పసుపును ఇలా తీసుకుంటే ఆరోగ్య ప్రయోజనాలెన్నో..
సాక్షి లైఫ్ : పసుపు (టర్మరిక్) అనేది అల్లం ఫ్యామిలీకి చెందిన మొక్క. ఇది ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలు అందిస్తుంది. పసుపులో ఉన్న కుర్కుమిన్ అనే యాక్టివ్ కాంపౌండ్ వల్ల ఈ ప్రయోజనాలు సాధ్యమవుతాయి. పసుపును ఎలా తీసుకుంటే మరిన్ని ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు..? ఏసమయంలో తీసుకుంటే ఎక్కువ బెనిఫిట్స్ ఉంటాయనేది ఇప్పుడు తెలుసుకుందాం..
ఇది కూడా చదవండి..చక్కెర తినడంవల్ల కలిగే దుష్ప్రభావాలు..?
ఇది కూడా చదవండి..వేగంగా బరువు తగ్గడానికి సరైన మార్గం
ఇది కూడా చదవండి..ఏ వైపు నిద్రించడం ఆరోగ్యానికి మంచిది..?
పసుపు-వేడినీరు: ఉదయం ఖాళీ కడుపుతో అర టీస్పూన్ పసుపును ఒక గ్లాసు వేడి నీటిలో కలిపి తాగడం వల్ల శరీరం డిటాక్సిఫై అవుతుంది. అంతేకాదు దీనివల్ల జీవక్రియ మెరుగుపడుతుంది. ఇది ఆహారాన్ని జీర్ణం చేయడంలో ఉపయోగపడుతుంది. తద్వారా బరువును తగ్గించడంలో సహాయపడుతుంది.
పసుపు-పాలు: రాత్రి పడుకునే ముందు ఒక కప్పు వేడి పాలలో పసుపు కలుపుకుని తాగండి. మంచి నిద్రతో పాటు, కొవ్వు కూడా తగ్గుతుంది.
పసుపు - నిమ్మరసం: ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో అర టీస్పూన్ పసుపు , సగం నిమ్మరసం కలిపి ఉదయాన్నే తాగాలి. ఇది కొవ్వును కరిగించడంలో ను, జీర్ణక్రియను మెరుగుపరచడంలో ఉపకరిస్తుంది.
పసుపు- అల్లం టీ: తేనె, నిమ్మకాయలతో కలిపి అల్లం, పసుపు టీ తీసుకోవడం వల్ల వాపు తగ్గుతుంది. జీవక్రియ కూడా మెరుగుపడుతుంది.
పసుపు -దాల్చిన చెక్క: పసుపు దాల్చిన చెక్క పొడిని కలిపి వేడి నీటిలో తాగడం వల్ల జీవక్రియ మెరుగుపడుతుంది, ఇది కొవ్వును తగ్గించడంలో సహాయపడుతుంది. తద్వారా వేగంగా బరువు తగ్గడానికి అవకాశం ఉంటుంది.
పసుపు ప్రయోజనాలు..
పెరుగుతున్న జీవక్రియతో పాటు, పసుపు శరీరాన్ని నిర్విషీకరణ చేస్తుంది, దీని కోసం శరీరంలోని విష పదార్థాలను తొలగిస్తుంది, ఇది జీవక్రియను పెంచుతుంది,కొవ్వును వేగంగా కరిగిస్తుంది. ఇందులోని యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు వాపు,నొప్పిని తగ్గించడంలో సహాయపడతాయి.
ఇది కూడా చదవండి..అపోహలు- వాస్తవాలు : బ్లడ్ క్యాన్సర్ వస్తే ప్రాణాల మీద ఆశ వదిలేసుకోవాల్సిందేనా..?
ఇది కూడా చదవండి..మధుమేహం వచ్చేముందు కనిపించే లక్షణాలు..
ఇది కూడా చదవండి..చేతులు కడుక్కునేటప్పుడు ఎలాంటి సబ్బు వాడాలి..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
