సాక్షి లైఫ్ : ప్రపంచవ్యాప్తంగా పురుషులలో అత్యంత గా వచ్చే క్యాన్సర్ ప్రోస్టేట్ క్యాన్సర్. గత దశాబ్దం నుంచి ఈ రకం క్యాన్సర్ కేసులు వేగంగా పెరుగుతున్నాయి. భారతదేశంలోని మొత్తం క్యాన్సర్ కేసులలో కేవలం ప్రోస్టేట్ క్యాన్సర్ మాత్రమే మూడు శాతంగా ఉన్నాయి. దేశంలో ఏటా 50 వేల కొత్త కేసులు నమోదవుతున్నాయని అంచనా. చాలా సందర్భాలలో క్యాన్సర్ ముదిరిన తర్వాత నిర్ధారించడం వల్ల వ్యాధికి చికిత్స చేయడం,రోగి ప్రాణాలను రక్షించడం కష్టంగా మారుతుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.
ప్రోస్టేట్ క్యాన్సర్ కారకాలు..
వయస్సు పెరిగే కొద్దీ ప్రోస్టేట్ క్యాన్సర్ వచ్చే ప్రమాదం పెరుగుతుంది. 50ఏళ్లు దాటినవారిలో ఎక్కువగా ఈ ప్రోస్టేట్ క్యాన్సర్ వచ్చే అవకాశాలున్నాయి.
ఇతర జాతుల వ్యక్తుల కంటే నల్లజాతీయులకు ప్రోస్టేట్ క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంది. కుటుంబ చరిత్ర. తల్లిదండ్రులు, తోబుట్టువులు లేదా బిడ్డ వంటి రక్త బంధువు ప్రోస్టేట్ క్యాన్సర్‌తో బాధపడుతున్నట్లయితే, ఈ కేన్సర్ మిగిలినవారిలోనూ వచ్చే ప్రమాదం పెరుగుతుంది. రొమ్ము క్యాన్సర్ (BRCA1 లేదా BRCA2) ప్రమాదాన్ని పెంచే జన్యువుల కుటుంబ చరిత్ర కలిగి ఉంటే, మీ ప్రోస్టేట్ క్యాన్సర్ ప్రమాదం ఎక్కువగా ఉండవచ్చు.
ఇది కూడా చదవండి.. సంపూర్ణ ఆరోగ్యంగా ఉండాలంటే ఎలాంటి ఫుడ్ తీసుకోవద్దంటే..?
ఊబకాయం..
ఆరోగ్యకరమైన బరువు కలిగి ఉన్న వ్యక్తులతో పోలిస్తే ప్రోస్టేట్ క్యాన్సర్ ప్రమాదం ఊబకాయ సమస్య ఉన్న వ్యక్తుల్లో ఎక్కువగా ఉంటుంది.
అధ్యయనాలు మాత్రం ఈ విషయంలో మిశ్రమ ఫలితాలు ఉండవచ్చని చెబుతున్నాయి.
గణాంకాలు..
ఇటీవలి అధ్యయనాలు ప్రోస్టేట్ క్యాన్సర్ గురించి గణాంకాలను వెల్లడించాయి. ప్రపంచవ్యాప్తంగా ప్రోస్టేట్ క్యాన్సర్ కేసులు తీవ్రంగా పెరుగుతున్నాయని, ఇది ఖచ్చితంగా పెద్ద ఆరోగ్య సంక్షోభంగా మారుతుందని పరిశోధకులు అంటున్నారు.
85 శాతం..
ప్రోస్టేట్ క్యాన్సర్ కారణంగా మరణాలు 2020-2040 మధ్య కాలంలో 85 శాతం పెరుగుతాయని అంచనా. ఇది ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం కలిగిస్తుంది. పురుషుల్లో క్యాన్సర్ మరణాలకు కూడా ఈ వ్యాధి ప్రధాన కారణమవుతుందని శాస్త్రవేత్తలు వెల్లడిస్తున్నారు.
2040 నాటికి..
ది లాన్సెట్ జర్నల్‌లో ప్రచురించిన ఓ నివేదిక ప్రకారం..2040 నాటికి వార్షిక ప్రోస్టేట్ క్యాన్సర్ కేసులు 2.9 మిలియన్లకు (29 లక్షలు) చేరుకుంటాయని అంచనా వేశారు. ప్రపంచ వ్యాప్తంగా ఏటా 14 లక్షలకు పైగా కేసులు నమోదవుతున్నాయి. ధనిక దేశాల కంటే తక్కువ,మధ్య, ఆదాయ దేశాలు అధిక మరణాలు నమోదవుతున్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
ఇది కూడా చదవండి.. సమ్మర్ లో చర్మ సంరక్షణ ఎలా..?
ఇలాంటి కచ్చితమైన ఆరోగ్య సమాచారాన్ని అనుభవజ్ఞులైన వైద్య నిపుణులు అందించే మరిన్ని విషయాలను గురించి మీరు తెలుసుకోవాలంటే సాక్షి లైఫ్ ను ఫాలో అవ్వండి..
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
Tags :Please subscribe for more updates...!
గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.
Door No 6-3-249/1, Sakshi Towers, Beside Care Hospital, Near City Center, Road No 1, Banjara Hills-500034
040 2325 6000
life@sakshi.com
© News. All Rights Reserved. by sakshi.com