పైల్స్ లక్షణాలు ఎలా ఉంటాయి..? నివారణ ఎలా..?  

షేర్ చేయండి:
పైల్స్ లక్షణాలు ఎలా ఉంటాయి..? నివారణ ఎలా..?  

సాక్షి లైఫ్ : పైల్స్ సమస్య మొదట్లో చిన్నపాటి అసౌకర్యాన్ని కలిగిస్తుంది, కానీ పట్టించుకోకపోతే తీవ్రమైన సమస్యలకు దారితీయవచ్చు. ప్రస్తుతం మొబైల్ ఫోన్‌లు మన జీవితంలో భాగమయ్యాయి, కానీ వాటిని ఎక్కడ, ఎంతవరకు వాడాలో తెలుసుకోవడం ముఖ్యం. టాయిలెట్‌లో ఎక్కువ సేపు కూర్చుని ఫోన్ చూసే అలవాటు కారణంగా పైల్స్ వంటి బాధాకరమైన సమస్యలు మరింతగా పెరుగుతున్నాయి. పైల్స్ లక్షణాలు ఎలా ఉంటాయి..? నివారణ ఎలా..? అనేది ఇప్పుడు తెలుసుకుందాం..  

 

ఇది కూడా చదవండి.ఇంటి భోజనం తిన్నా అనారోగ్య సమస్యలకు కారణాలు ఏమిటి..?

ఇది కూడా చదవండి..మైక్రోసైటిక్ అనీమియా అంటే ఏమిటి..? 

ఇది కూడా చదవండి..ఈ 5 సప్లిమెంట్స్ కు డబ్బు దండగ అంటున్న వైద్యనిపుణులు..!

 

పైల్స్ లక్షణాలు.. 

మల విసర్జన సమయంలో నొప్పి లేదా అసౌకర్యం.

పాయువు చుట్టూ దురద లేదా మంట.

మల విసర్జన సమయంలో రక్తం పడటం.

పాయువు దగ్గర వాపు లేదా గడ్డలు ఏర్పడటం.

నివారణ చర్యలు ఏమిటి..?  

ఫైబర్ అధికంగా ఉండే ఆహారం: పీచు పదార్థాలు (ఫైబర్) ఎక్కువగా ఉండే పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు తీసుకోవడం వల్ల మలబద్ధకం తగ్గుతుంది. ఇది పైల్స్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది. నీరు ఎక్కువగా తాగండి: రోజుకు కనీసం 3-4 లీటర్ల నీరు తాగడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది.క్రమం తప్పకుండా వ్యాయామం: శారీరక శ్రమ చేయడం వల్ల జీర్ణవ్యవస్థ సక్రమంగా  పనిచేస్తుంది. సమయాన్ని పాటించండి: టాయిలెట్‌పై గడిపే సమయాన్ని తగ్గించుకోండి. రెండు నుంచి మూడు నిమిషాలకు మించి ఉండకుండా చూసుకోండి. మొబైల్ ఫోన్ పక్కన పెట్టండి: టాయిలెట్‌కి వెళ్ళినప్పుడు మొబైల్ ఫోన్ తీసుకువెళ్లే అలవాటును మానుకోండి.

 

ఇది కూడా చదవండి..లివర్ సంబంధిత సమస్యలను ఎలా గుర్తించాలి..?   

ఇది కూడా చదవండి..ఒత్తిడి, ఆందోళనను తగ్గించడానికి బెస్ట్ ఫుడ్ ఏది..? 

ఇది కూడా చదవండి..వేగంగా బరువు తగ్గించే ఓట్జెంపిక్ డ్రింక్ ట్రెండ్.. డైటీషియన్లు ఏమంటున్నారంటే..? 

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.