పుచ్చకాయ తినడం వల్ల కలిగే ఆరోగ్యప్రయోజనాలు తెలుసా..?  

షేర్ చేయండి:
పుచ్చకాయ తినడం వల్ల కలిగే ఆరోగ్యప్రయోజనాలు తెలుసా..?  

సాక్షి లైఫ్: పుచ్చకాయ రుచితో పాటు శరీరంలో నీటి కొరతను తీరుస్తుంది. ఇందులో దాదాపు 90 శాతం నీరు ఉంటుంది. పుచ్చకాయ ఎంత తీపిని కలిగి ఉందో ఆరోగ్యానికి కూడా అంతే మేలు చేస్తుంది. పుచ్చకాయ ప్రాముఖ్యత గురించి ప్రజలకు తెలియజేయడానికి, దాని రకాల గురించి వారికి అవగాహన కల్పించడానికి ప్రతి సంవత్సరం ఆగస్టు 3న జాతీయ పుచ్చకాయ దినోత్సవాన్ని జరుపుకుంటారు. ఈ రోజు ఉద్దేశ్యం పుచ్చకాయ రుచిని ఆస్వాదించడమే కాకుండా దాని ఆరోగ్య ప్రయోజనాలను గురించి తెలుసుకుందాం..  

ఇది కూడా చదవండి.. సిండ్రోమ్ Xకు ప్రారంభ దశలో ఎలాంటి చికిత్సను అందిస్తారు..?

ఇది కూడా చదవండి.. ఒత్తిడిని ఫుడ్ చేంజెస్ చేయడం ద్వారా తగ్గించవచ్చా..? 

ఇది కూడా చదవండి.. నోటి దుర్వాసనను తగ్గించే చిట్కాలు 

  ఇది కూడా చదవండి.. ఆరోగ్యంగా ఉన్నవాళ్లకు ప్రోటీన్ సప్లిమెంట్లు అవసరంలేదంటున్న వైద్యులు..

ఇది కూడా చదవండి.. మీరు ఆరోగ్యంగా బరువు తగ్గాలంటే..? 

 

పుచ్చకాయ శరీరంలో తేమను కాపాడుతుంది. అంతేకాదు శరీరంలో ఇన్సులిన్‌ను నియంత్రిస్తుంది. పుచ్చకాయ బరువు తగ్గడంలో సహాయపడుతుంది. ఆస్తమా తీవ్రతను తగ్గిస్తుంది.
పుచ్చకాయ వేసవిలోకాలంలో వడదెబ్బ నుంచి కాపాడుతుంది.పుచ్చకాయ జీర్ణవ్యవస్థ మెరుగుపరచడంలో కీలక పాత్ర పోషిస్తుంది. అంతేకాదు పుచ్చకాయ మూత్రపిండాలను ఆరోగ్యంగా ఉంచుతుంది. 


నేషనల్ వాటర్ మెలోన్ డే అనేది గ్లోబల్ ఫెస్టివల్. దీనిని ప్రధానంగా అమెరికాలో జరుపుకుంటారు. అంతేకాదు ప్రపంచంలోని కొన్ని దేశాలు కూడా ఈ రోజును ఒక్కో రకంగా జరుపుకుంటారు. చైనాలో ఒకరికొకరు పుచ్చకాయలను బహుమతిగా ఇవ్వడం ద్వారా ఈ రోజును జరుపుకుంటారు. ఐరోపాలో పుచ్చకాయలతో వివిధ రకాల వంటకాలను తయారు చేసి తింటారు. ఈ రోజున ప్రజలు ఒకచోట చేరి వేడుకలు చేసుకుంటారు. ప్రపంచవ్యాప్తంగా అనేక రకాల పుచ్చకాయలు ఉన్నాయి. 

జాతీయ పుచ్చకాయ దినోత్సవం చరిత్ర.. 

 జాతీయ పుచ్చకాయ దినోత్సవాన్ని జరుపుకోవడం అమెరికాలో 1852లో ప్రారంభమైంది. ఆగస్టు 3న  అమెరికాలోని కొన్ని కాలేజీల్లో పుచ్చకాయకు సంబంధించిన కొన్ని పోటీలు నిర్వహించి, ఆ రోజునే నేషనల్ వాటర్ మెలన్ డేని జరుపుకోవడం ప్రారంభించారు.

ఇది కూడా చదవండి..ఓరల్ క్యాన్సర్ కు కారణాలు..? 

ఇది కూడా చదవండి..సహజంగా ఆక్సిటోసిన్ పెంచడానికి మార్గాలు.. 

ఇది కూడా చదవండి..లవ్ హార్మోన్ అంటే ఏమిటి..?

ఇది కూడా చదవండి..టూత్ బ్రష్‌ను ఎంతకాలం వరకు ఉపయోగించవచ్చు?

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.