సాక్షి లైఫ్ : మెదడును తినే అమీబా (బ్రెయిన్ ఈటింగ్ అమీబా) మరోసారి కేరళను వణికిస్తోంది. మూడు నెలల్లోనే ఈ వ్యాధికారక అమీబిక్ ఎన్సెఫాలిటిస్ బారిన పడి కేరళలో ముగ్గురు మరణించారు. ఈ వ్యాధి ఎలా వస్తుంది..? ఎలాంటివాళ్లకు ఎక్కువగా సోకుతుంది..? ఈ వ్యాధి అంటువ్యాధి కాదా అనేది ఇప్పుడు తెలుసుకుందాం..
ఇది కూడా చదవండి.. హెల్తీ డైట్: పిల్లల పెరుగుదలకు సహాయపడే ఆహారం..
ఇది కూడా చదవండి.. కొలెస్ట్రాల్ అంటే ఏమిటి..? ఇది ఎన్ని రకాలు..?
అమీబిక్ ఎన్సెఫాలిటిస్..
అమీబిక్ మెనింగోఎన్సెఫాలిటిస్ అంటువ్యాధి కాదు. కేరళలో మూడు నెలల్లో ముగ్గురు వ్యక్తులు ఈ వ్యాధితో మరణించారు. అయితే వారు వేర్వేరు జిల్లాలకు చెందినవారు. వ్యాధి సోకి మరణించిన వారందరూ వ్యాధి సోకకముందు వాళ్లంతా కొలనుల్లో స్నానం చేశారు. ఇదే వ్యాధికి కారణమని భావిస్తున్నారు.
శరీరంలో..
చెరువులు మొదలైన వాటిలో కనిపించే అమీబా వల్ల ఈ అరుదైన వ్యాధి వస్తుంది. దీనినే "బ్రెయిన్ ఈటింగ్ అమీబా" అంటారు. ఈ అమీబా సాధారణంగా ముక్కు ద్వారా శరీరంలోకి ప్రవేశిస్తుంది. అప్పుడు అది నేరుగా మెదడుకు వెళుతుంది. అమీబా మెదడులోని నాడీ కణాలను తింటుంది. తద్వారా ఇన్ఫెక్షన్ తలెత్తుతుంది. ఈ వ్యాధి మనిషి నుంచి మనిషికి వ్యాపించదని వైద్యనిపుణులు చెబుతున్నారు.
ఇది కూడా చదవండి..హార్మోనల్ ఇంబ్యాలెన్స్ విషయంలో అమ్మాయిలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి..?
ఇది కూడా చదవండి..వర్షాకాలంలో నివారించాల్సిన ఆహారాలు, కూరగాయలు
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
Tags :Please subscribe for more updates...!
గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.
Door No 6-3-249/1, Sakshi Towers, Beside Care Hospital, Near City Center, Road No 1, Banjara Hills-500034
040 2325 6000
life@sakshi.com
© News. All Rights Reserved. by sakshi.com