నాలుగు నెలల్లో నాణ్యత పరీక్షల్లో విఫలమైన 500 ఔషధ నమూనాలు..
సాక్షి లైఫ్ : ఔషధాల తయారీ ప్రక్రియ, వాటి నాణ్యతా పరీక్షల గురించి ప్రభుత్వ ఏజెన్సీలు, ప్రభుత్వాలు ఎన్ని వాదనలు చేసినా, ఈ పని సరిగ్గా జరగడం లేదనడానికి నిత్యం వార్తల్లో వచ్చే విఫలమైన (ఫెయిల్ అయిన) ఔషధ నమూనాలే నిదర్శనం. గత నెల, సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ (CDSCO), రాష్ట్ర ఔషధ నియంత్రణ సంస్థల తనిఖీల్లో హిమాచల్ ప్రదేశ్‌లోని ఔషధ సంస్థల నుంచి 94 ఔషధ నమూనాలు విఫలమయ్యాయి. తనిఖీల్లో మూడు మందులు నకిలీవని కూడా తేలింది.
ఇది కూడా చదవండి.. చల్లని వాతావరణం వల్ల సైనస్ సమస్యలు పెరుగుతాయా..?
ఇది కూడా చదవండి.. నోటి దుర్వాసనను తగ్గించే చిట్కాలు
ఇది కూడా చదవండి..ఆహారంలో అవకాడోను ఎలా చేర్చుకుంటే మరిన్ని ఆరోగ్య ప్రయోజనాలు అంటే..?
ఇది కూడా చదవండి..హెపటైటిస్ " ఏ" నివారించడంలో వ్యాక్సిన్ పాత్ర ఎంత..?
ఇది కూడా చదవండి..కిడ్నీ వ్యాధి లక్షణాలు: ఈ సంకేతాలను అస్సలు నిర్లక్ష్యం చేయవద్దు..
సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ ప్రతి నెలా 'డ్రగ్ అలర్ట్'ను విడుదల చేస్తుంది. ఆగస్టు డ్రగ్ అలర్ట్ ప్రకారం, హిమాచల్‌లోని 31 కంపెనీల నుంచి 38 మందులు నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా లేవు.
అదే అలర్ట్ ప్రకారం, ఉత్తరాఖండ్, పంజాబ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల కంపెనీలలో తయారైన 56 ఔషధ నమూనాలు కూడా విఫలమయ్యాయి. జూలై డ్రగ్ అలర్ట్‌లో మొత్తం 143 ఔషధ నమూనాలు, జూన్ డ్రగ్ అలర్ట్‌లో 188 ఔషధ నమూనాలు విఫలమయ్యాయి. ఈ జాబితాలో హిమాచల్, గోవా, మహారాష్ట్ర కంపెనీల మందులు ఉన్నాయి.
ఈ నమూనాలు కేవలం 'బ్యాచ్'కు సంబంధించినవి అని, వాటిని తొలగించాలని ఆదేశించినంత మాత్రాన సంతృప్తి చెందలేం. ఎందుకంటే, నాసిరకం మందులను తొలగించాలని ఆదేశాలు ఇచ్చేలోపే అవి రోగులకు చేరవన్న గ్యారంటీ లేదు. ఫార్మా కంపెనీలకు ప్రధాన కేంద్రమైనందున, హిమాచల్ ప్రదేశ్‌లోని కంపెనీల పేర్లు ఎక్కువగా వినిపిస్తాయి.
కానీ, వాస్తవం ఏమిటంటే, దేశంలోని ఇతర ప్రాంతాల ఔషధ కంపెనీల నమూనాలు కూడా విఫలమవుతున్నాయి. భారతదేశం జెనెరిక్ మందుల తయారీలో గుర్తింపు పొందింది, కానీ నాసిరకం మందులు తయారవుతూ ఉంటే ఈ గుర్తింపు ప్రమాదంలో పడవచ్చని వైద్యనిపుణులు వెల్లడిస్తున్నారు.
ఇది కూడా చదవండి...బ్యాడ్ ఫుడ్ కాంబినేషన్ : ఎలాంటి ఆహారాలను కలిపి తీసుకోకూడదు
ఇది కూడా చదవండి..శరీరంలో కొలెస్ట్రాల్ పెరిగితే ఏమవుతుంది..?
ఇది కూడా చదవండి..వారానికి రెండుసార్లు తీసుకోవడం ద్వారా అవకాడోతో గుండెపోటుకు చెక్.. !
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి..
