సీజనల్ ఇన్ఫెక్షన్స్ ను నియంత్రించాలంటే ఏమి చేయాలి..? 

షేర్ చేయండి:
సీజనల్ ఇన్ఫెక్షన్స్ ను నియంత్రించాలంటే ఏమి చేయాలి..? 

సాక్షి లైఫ్: ఎండాకాలం ముగిసింది.. ఇక వర్షాకాలం మొదలైంది. వాతావరంలో చోటుచేసుకుంటున్న మార్పుల కారణంగా దేశవ్యాప్తంగా పలుచోట్ల సీజనల్ ఇన్ఫెక్షన్‌లకు సంబంధించిన కేసులు విపరీతంగా నమోదవుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో చెదురు, మొదురు జల్లులతో వైరల్ ఫీవర్, డెంగ్యూ ఫీవర్ కేసులు వేగంగా పెరుగుతున్నాయి. 

ఇది కూడా చదవండి.. బ్యాడ్ హ్యాబిట్స్ లేకపోయినా క్యాన్సర్ రావడానికి కారణాలేంటి..?   

 ప్రతిసారీ సీజన్ మారుతున్నప్పుడల్లా శరీరంలో రోగనిరోధక శక్తి బలహీనపడుతుంది. దీని కారణంగా అంటువ్యాధుల ప్రాభల్యం పెరుగుతుంది. కాబట్టి ఈ నేపథ్యంలో కొన్ని ముఖ్యమైన జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా ఆరోగ్యాన్ని సంరక్షించు కోవచ్చు. అందుకోసం  ఎలాంటి చిట్కాలను పాటించాలో ఇప్పుడు తెలుసుకుందాం.. 

వర్షాకాలంలో కురిసే వర్షాల వల్ల కలుషిత నీరు, ఆహారం, దోమల కారణంగా వైరల్ ఫీవర్, డెంగ్యూ ఫీవర్ వంటి కేసులు పెరుగుతుంటాయి.  అయితే ఆరోగ్యంగా ఉండటానికి కొన్నిసూత్రాలు పాటించాలి. వీటి  ద్వారా  వైరల్ ఇన్ఫెక్షన్ నుంచి మిమ్మల్ని మీరు రక్షించుకోవచ్చు.

పరిశుభ్రత అవసరం.. 

శ్వాసకోశ ఇన్ఫెక్షన్లను నివారించడానికి, పరిశుభ్రంగా ఉండడం చాలా ముఖ్యం. అటువంటి పరిస్థితిలో ఇన్ఫెక్షన్ ప్రమాదాన్ని తగ్గించడానికి, సబ్బునీటితో పూర్తిగా చేతులు కడుక్కోవాలి. 

 సంక్రమించే వ్యాధులు

గాలి ద్వారా సంక్రమించే వ్యాధులను నివారించడానికి, వైరస్లకు గురికావడాన్ని తగ్గించడం చాలా ముఖ్యం. దీని కోసం, అనారోగ్యంతో ఉన్న వ్యక్తులతో దూరంగా ఉండటానికి ప్రయత్నించండి.

వైరస్..  

వైరస్ శరీరంలోకి ప్రవేశించకుండా నిరోధించడంలో మాస్క్‌లు చాలా ప్రభావవంతంగా ఉంటాయి. అందుకే కచ్చితంగా మాస్క్‌ ధరించాలి. ముఖ్యంగా శ్వాసకోశ ఇన్ఫెక్షన్‌కు సంబంధించిన  వైరస్ ప్రవేశించకుండా నిరోధించడానికి ఇది పనిచేస్తుంది.

సోషల్ డిస్టెన్స్.. 

ఎలాంటి వైరస్ బారిన పడకుండా ఉండాలంటే సామాజిక దూరాన్ని పాటించడం చాలా ముఖ్యం. అటువంటి పరిస్థితిలో గాలి ద్వారా సంక్రమించే అవకాశాన్ని తగ్గించడానికి, వ్యాధి సోకిన వ్యక్తుల నుంచి ముఖ్యంగా రద్దీగా ఉండే ప్రదేశాలలో దూరం పాటించండి.

కూరగాయలను కడగాలి..  

హెపటైటిస్ ఏ , హెపటైటిస్ ఈ , వైరల్ గ్యాస్ట్రోఎంటెరిటిస్ వంటి ఇన్ఫెక్షన్లను నివారించడానికి సరిగ్గా ఉడికిన ఆహార పదార్థాలు, సురక్షితమైన నీటితో కూరగాయలను కడగాలి. 

 క్రిమీ, కీటకాలు.. 

మార్కెట్ నుంచి తెచ్చిన పండ్లు , కూరగాయలలో క్రిమీ, కీటకాలు ఉంటాయి. అటువంటి పరిస్థితిలో తినడానికి ముందు పండ్లు, కూరగాయలను ఉప్పువేసి శుభ్రంగా కడగండి.

ఇలాంటి ఫుడ్ విషయంలో.. 

వర్షాకాలంలో తలెత్తే వ్యాధులను నివారించడానికి చద్దిపడిన ఆహారాన్ని తినకూడదు. సీజన్ లో వచ్చిన మార్పుల వల్ల ఆహారం పాడవుతుంది. అలాంటి ఆహారం తినడం వల్ల శరీరంలోకి వ్యాధికారక క్రిములు ప్రవేశించి,  అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. 

బట్టలు.. 

డెంగ్యూ, చికున్‌గున్యా వంటి వ్యాధుల నివారణకు దోమలను నివారించడం చాలా ముఖ్యం. అటువంటి పరిస్థితిలో దోమలను నివారించడానికి ఫుల్ స్లీవ్ కాటన్ దుస్తులను ధరించండి.

దోమలను నివారించండి.. 

దోమలు రాకుండా ఉండేందుకు దోమల తెరలను ఉపయోగించండి.దోమలను నివారించడానికి ప్రత్యేక చర్యలు చేపట్టండి. అలాగే ఇళ్ల చుట్టూ నిలిచిన నీటిని ఎప్పటికప్పుడు తొలగిస్తూ ఉండండి. అప్పుడు దోమలు పెరగకుండా ఉంటాయి.

ఇలాంటి కచ్చితమైన ఆరోగ్య సమాచారాన్ని అనుభవజ్ఞులైన వైద్య నిపుణులు అందించే మరిన్ని విషయాలను గురించి మీరు తెలుసుకోవాలంటే సాక్షి లైఫ్ ను ఫాలో అవ్వండి..  

ఇది కూడా చదవండి.. డెంగ్యూ సమయంలో ప్లేట్‌లెట్ల కౌంట్ ను ఎలా పెంచాలి..? 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.