గులియన్ బారీ సిండ్రోమ్ (జిబిఎస్) అంటే ఏమిటి..? ఎందుకు వస్తుంది..? 

 సాక్షి లైఫ్ : శరీర రోగనిరోధక వ్యవస్థ నరాలపై దాడి చేసే పరిస్థితినే గులియన్ బారీ సిండ్రోమ్ (జిబిఎస్) అంటారు. దీని కారణంగా శరీరంలో  బలహీనత, తిమ్మిరి లేదా పక్షవాతం వంటివి వచ్చే ప్రమాదం ఉందని వైద్యనిపుణులు వెల్లడిస్తున్నారు. ఇది అరుదైన వ్యాధి. ఈ వ్యాధి కొత్తది కాదు. ఇది దాదాపు 100 సంవత్సరాల క్రితం యూరప్‌లో కనుగొన్నారు. ఈ వ్యాధికి ఖచ్చితమైన కారణం ఇంకా తెలియదు. 

ఇది కూడా చదవండి.. బ్యాక్టీరియా ఎలా సంక్రమిస్తుంది..?

ఇది కూడా చదవండి..  ప్రీ-మెనోపాజ్ కారణంగా ఎలాంటి సమస్యలు వస్తాయి..? అవేంటి..?

ఇది కూడా చదవండి.. ఆరోగ్యంగా ఉన్నవాళ్లకు ప్రోటీన్ సప్లిమెంట్లు అవసరంలేదంటున్న వైద్యులు..

 

గులియన్ బారీ సిండ్రోమ్ అనేది ఒకరమైన పక్షవాతమని భావిస్తున్నారు డాక్టర్లు. ఇది ఎక్కువగా పలురకాల ఇన్ఫెక్షన్లు తలెత్తిన తర్వాతే వస్తుందట. పక్షవాతం వచ్చినప్పుడు ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయో సరిగ్గా అవే కనిపిస్తాయని వైద్యనిపుణులు చెబుతున్నారు. దీని ప్రధాన లక్షణాల్లో ఒకటి కండరాలు చచ్చుబడడం. మన శరీరంలో బ్యాక్టీరియా లేదా వైరల్ ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు ఇమ్మ్యూనిటీసిస్టం వాటిని ఎదుర్కోవటానికి యాంటీబాడీస్ ను తయారు చేస్తుంది.

ఈ యాంటీబాడీస్ ఆయా వైరస్ లు బ్యాక్టీరియాలపై దాడి చేస్తాయి. తద్వారా ఇన్ఫెక్షన్స్ తగ్గుతాయి. అయితే ఈ యాంటీ బాడీస్ ఒక్కోసారి పొరపాటున కొంతమందిలో వారి కణజాలాన్ని శత్రువు అనుకుని దాడిచేస్తాయి. ఈ కారణంగా సొరియాసిస్, ల్యూపస్ వంటి ఆటోఇమ్యూన్  వ్యాధులు వస్తాయి. అదేవిధంగా గులియన్ బారీ సిండ్రోమ్ కూడా సరిగ్గా ఇలాంటిదే. వెన్నుపాముతోపాటు చేతులు కాళ్లకు వెళ్లే నరాలపై ఉన్న  పొరను ఈ యాంటీబాడీస్ దెబ్బతీస్తాయి. దీనిని మాలిక్యులర్ మిమిక్రీ మెకానిజం సమస్యగా పరిగణిస్తారు.

ఈ వ్యాధి ఒక ఆటో ఇమ్యూన్ డిసీజ్.. శరీరంలోని రోగనిరోధక వ్యవస్థ నరాలపై దాడి చేస్తుంది. ఇది సాధారణంగా వైరల్ ఇన్ఫెక్షన్ సోకిన కొన్ని వారాల తర్వాత సంభవిస్తుంది. గులియన్ బారీ సిండ్రోమ్ (జిబిఎస్) ఒక నాడీ సంబంధిత రుగ్మత.. ఈ వ్యాధి ఒక రకమైన ఇన్ఫెక్షన్ వల్ల వస్తుంది. ఈ ఇన్ఫెక్షన్ కోవిడ్, చికున్‌గున్యావంటివి ఎవైనా కారణం కావచ్చు. 

ఈ వ్యాధిలో శరీర కండరాలు బలహీనపడటం ప్రారంభిస్తాయి. ఎవరికైనా రోగనిరోధక శక్తి చాలా బలహీనంగా ఉంటే, రోగి వెంటిలేటర్‌పై కూడా వెళ్లవచ్చు. ఈ వ్యాధి తీవ్రమైన నొప్పిని కలిగిస్తుంది, ఇది నొప్పిగా, కత్తిపోట్లుగా లేదా తిమ్మిరిగా ఉండవచ్చు, రాత్రిపూట మరింత తీవ్రమవుతుంది. కొంతమంది రోగులలో మూత్రాశయ నియంత్రణ లేదా ప్రేగు పనితీరులో సమస్యలు కూడా సంభవించవచ్చు. శ్వాస తీసుకోవడంలో కూడా ఇబ్బంది ఉండవచ్చు.

 

ఇది కూడా చదవండి..రోజూ ధనియాల నీళ్లు తాగడం వల్ల కలిగే ఏడు ప్రయోజనాలివే.. 

ఇది కూడా చదవండి..థైరాయిడ్ రుగ్మతలు బరువు పెరగడానికి లేదా తగ్గడానికి దారితీస్తాయా..?

ఇది కూడా చదవండి..నవజాత శిశువు ఆరోగ్యకరమైన బరువు ఎంత..?

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

Tags : immune-system new-virus maharashtra bacteria autoimmune-diseases nerve nerve-system-disorders nerve-problems guillain-barre-syndrome muscle-pain antibodies paralysis facial-nerve-paralysis muscle-function nerve-damage gbs-cases rare-diseases gbs-outbreak pune muscle-weakness
Newsletter

Please subscribe for more updates...!

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.

Get In Touch

Door No 6-3-249/1, Sakshi Towers, Beside Care Hospital, Near City Center, Road No 1, Banjara Hills-500034

040 2325 6000

life@sakshi.com

Follow Us

© News. All Rights Reserved. by sakshi.com