ఈ టెస్టులతో గుండెపోటు ప్రమాదాన్ని ముందుగా తెలుసుకోవచ్చు..   

షేర్ చేయండి:
ఈ టెస్టులతో గుండెపోటు ప్రమాదాన్ని ముందుగా తెలుసుకోవచ్చు..   

సాక్షి లైఫ్ : ఈ మధ్యకాలంలో యువతలో కూడా గుండెపోటు, కార్డియాక్ అరెస్ట్‌లు ఎక్కువ అవుతున్నాయి. ఆకస్మికంగా కుప్ప కూలిపోతున్న కేసులు మరింతగా పెరుగుతున్నాయి. అయితే, కొన్ని సులభమైన స్కాన్లు, టెస్టుల ద్వారా గుండె ఆరోగ్యాన్ని ముందుగానే తెలుసుకోవచ్చు. ఒక్కో పరీక్షకి కేవలం 10 నిమిషాల సమయం మాత్రమే పడుతుంది. 

ఇది కూడా చదవండి..ఆహారంలోని పురుగుమందులు దీర్ఘకాలంలో ఆరోగ్యాన్ని ఎలా ప్రభావితం చేస్తాయి..?

ఇది కూడా చదవండి..ప్రోస్టేట్ క్యాన్సర్ ఎలాంటివారికి వస్తుంది..?

ఇది కూడా చదవండి..వృద్ధులలో తుంటి నొప్పికి కారణాలు ఏమిటి..? 

 సీటీ కాల్షియం స్కోరింగ్ టెస్ట్.. 

గుండె ధమనుల్లో కాల్షియం పేరుకుపోతే అది గుండెపోటు వచ్చే ముప్పును సూచిస్తుంది. ఈ స్కాన్ ద్వారా అది తెలుసుకోవచ్చు. నొప్పి లేకుండా, వేగంగా పూర్తయ్యే టెస్ట్ ఇది.

 సీటీ కరోనరీ ఆంజియోగ్రామ్ (సీసీటీఏ).. 

ఇది త్రీడీ స్కాన్. గుండె ధమనుల్లో రక్తప్రవాహాన్ని చూసి ఏమైనా అడ్డంకులు ఉన్నాయా అని తెలుసుకోవచ్చు. ఇది గుండెపోటు వచ్చే ముందు సూచనలు ఇవ్వగలదు.

 ఎకోకార్డియోగ్రామ్.. 

ఇది అల్ట్రాసౌండ్ ఆధారంగా గుండె పనితీరును విశ్లేషిస్తుంది. గుండె ఎలా కొట్టుకుంటుంది? బ్లడ్ పంపింగ్ ఎలా జరుగుతుంది? అన్నది తెలుస్తుంది.

ఎలక్ట్రోకార్డియోగ్రామ్ (ఈసీజీ).. 

ఈసీజీ అనేది వేగంగా చేసే పరీక్ష. ఇది గుండె ఎలక్ట్రికల్ కార్యకలాపాలను రికార్డ్ చేసి, గుండె ఎలా పనిచేస్తోందో తెలియజేస్తుంది. ఈ పరీక్ష గుండెపోటు సంకేతాలను తొందరగా తెలుసుకోవచ్చు.

ఇది కూడా చదవండి..30కి పైగా వ్యాధికారక క్రిముల జాబితాను విడుదల చేసిన వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్.. 

ఇది కూడా చదవండి..మలప్పురంలోని పాండిక్కాడ్ నుంచి సేకరించిన గబ్బిలాల నమూనాల్లో నిఫా వైరస్ యాంటీబాడీస్..

ఇది కూడా చదవండి..పొద్దున్నే నిద్ర లేవగానే అలసటగా అనిపిస్తుందా..? కారణాలు ఇవే కావచ్చు.. 

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.