ఫ్యాటి లివర్ ఉన్నవారు ఈ పానీయాలు అస్సలు తీసుకోకూడదు..
సాక్షి లైఫ్ : ఫ్యాటి లివర్ సమస్యతో ఇబ్బంది పడుతున్నవాళ్లు తమ డైట్ పై ప్రత్యేకంగా దృష్టి పెట్టాలి. కొన్ని పానీయాలు అధికంగా తీసుకోవడం వల్ల ఫ్యాటి లివర్ సమస్య మరింతగా పెరిగే అవకాశం ఉందని వైద్యనిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ వ్యాధిలో లివర్ సెల్స్ లో అనవసరమైన కొవ్వు ఏర్పడుతుంది. కాబట్టి ఫ్యాటి లివర్ సమస్య ఉన్నవారు ఎలాంటి పానీయాలను దూరంగా ఉండాలో తప్పనిసరిగా తెలుసుకోవాలి..? అవేంటంటే..?
ఇది కూడా చదవండి..కిడ్నీ దానం ఎలాంటి వాళ్లు చేయవచ్చు..?
ఇది కూడా చదవండి..అధిక బరువు తగ్గాలంటే రోజుకి ఎన్ని క్యాలరీలు బర్న్ అవ్వాలి..?
ఇది కూడా చదవండి..టిపికల్ ఫీవర్స్ అంటే ఏమిటి..? వాటి లక్షణాలు ఎలా ఉంటాయి..?
ఇది కూడా చదవండి..మీరు ఆరోగ్యంగా బరువు తగ్గాలంటే..?
సోడా, సాఫ్ట్ డ్రింక్స్..
ఫ్యాటి లివర్ సమస్య ఉన్నవాళ్లు రిఫైన్డ్ షుగర్ లేదా ఫ్రుక్టోజ్ అధికంగా ఉన్న పానీయాలను తీసుకోకూడదు. ఇవి లివర్ కు మరింత హాని కలిగించే ప్రమాదం ఉందని డాక్టర్లు సూచిస్తున్నారు.
ఫ్రూట్ జ్యూస్..
తాజా పండ్లు తీసుకోవచ్చు కానీ, వాటి నుంచి తీసిన జ్యూస్ లివర్ కు మంచిది కాదు. జ్యూస్ లో ఉన్న ఫ్రుక్టోజ్ లివర్ లో కొవ్వు పెరగడానికి కారణమవుతుంది. కాబట్టి జ్యూస్ తీసుకోకూడదు.
చాయ్, కాఫీ..
ఫ్యాటి లివర్ ఉన్నవారు చాయ్, కాఫీలు తీసుకోవడం అస్సలు మంచిది కాదు. కాఫీ , చాయ్ లో ఉన్న కెఫైన్ లివర్ ను మరింత బలహీనపరుస్తుంది. కాబట్టి దీనికి బదులు హెర్బల్ టీ తీసుకోవడం మంచిది.
బీర్..
బీర్ లో ఆల్కహాల్ పరిమాణం తక్కువగా ఉన్నప్పటికీ, దీనిలో ఉన్న కేలరీలు ఎక్కువగా ఉంటాయి. బీర్ ఎక్కువగా తాగడం వల్ల లివర్ పై తీవ్ర ప్రభావం పడుతుంది.
ఫ్లేవర్డ్ వాటర్..
ఫ్లేవర్డ్ వాటర్ ఫ్యాటి లివర్ సమస్యను పెంచుతుంది. ఇది తయారు చేసేటప్పుడు ఆర్టిఫిషియల్ రంగులు, ఎక్కువ శాతం చక్కర ఉపయోగిస్తారు. ఈ కారణంగా ఫ్లేవర్డ్ వాటర్ తీసుకోవడం మానేయడం ఉత్తమం. ఈ పానీయాలను నియంత్రించడం ద్వారా ఫ్యాటి లివర్ పరిస్థితిని కొంతమేర మెరుగుపరచుకోవచ్చని వైద్యనిపుణులు వెల్లడిస్తున్నారు.
ఇది కూడా చదవండి..సిండ్రోమ్ Xకు ప్రారంభ దశలో ఎలాంటి చికిత్సను అందిస్తారు..?
ఇది కూడా చదవండి..ఒత్తిడిని ఫుడ్ చేంజెస్ చేయడం ద్వారా తగ్గించవచ్చా..?
ఇది కూడా చదవండి..నోటి దుర్వాసనను తగ్గించే చిట్కాలు
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
