బర్డ్ ఫ్లూ వైరస్ ఎన్ని డిగ్రీల సెల్సియస్ వరకు సజీవంగా ఉంటుంది..?

షేర్ చేయండి:

సాక్షి లైఫ్ : బర్డ్ ఫ్లూ వైరస్ పలుచోట్ల వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో కోడి మాంసం, గుడ్లను బాగా ఉడికించిన తర్వాతే తినాలని వైద్యనిపుణులు సూచిస్తున్నారు. అయితే ఎన్ని డిగ్రీల వద్ద ఉడికించడం వల్ల బర్డ్ ఫ్లూ వైరస్ సోకే ప్రమాదం ఉంటుంది..? బర్డ్ ఫ్లూ వైరస్ (H5N1) 60 నుంచి 70 డిగ్రీల సెల్సియస్ కంటే ఎక్కువ ఉష్ణోగ్రత వద్ద మనుగడ సాగించలేదని వెటర్నరీ అధికారులు చెబుతున్నారు. చికెన్ తినడం ద్వారా మరింత వ్యాప్తి చెందే అవకాశాన్ని ఆరోగ్య అధికారులు తోసిపుచ్చారు.

 

ఇది కూడా చదవండి.. మీరు ఆరోగ్యంగా బరువు తగ్గాలంటే..? 

ఇది కూడా చదవండి..రోజూ బెల్లం తింటే బరువు పెరుగుతారా..? 

ఇది కూడా చదవండి.. నోటి దుర్వాసనను తగ్గించే చిట్కాలు 

 

బర్డ్ ఫ్లూ వైరస్ పొదిగే కాలం అంటే వైరస్ శరీరంలోకి ప్రవేశించినప్పటి నుంచి లక్షణాలు కనిపించడానికి మధ్య సమయం) మూడు నుంచి నాలుగు రోజులు పడుతుందని అన్నారు. పచ్చిమాంసం కానీ, సరిగా ఉడకించకుండా అస్సలు తినకూడదని వైద్యనిపుణులు వెల్లడిస్తున్నారు. కోళ్ల పారమ్స్ వద్ద పరిశుభ్రంగా ఉంచాలని, ముఖ్యంగా అందులో పనిచేసే కార్మికులు బర్డ్ ఫ్లూ సోకకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని పశుసంవర్ధక శాఖ అధికారులు సూచిస్తున్నారు. 

 

ఇది కూడా చదవండి..అధిక బరువు తగ్గాలంటే రోజుకి ఎన్ని క్యాలరీలు బర్న్ అవ్వాలి..? 

ఇది కూడా చదవండి..టిపికల్ ఫీవర్స్ అంటే ఏమిటి..? వాటి లక్షణాలు ఎలా ఉంటాయి..? 

ఇది కూడా చదవండి.. ఎలాంటి ఆసనాలు, ముద్రలు వేస్తే జ్ఞాపకశక్తి పెరుగుతుంది..? 

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.