గులియన్ బారీ సిండ్రోమ్ ప్రాథమిక లక్షణాలు ఎలా ఉంటాయి..?
సాక్షి లైఫ్ : గులియన్ బారీ సిండ్రోమ్ (జిబిఎస్)వచ్చిన వారిలో ప్రాథమికంగా పలురకాల లక్షణాలు కనిపిస్తాయి. ముఖ్యంగా చేతులు, కాళ్ళలో బలహీనత, జలదరింపు వంటివి ప్రధానంగా కనిపించే లక్షణాలు. ఇవి త్వరగా వ్యాప్తి చెందుతాయి. ఒక్కోసారి కొందరిలో పక్షవాతం వచ్చే ప్రమాదం ఉంది. పరిస్థితి విషమంగా ఉంటే, రోగిని ఆసుపత్రిలో చేర్చాల్సి ఉంటుంది. కొంతమంది వ్యక్తులు మొదట చేతులు లేదా ముఖంపై లక్షణాలను గమనిస్తే.. మాట్లాడటం, నమలడం లేదా మింగడం వంటివాటితోపాటు ముఖ కదలికలలో సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది.
ఇది కూడా చదవండి..గులియన్ బారీ సిండ్రోమ్ (జిబిఎస్) అంటే ఏమిటి..? ఎందుకు వస్తుంది..?
ఇది కూడా చదవండి..హోమియోపతి ఔషధాలతో ఏమైనా దుష్ప్రభావాలు ఉంటాయా..?
ఇది కూడా చదవండి..జీవనశైలి వ్యాధులకు ప్రధాన కారణాలు..
వైద్యుడిని ఎప్పుడు సంప్రదించాలి..?
చాలా మంది రోగులలో జ్వరం తర్వాత దాని లక్షణాలు కనిపిస్తాయని వైద్యనిపుణులు చెబుతున్నారు. జ్వరం వచ్చిన తర్వాత శరీరంలోని ఏ భాగంలోనైనా బలహీనత అనిపిస్తే, మీరు వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. ఈ వ్యాధిలో నరాలు, కండరాలు బలహీనపడతాయి. రోగుల రోగనిరోధక శక్తి బలహీనపడటం వల్ల, బాక్టీరియల్, వైరల్ ఇన్ఫెక్షన్ల వల్ల కూడా జిబిఎస్ వస్తుంది.
ఇది కూడా చదవండి..మీ కిడ్నీలను ఆరోగ్యంగా ఉంచుకోవడానికి 7 మార్గాలు
ఇది కూడా చదవండి..అల్లోపతి, యునాని చికిత్సా విధానాల మధ్య ముఖ్యమైన తేడాలు ఏమిటి?
ఇది కూడా చదవండి..మెదడులో రక్తం గడ్డకట్టడానికి ఈ 8 ఫ్యాక్టర్స్ కారణమే..?
ఇది కూడా చదవండి..చింతపండును అధికంగా తీసుకోవడం వల్ల దంతాల ఎనామిల్ దెబ్బతింటుందా..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
