వైకల్యాన్ని తొలగించేందుకు అరుదైన శస్త్ర చికిత్స చేసిన గ్రీన్‌మెడ్‌ హాస్పిటల్‌ వైద్యులు..

షేర్ చేయండి:
వైకల్యాన్ని తొలగించేందుకు అరుదైన శస్త్ర చికిత్స చేసిన గ్రీన్‌మెడ్‌ హాస్పిటల్‌ వైద్యులు..

సాక్షి లైఫ్ : అరుదైన శస్త్ర చికిత్సలు చేయడంలో గ్రీన్‌మెడ్‌ హాస్పిటల్‌ ముందు వరుసలో నిలుస్తోంది. ముఖ్యంగా చేతులు, చేతి వేళ్లలో పుట్టుకతో ఏర్పడే వైకల్యాలను సరిచేయడంలో ప్రత్యేకమైన సేవలను అందిస్తోంది ఈ ఆసుపత్రికి చెందిన వైద్య బృందం. ఈ హాస్పిటల్‌లోని నిపుణులు అత్యంత క్లిష్టమైన శస్త్ర చికిత్సలను విజయవంతంగా నిర్వహిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. మానవ కీళ్లు, చేతులు, వేళ్ల సమస్యలను సరిచేయడంలో సరికొత్త చికిత్స చేస్తున్నారు డాక్టర్‌ గుడారు జగదీష్‌, డాక్టర్‌ భాస్కరానంద్‌ కుమార్‌లు.

ఇది కూడా చదవండి.. శరీరానికి తగినవిధంగా విటమిన్లు, ఖనిజాలను ఎలా తీసుకోవాలి..?

ఇది కూడా చదవండి.. విద్యార్థుల్లో మానసిక సమస్యలు తలెత్తడానికి కారణాలివే..?

ఇది కూడా చదవండి.. చియా సీడ్స్ vs ఫ్లాక్స్ సీడ్స్ : ఏవి తినడం వల్ల ఎక్కువ ప్రయోజనం పొందవచ్చు..?

ఇది కూడా చదవండి.. పనీర్ తినడం వల్ల ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలున్నాయో తెలుసా..?

 

ఆర్థోపెడిక్‌ విభాగంలో..  

 తిరుపతిలో బర్డ్ హాస్పిటల్‌కు గతంలో డైరెక్టర్‌గా పనిచేసిన డాక్టర్‌ గుడారు జగదీష్‌ ప్రస్తుతం గ్రీన్‌మెడ్‌ హాస్పిటల్‌లో ఆర్థోపెడిక్‌ విభాగంలో సేవలందిస్తున్నారు. దేశవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన చేతి శస్త్రచికిత్స నిపుణుడు డాక్టర్‌ భాస్కరానంద్‌ కుమార్‌, గ్రీన్‌మెడ్‌ హాస్పిటల్‌లో ప్రత్యేక శస్త్ర చికిత్సలు నిర్వహిస్తున్నారు.

 
అరుదైన చికిత్సలతో..  

ఆగస్టు 22న, చేతుల్లో పుట్టుకతో ఏర్పడే వైకల్యంతో బాధపడుతున్న ఆరుగురు పిల్లలకు ఈ ఇద్దరు వైద్యులు శస్త్ర చికిత్స నిర్వహించామని, ఈ శస్త్ర చికిత్సలు ద్వారా చేతుల వంకర, ముడుచుకుపోయిన చేతి వేళ్లు, ఇతర సమస్యలను సరిచేసినట్లు డాక్టర్‌ భాస్కరానంద్‌ కుమార్‌, డాక్టర్‌ గుడారు జగదీష్‌ వెల్లడించారు. ఈ చికిత్సల ద్వారా చిన్నపిల్లలకు వైకల్యాల నుంచి విముక్తి లభించడమేకాకుండా వారి జీవితాలను మెరుగుపరచడం సాధ్యమైంది. గ్రీన్‌మెడ్‌ హాస్పిటల్‌ పుట్టుకతో ఏర్పడే చేతుల వైకల్యాలను సరిచేయడంలో అత్యంత పేరు ప్రతిష్టలు సంపాదించింది. అతి క్లిష్టమైన శస్త్ర చికిత్సలు నిర్వహించి, క్షతగాత్రులకు నూతన జీవితాన్ని అందించడంలో గ్రీన్‌మెడ్‌ హాస్పిటల్‌ ప్రధాన పాత్ర పోషిస్తోంది.

ఇది కూడా చదవండి..40 ఏళ్ల తర్వాత ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేసుకోవచ్చా..?

ఇది కూడా చదవండి..కిడ్నీ దానం ఎలాంటి వాళ్లు చేయవచ్చు..?   

ఇది కూడా చదవండి..అధిక బరువు తగ్గాలంటే రోజుకి ఎన్ని క్యాలరీలు బర్న్ అవ్వాలి..?

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.