కలిగించే ఆహారాలేమిటి..?

షేర్ చేయండి:
కాలేయానికి హాని కలిగించే ఆహారాలేమిటి..?

సాక్షి లైఫ్ : ఆరోగ్యకరమైన కాలేయం కోసం ఆహారం విషయంలో శ్రద్ధ పెట్టడం చాలా ముఖ్యం. మనం ఏది తిన్నా అది మన కాలేయంపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతుంది. కొన్ని ఆరోగ్యకరమైన కాలేయానికి ఆహారాలు కాలేయానికి మేలు చేస్తాయి, మరికొన్ని కాలేయానికి హాని కలిగిస్తాయి. అందువల్ల, ఏ ఆహారాలు కాలేయానికి మేలు చేస్తాయో..ఏ ఆహారాలు హానికరమో తెలుసుకోవడం చాలా ముఖ్యం.

ఇది కూడా చదవండి..పురుషులతో పోలిస్తే..మహిళల్లో కంటి సంబంధిత సమస్యలు పెరగడానికి కారణాలేమిటి..?

ఇది కూడా చదవండి..బర్డ్ ఫ్లూ వైరస్ ఎన్ని డిగ్రీల సెల్సియస్ వరకు సజీవంగా ఉంటుంది..?

ఇది కూడా చదవండి..జాయింట్ పెయిన్స్ తగ్గించే సూపర్ ఫుడ్స్.. 

 

కొవ్వు ఎక్కువగా ఉన్న ఆహారం తినడం వల్ల కాలేయం దెబ్బతింటుంది. ఆహారంలో ఆరోగ్యకరమైన ఆహారాలను చేర్చకపోవడం వల్ల, కాలేయం దెబ్బతింటుంది. వ్యాధుల ప్రమాదం పెరుగుతుంది. కాలేయానికి హాని కలిగించే ఆహారాలు ఉన్నాయి అవేంటంటే..? 


కాలేయానికి హానికరమైన ఆహారాలు.. 
 
ఆల్కహాల్ - ఆల్కహాల్ తాగడం వల్ల లివర్ సిర్రోసిస్, ఫ్యాటీ లివర్ వచ్చే ప్రమాదం ఉంది. ప్రాసెస్ చేసిన ఆహారం - ప్యాక్ చేసిన ఆహారం, ఫాస్ట్ ఫుడ్, వేయించిన స్నాక్స్‌లో ట్రాన్స్ ఫ్యాట్ ఉంటుంది, ఇది కాలేయానికి హాని కలిగిస్తుంది.


అధిక ఉప్పు- అధిక ఉప్పు తినడం వల్ల కాలేయంలో నీరు ఏర్పడుతుంది, ఇది వాపునకు దారితీస్తుంది. చక్కెర పానీయాలు - శీతల పానీయాలు, ప్యాక్ చేసిన జ్యూస్‌లలో అధిక ఫ్రక్టోజ్ కార్న్ సిరప్ ఉంటుంది, ఇది కాలేయానికి హానికరం.

 

ఇది కూడా చదవండి..పుచ్చకాయ తినడం వల్ల కలిగే ఆరోగ్యప్రయోజనాలు తెలుసా..?

ఇది కూడా చదవండి..వరల్డ్ డైజెస్టివ్ హెల్త్ డే ఎలా మొదలైంది..?

ఇది కూడా చదవండి..వాక్సిన్ గురించి వాస్తవాలు- అవాస్తవాలు..  

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి..

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.