పిల్లలకు ఆర్ఎస్వీ వైరస్ ముప్పు.. ఎవరికి ఎక్కువ..?
సాక్షి లైఫ్ : రెయినీ సీజన్‌లో ఆర్ఎస్‌వీ వైరస్ కేసులు ఎక్కువగా బయటపడుతుంటాయి. ఈ వైరస్ శ్వాసకోశ ఇంఫెక్షన్ కు కారణ మవుతుంది. ముఖ్యంగా చిన్నపిల్లలు, వృద్ధులు, తక్కువ రోగనిరోధక శక్తి ఉన్నవారికి ఇది ప్రమాదకరం. అందుకే పిల్లల విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలని వైద్యనిపుణులు వెల్లడిస్తున్నారు. ఆర్ఎస్‌వీ వైరస్ లక్షణాలలో జ్వరం, దగ్గు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, ముక్కు దిబ్బడ వంటివి ఉంటాయి.
ఇది కూడా చదవండి..వేగంగా బరువు తగ్గించే ఓట్జెంపిక్ డ్రింక్ ట్రెండ్.. డైటీషియన్లు ఏమంటున్నారంటే..?
ఇది కూడా చదవండి..మైక్రోసైటిక్ అనీమియా అంటే ఏమిటి..?
ఇది కూడా చదవండి.. 40 ఏళ్ల తర్వాత ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేసుకోవచ్చా..?
ఆర్ఎస్‌వీ వైరస్ లక్షణాలు..
ఆర్ఎస్‌వీ వైరస్ లక్షణాలలో జ్వరం, దగ్గు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, ముక్కు దిబ్బడ వంటివి ఉంటాయి. ఈ వ్యాధికి సరైన సమయంలో చికిత్స అందకపోతే, ఇది బ్రాంకియోలైటిస్ లేదా న్యుమోనియాకు దారితీసి ప్రాణాంతకం కావచ్చు.
ఆర్ఎస్‌వీ వైరస్ అంటే ఏమిటి..?
ముఖ్యంగా రెండు సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న శిశువులలో ఇది శ్వాసకోశ ఇన్ఫెక్షన్లకు కారణమవుతుంది. ఈ వైరస్ తుంపర్లు, కలుషిత నీరు, గాలి ద్వారా వ్యాపిస్తుంది. దీని లక్షణాలలో ముక్కు కారడం, దగ్గు, తుమ్ములు, జ్వరం, ఆకలి తగ్గడం వంటివి ఉంటాయి. ఇది శిశువులలో మరింత తీవ్రంగా మారవచ్చు. బ్రాంకియోలైటిస్ లేదా న్యుమోనియాకు దారితీయవచ్చు.
ఈ వైరస్ రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి..?
తప్పనిసరిగా పరిశుభ్రత పాటించాలి.
సబ్బు, నీటితో తరచుగా చేతులు కడుక్కోవాలి.
వ్యాధి సోకిన వ్యక్తులకు దూరంగా ఉండాలి.
రోజువారీ వాడే వస్తువులను శుభ్రం చేసుకోవాలి.
రద్దీ ప్రదేశాల్లో మాస్క్ ధరించండి.
లక్షణాలు కనిపిస్తే బహిరంగ ప్రదేశాలకు వెళ్ళకూడదు.
ప్రస్తుతం, పిల్లలు ఎక్కువగా జలుబు, దగ్గు, శ్వాస సమస్య, ముక్కు దిబ్బడ, న్యుమోనియా వంటి సమస్యలతో వస్తున్నారు. ఈ లక్షణాలు హెచ్‌ఎంపీవీతో పాటు ఆర్ఎస్‌వీ వైరస్ లక్షణాలు కూడా కావచ్చు. అయితే, వ్యాధి నిర్ధారణ పరీక్షల తర్వాతే ఏ వ్యాధి అనేది తెలుసుకోవడం సాధ్యమవుతుంది" అని శిశువైద్య నిపుణులు అంటున్నారు.
ఇది కూడా చదవండి..ఒత్తిడి, ఆందోళనను తగ్గించడానికి బెస్ట్ ఫుడ్ ఏది..?
ఇది కూడా చదవండి.. లివర్ సంబంధిత సమస్యలను ఎలా గుర్తించాలి..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
