ఫ్యాటి లివర్ ఉన్నవాళ్లు ఎలాంటి డ్రింక్స్ తీసుకోకూడదో తెలుసా..?   

షేర్ చేయండి:
ఫ్యాటి లివర్ ఉన్నవాళ్లు ఎలాంటి డ్రింక్స్ తీసుకోకూడదో తెలుసా..?   

సాక్షి లైఫ్ : కొన్నిరకాల అనారోగ్య సమస్యలున్నవాళ్ళు కొన్నిరకాల జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలి. లేదంటే ఆయా సమస్య మఱింతగా ముదిరి ప్రాణాలకే ప్రమాదం జరిగే అవకాశం ఉందని వైద్యనిపుణులు చెబుతున్నారు. అందుకే కొన్ని జబ్బులున్నవారిని పలురకాల పానీయాలు లేదా ఆహారపదార్థాలకు దూరంగా ఉండాలని అంటున్నారు. అటువంటి వాటిలో ఫ్యాటి లివర్ సమస్యతో ఇబ్బంది పడుతున్నవాళ్లు తమ డైట్ పై ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని వెల్లడిస్తున్నారు. 

ఇది కూడా చదవండి..యోగా ద్వారా శరీరాన్ని ఎలా డిటాక్స్ చేయవచ్చు..?

ఇది కూడా చదవండి..ఎయిర్ క్వాలిటీ లైఫ్ ఇండెక్స్ 2024 నివేదికలో ఆసక్తికర అంశాలు..

ఇది కూడా చదవండి..వైకల్యాన్ని తొలగించేందుకు అరుదైన శస్త్ర చికిత్స చేసిన గ్రీన్‌మెడ్‌ హాస్పిటల్‌ వైద్యులు..

కొన్ని పానీయాలు అధికంగా తీసుకోవడం వల్ల ఫ్యాటి లివర్ సమస్య మరింతగా పెరిగే అవకాశం ఉందని వైద్యనిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ వ్యాధిలో లివర్ సెల్స్ లో అనవసరమైన కొవ్వు ఏర్పడుతుంది. కాబట్టి ఫ్యాటి లివర్ సమస్య ఉన్నవారు ఎలాంటి పానీయాలను దూరంగా ఉండాలో తప్పనిసరిగా తెలుసుకోవాలి..? అవేంటంటే..?

 ఫ్లేవర్డ్ వాటర్.. 

ఫ్లేవర్డ్ వాటర్ ఫ్యాటి లివర్ సమస్యను పెంచుతుంది. ఇది తయారు చేసేటప్పుడు ఆర్టిఫిషియల్ రంగులు, ఎక్కువ శాతం చక్కర ఉపయోగిస్తారు. ఈ కారణంగా ఫ్లేవర్డ్ వాటర్ తీసుకోవడం మానేయడం ఉత్తమం. ఈ పానీయాలను నియంత్రించడం ద్వారా ఫ్యాటి లివర్ పరిస్థితిని కొంతమేర మెరుగుపరచుకోవచ్చని వైద్యనిపుణులు వెల్లడిస్తున్నారు.

సోడా, సాఫ్ట్ డ్రింక్స్.. 

ఫ్యాటి లివర్ సమస్య ఉన్నవాళ్లు రిఫైన్డ్ షుగర్ లేదా ఫ్రుక్టోజ్ అధికంగా ఉన్న పానీయాలను తీసుకోకూడదు. ఇవి లివర్ కు మరింత హాని కలిగించే ప్రమాదం ఉందని డాక్టర్లు సూచిస్తున్నారు.

 ఫ్రక్టోజ్.. 

 తాజా పండ్లు తీసుకోవచ్చు కానీ, వాటి నుంచి తీసిన జ్యూస్ లివర్ కు మంచిది కాదు. జ్యూస్ లో ఉన్న ఫ్రక్టోజ్ లివర్ లో కొవ్వు పెరగడానికి కారణమవుతుంది. కాబట్టి జ్యూస్ తీసుకోకూడదు. 

కాఫీ, టీ.. 

ఫ్యాటి లివర్ ఉన్నవారు చాయ్, కాఫీలు తీసుకోవడం అస్సలు మంచిది కాదు. కాఫీ , చాయ్ లో ఉన్న కెఫైన్ లివర్ ను మరింత బలహీన పరుస్తుంది. కాబట్టి దీనికి బదులు హెర్బల్ టీ తీసుకోవడం మంచిది.

ఆల్కహాల్.. 

బీర్ లో ఆల్కహాల్ పరిమాణం తక్కువగా ఉన్నప్పటికీ, దీనిలో ఉన్న కేలరీలు ఎక్కువగా ఉంటాయి. బీర్ ఎక్కువగా తాగడం వల్ల లివర్ పై తీవ్ర ప్రభావం పడుతుంది.   

ఇది కూడా చదవండి.. B12 విటమిన్ లోపిస్తే శరీరంలో ఏ ఏ అవయవాలపై ప్రభావం పడుతుంది..? 

ఇది కూడా చదవండి.. వేగంగా బరువు తగ్గించే ఓట్జెంపిక్ డ్రింక్ ట్రెండ్.. డైటీషియన్లు ఏమంటున్నారంటే..? 

ఇది కూడా చదవండి.. బ్రకోలీని ఇలా తింటే10 రెట్లు ప్రయోజనాలు పొందవచ్చు..


గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.