సాక్షి లైఫ్ : మనిషిశరీరంలో గుండె తర్వాత అత్యంత ముఖ్యమైన అవయవం కాలేయం. ఇది శరీరంలో అన్ని అవయవాల కంటే అతిపెద్ద అవయవం కూడా ఇదే. కాలేయం శరీరంలోని పలు రకాల చర్యలను నిర్వహించే రసాయన కర్మాగారంగా భావిస్తారు. అయితే లివర్ సంబంధిత సమస్యలు తలెత్తినప్పుడు ఎటువంటి లక్షణాలు కనిపిస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం..
జీర్ణక్రియ..
కాలేయ సంబంధిత సమస్యలు వచ్చేముందు కొన్ని రకాల సింటమ్స్ శరీరంలో కనిపిస్తాయి. ఆ సమయంలో ప్రధానంగా జీర్ణక్రియ మీద ప్రభావం పడుతుంది. కాలేయంపై కొవ్వు పేరుకుపోతుంది. అంతేకాదు కాలేయం సైజ్ పెరిగినట్లు కూడా అనిపిస్తుంది. జీర్ణ ప్రక్రియ మందగించి కనీసం నీరు కూడా జీర్ణం కాలేని పరిస్థితి ఏర్పడుతుంది.
లివర్ డ్యామేజ్..
అయితే చాలా కాలం నుంచి కొద్దిపాటి జీర్ణ సమస్యలు ఉన్నా, తగ్గకుండా తరచూ బాధిస్తుంటే లివర్ డ్యామేజ్ అవుతున్నట్లుగా గమనించాలి. శరీరంలో ఏ ప్రదేశంలో అయినా గాయం అయినప్పుడు రక్తం వస్తుంది.
యాంటిబాడీస్..
అలా కారే రక్తం గడ్డకట్టేందుకు ఉపకరించే ఎంజైమ్స్ ను కాలేయం ఉత్పత్తి చేస్తుంది. అనారోగ్యాలు కలిగినప్పుడు, వాటినుంచి తట్టుకోవడానికి అవసరమైన ‘యాంటిబాడీస్‌నికూడా ఈ లివరే ఉత్పత్తి చేస్తుంది. వీటిల్లో ఎటువంటి తేడాలు కనిపించినా లివర్ సమస్యగానే పరిగణించాలి.
కళ్ళు అలసినట్లు అనిపించడం..
కళ్ళ చుట్టూ నల్లటి వలయాలు లేదా కళ్ళు అలసినట్లు అనిపించడం కళ్ళ కింది చర్మంలో మార్పులు వస్తాయి. వీటిని అనారోగ్యానికి చిహ్నంగా భావించాలని డాక్టర్లు చెబుతున్నారు. కాలేయం సరిగా లేనప్పుడు చర్మం రంగులో మార్పు వస్తుంది. కొన్ని సార్లు ఐతే చర్మం రంగు కోల్పోతుంది. దాంతో పాటు చర్మం మీద తెల్లని మచ్చలు కూడా వస్తాయి. వీటిని వైట్ ప్యాచెస్ అని లివర్ స్పాట్స్ అని కూడా అంటారు.
డీహైడ్రేషన్..
కాలేయ సమస్యలు ఉన్నప్పుడు మూత్రం ముదురు ఊదా రంగులో వస్తుంటుంది. అయితే ఈ విషయంలో ఇలా ఏదో ఒక సందర్భంలో జరిగితే అది డీహైడ్రేషన్ గా భావించవచ్చు. కానీ ప్రతి రోజూ ఇలాగే అనిపిస్తే మాత్రం లివర్ డ్యామేజ్ అయినట్లు గుర్తించాలి.
తెల్లగా ఉండాల్సిన కళ్ళు పసుపు పచ్చగా మారడంతోపాటు ,గోళ్ళు పసుపుగా కూడా ఎల్లో కలర్ లోకి మారినప్పుడు కామెర్లు ఏమైనా ఉన్నాయేమో పరీక్ష చేయించుకోవాలి.
అంటే కాలేయం దెబ్బతిన్నట్లు గుర్తించి వెంటనే చికిత్స కోసం డాక్టర్లను సంప్రదించాలి. చేదుగా అనిపించే పిత్తం అనే ఎంజైమును కాలేయం ఉత్పత్తి చేస్తుంది. అది నోరంతా చేదుగా చేస్తుంది. ఇది కూడా లివర్ డ్యామేజ్ అయినప్పుడు కనిపించే లక్షణంగా పరిగణించాలంటున్నారు వైద్యనిపుణులు.
పొట్ట భాగం ఉబ్బినట్లు..
కొన్ని సార్లు, కాలేయం ఇన్ఫెక్షన్ వల్ల గానీ పెరగడంవల్ల పొట్ట భాగం ఉబ్బినట్లుగా అనిపిస్తుంది. ఈ లక్షణాలను బట్టి లివర్ సంబంధిత సమస్యలు ఉన్నట్లు గుర్తించి వెంటనే డాక్టర్లను సంప్రదించి అవసరమైన చికిత్స తీసుకోవాలి.
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
Tags :Please subscribe for more updates...!
గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.
Door No 6-3-249/1, Sakshi Towers, Beside Care Hospital, Near City Center, Road No 1, Banjara Hills-500034
040 2325 6000
life@sakshi.com
© News. All Rights Reserved. by sakshi.com