బరువు తగ్గే వారికి బలమైన స్నాక్స్ .. 

షేర్ చేయండి:
బరువు తగ్గే వారికి బలమైన స్నాక్స్ .. 

సాక్షి లైఫ్ : ఆకలి, అనారోగ్యకరమైన స్నాక్స్ ద్వారా బరువు తగ్గే ప్రణాళికలు తారుమారు అవుతుంటాయి. అయితే సరైన ఎంపికలతో స్నాక్స్ కూడా బరువు తగ్గడంలో కీలక పాత్ర పోషిస్తాయని పోషకాహార నిపుణురాలు డాక్టర్ రోహిణి పాటిల్ వెల్లడించారు. అధిక ప్రోటీన్, ఫైబర్, తక్కువ కేలరీలతో కూడిన కొన్ని స్నాక్స్ ఆకలిని నియంత్రించి శక్తిని అందిస్తాయని ఆమె పేర్కొన్నారు.

ఇది కూడా చదవండి..దృష్టిని మెరుగుపరచడానికి ఎన్ని లీచ్ థెరపీ సెషన్లు అవసరం..?

ఇది కూడా చదవండి..పీఎంఎస్ కు మూడ్ స్వింగ్స్ కు ఏమైనా లింక్ ఉందా..?

ఇది కూడా చదవండి..లీచ్ థెరపీ అంటే ఏమిటి..? కంటి చూపును మెరుగుపరచడానికి ఆయుర్వేదంలో దీనిని ఎలా ఉపయోగిస్తారు?

 ఆరోగ్యకరమైన స్నాక్స్.. 

బాదం.. 

కాలిఫోర్నియా బాదం ప్రోటీన్, మెగ్నీషియం, జింక్ వంటి 15పైగా పోషకాలు కలిగి ఉండి, ఆకలిని తగ్గించడంలో సహాయపడుతుంది.

పెసరపప్పు.. 

పెసరపప్పుతో తయారైన ఈ చిరుతిండి ఫైబర్, ప్రోటీన్‌తో శరీరానికి శక్తినిచ్చి ఆకలిని నియంత్రిస్తుంది.

మొలకలతో కూడిన.. 

పెసర, శనగల మొలకలతో కూడిన ఈ ఆహరంలో విటమిన్లు, ఖనిజాలు సమృద్ధిగా ఉండి రక్తంలో చక్కెర స్థాయిని స్థిరంగా ఉంచుతుంది.

పనీర్, దోసకాయ సలాడ్.. 

పనీర్‌లో ఉన్న ప్రోటీన్ కండరాల ఎదుగుదలకు, దోసకాయలో ఉన్న నీటిశాతం హైడ్రేషన్‌కు ఉపయోగపడుతుంది.

వేయించిన శనగలు..  

తక్కువ కొవ్వు, అధిక ప్రోటీన్ కలిగిన ఈ స్నాక్ శక్తినిచ్చి, ఆకలిని అదుపులో ఉంచుతుంది.

 
‘‘స్నాక్స్ తీసుకోవడం తప్పు కాదు. కానీ ఏం తింటున్నాం, ఎంత తింటున్నాం అన్నదే ముఖ్యమని’’ డా. రోహిణి పాటిల్ స్పష్టం చేశారు. వ్యూహాత్మకంగా స్నాక్స్ ఎంపిక చేసుకుంటే, ఆరోగ్య ప్రయాణాన్ని నిలకడగా కొనసాగించవచ్చని చెబుతున్నారు.
 

ఇది కూడా చదవండి..Cholesterol : కొలెస్ట్రాల్ లో ఎన్ని రకాలు ఉన్నాయంటే..?

ఇది కూడా చదవండి..దాల్చిన చెక్క నీళ్లు తాగితే కలిగే అద్భుతమైన ఐదు ఆరోగ్య ప్రయోజనాలు ఇవే.. 

ఇది కూడా చదవండి..డయాబెటిస్ ఉన్నవారిలో గుండె జబ్బుల ప్రమాదాన్ని నివారించడానికి ఈ 5 చిట్కాలు.. 

 

 గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి..

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.