ఏ వైపు నిద్రించడం ఆరోగ్యానికి మంచిది..?

షేర్ చేయండి:

సాక్షి లైఫ్ : మన శారీరక, మానసిక ఆరోగ్యం మెరుగుపడాలంటే సరైన నిద్ర ఎంత ముఖ్యమో అందరికీ తెలిసిందే. రోజువారీ వ్యాయామం, ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లు ఎంత ముఖ్యమో.. నిద్ర కూడా అంతే ముఖ్యమని వైద్యనిపుణులువెల్లడిస్తునారు. శరీరం బాగా విశ్రాంతి తీసుకోవడం ద్వారా అది పునరుత్తేజం పొందుతుంది, మనలో సరికొత్త శక్తి ఉత్పన్నమ వుతుంది. ఈ క్రమంలో మనం నిద్రించేటప్పుడు ఎడమ వైపుకు తిరిగి పడుకోవడం ఆరోగ్యానికి ఎంత ముఖ్యమో, దాని వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటో తెలుసుకోవడం చాలా అవసరం.

 

ఇది కూడా చదవండి..అపోహలు- వాస్తవాలు : బ్లడ్ క్యాన్సర్ వస్తే ప్రాణాల మీద ఆశ వదిలేసుకోవాల్సిందేనా..?

ఇది కూడా చదవండి..మధుమేహం వచ్చేముందు కనిపించే లక్షణాలు..

ఇది కూడా చదవండి..చేతులు కడుక్కునేటప్పుడు ఎలాంటి సబ్బు వాడాలి..?

ఎడమవైపు ఎందుకో తెలుసా..?
 
నిద్రించేటప్పుడు ప్రతి ఒక్కరికీ ఒక్కో విధమైన నిద్ర భంగిమ అలవాట్లు ఉంటాయి. కొందరు మోచేతులు మీద బారుగా పడుకుంటారు, మరికొందరు కుడివైపుకు తిరుగుతారు, ఇంకొందరు ఎడమవైపుకు తిరిగి నిద్రిస్తారు. కానీ వైద్యులు ఎడమవైపుకు తిరిగి పడుకోవడం శారీరక ఆరోగ్యానికి చాలా మంచిదని చెబుతున్నారు.

 పరిశోధన.. 

ఎడమవైపు నిద్రించడం వల్ల ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు..? అనే అంశంపై ఇటీవల శాస్త్రవేత్తలు చేసిన పరిశోధనల్లో ఆసక్తికరమైన విషయాలు వెల్లడయ్యాయి. ఎడమవైపుకు నిద్రించడం వల్ల శరీరంలోని విషపదార్థాలు సులభంగా బయటకు వెళతాయి. ముఖ్యంగా జీర్ణ వ్యవస్థ సక్రమంగా పని చేయడంలో ఇది సహాయపడుతుంది. తద్వారా ఎలాంటి అనారోగ్య సమస్యలు తలెత్తవని పరిశోధకులు వెల్లడించారు. 

ఎడమవైపు నిద్రించడం వల్ల జీర్ణవ్యవస్థ.. 

ఎడమవైపు పడుకోవడం వల్ల జీర్ణవ్యవస్థ సక్రమంగా పనిచేస్తుంది. రక్తనాళాల్లోని వ్యర్థపదార్థాలు సులభంగా బయటకు పంపి , ప్లీహం (స్ప్లీన్) సక్రమంగా పని చేస్తుంది. ఇది రక్తాన్ని శుద్ధి చేయడంలో కీలక పాత్ర పోషిస్తుంది. అలాగే, లింఫాటిక్ వ్యవస్థను శుభ్రపరచడంలో సహాయపడుతుంది. ప్లీహం సక్రమంగా పనిచేయడం వల్ల మన రోగ నిరోధక శక్తి పెరుగుతుంది, తద్వారా ఎలాంటి వ్యాధులు రాకుండా ఉంటాయి.  

ఎడమవైపు.. 

ఎడమవైపు నిద్రించడం వల్ల శరీరంలో రోగనిరోధక వ్యవస్థ బలపడుతుంది. ఈ అలవాటు తీసుకుంటే జీర్ణక్రియ మెరుగుపడుతుంది, రక్తంలో షుగర్ లెవెల్స్ కూడా నియంత్రణలో ఉంటాయి, తద్వారా మనం ఆరోగ్యంగా ఉండొచ్చు. కాబట్టి ఎడమవైపుకి మాత్రమే తిరిగి నిద్రించడం వల్ల అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు.

 

ఇది కూడా చదవండి..వెన్నెముక సమస్యలు రాకుండా ఏం చేయాలంటే..?

ఇది కూడా చదవండి..మొబైల్,ల్యాప్‌టాప్‌ ఎక్కువగా ఉపయోగిస్తున్నారా..? ఈ వ్యాధులు తప్పవు.. 

ఇది కూడా చదవండి..ఆరోగ్యంగా ఉన్నవాళ్లకు ప్రోటీన్ సప్లిమెంట్లు అవసరంలేదంటున్న వైద్యులు..  

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.  

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.