జాయింట్ పెయిన్స్ తగ్గించే సూపర్ ఫుడ్స్..
సాక్షి లైఫ్ : మన శరీరానికి మద్దతునిచ్చే ముఖ్య భాగం కాళ్లు. సరైన పోషక ఆహారం అందకపోతే జాయింట్ పెయిన్స్, ఎముకల బలహీనత వంటి అనేక ఆరోగ్య సమస్యలకు కారణమవుతుంది. అయితే, సరైన ఆహారం తీసుకోవడం ద్వారా కాళ్లను దృఢంగా ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు. కాళ్ల బలాన్ని పెంచే 8 అద్భుతమైన ఆహారాలు..
ఇది కూడా చదవండి..యాలకులు ఇలా తీసుకుంటే 5 అనారోగ్య సమస్యలకు చెక్ పెట్టొచ్చు..
ఇది కూడా చదవండి..చికెన్ తిన్నరెండేళ్ల చిన్నారి బర్డ్ ఫ్లూతో మృతి, ఏపీలో తొలి కేసు..
ఇది కూడా చదవండి..మార్నింగ్ వాక్ చేసేటప్పుడు ఈ టిప్స్ ఫాలో అవ్వండి..?
పాలు, పాల ఉత్పత్తులు..
పాలు, పెరుగు, పనీర్ మొదలైనవి క్యాల్షియం, విటమిన్-డి సమృద్ధిగా కలిగి ఉంటాయి. ఇవి ఎముకల బలాన్నిపెంచి, ఆస్టియోపోరోసిస్ వంటి ఎముకల వ్యాధులను అరికడతాయి.
ఆకుకూరలు..
పాలకూర, మెంతికూర, బ్రోకలీ లాంటి ఆకుకూరలు ఐరన్, విటమిన్-కె కలిగి ఉంటాయి. ఇవి ఎముకల దృఢత్వాన్నిపెంచి, కండరాలకు శక్తిని అందిస్తాయి.
బాదం, వాల్ నట్స్..
ఒమేగా-3 ఫ్యాటీ ఆమ్లాలు, ప్రోటీన్, మెగ్నీషియం ఎక్కువగా ఉండే డ్రై ఫ్రూట్స్ తీసుకోవడం వల్ల ఎముకలు, కండరాలకు సరైన పోషణను అందిస్తాయి.
ఆరెంజ్, కివి పండ్లు
విటమిన్-సి ఎక్కువగా ఉండే ఈ పండ్లు, జాయింట్స్ బలంగా ఉండటానికి అవసరమైన కొల్లాజెన్ ఉత్పత్తిని ప్రోత్సహిస్తాయి.
గుడ్లు..
గుడ్లు ప్రోటీన్, విటమిన్-డి అధికంగా కలిగి ఉంటాయి. ఇవి ఎముకలకు బలాన్ని అందించి, కండరాలకు శక్తిని ఇస్తాయి.
సోయా ప్రొడక్ట్స్..
టోఫు, సోయా మిల్క్ క్యాల్షియం, ప్రోటీన్ సమృద్ధిగా కలిగి ఉండటంతో ఎముకల బలహీనత తగ్గించడానికి సహాయపడతాయి.
చేప..
సాల్మన్, సార్డిన్ లాంటి చేపలు విటమిన్-డి, ఒమేగా-3 ఫ్యాటీ ఆమ్లాలతో కూడి ఉంటాయి. ఇవి ఎముకల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి.
చియా, నువ్వులు..
ఈ గింజల్లో జింక్, మెగ్నీషియం, ఫాస్ఫరస్ పుష్కలంగా ఉండటంతో ఎముకల దృఢత్వాన్ని పెంచుతాయి. అంతేకాదు, ఈ ఆరోగ్యకరమైన ఆహారాలను సరైన వ్యాయామం చేస్తూ తీసుకుంటే, కాళ్ల బలం పెరిగి, జాయింట్ నొప్పులు తగ్గుతాయి.
ఇది కూడా చదవండి..జ్ఞాపకశక్తి తగ్గుతోందా..? అయితే అది జబ్బుకు సంకేతం కావచ్చు..
ఇది కూడా చదవండి..ఆస్తమా వచ్చిందంటే జీవితాంతం మందులు వాడాలా..?
ఇది కూడా చదవండి..శరీరంలో కొలెస్ట్రాల్ పెరిగితే ఏమవుతుంది..?
ఇది కూడా చదవండి..వర్షాకాలంలో అజీర్ణ సమస్యతో బాధపడుతున్నారా..? ఈ ఆహారాలను తినకండి..
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
