బాడీ నంబ్నెస్ ప్రాబ్లెమ్ అంటే ఏమిటి..? నివారణ ఎలా..?
సాక్షి లైఫ్ : బాడీ నంబ్నెస్ ప్రాబ్లెమ్.. ఎక్కువసమయం ఒకే దగ్గర ఒకే స్థానంలో కూర్చో వడం వల్ల కాళ్లు తిమ్మిరి పట్టడమేకాకుండా విపరీతమైన నొప్పిగా కూడా అనిపిస్తుంది. ఈ పరిస్థితినే "బాడీ నంబ్నెస్ ప్రాబ్లెమ్" అంటారు. ప్రస్తుతం పనిచేసే విధానంలో చాలా మార్పులు వచ్చి చేరాయి. ఆఫీస్ లో వర్క్ చేస్తున్నప్పుడు కొంతమంది మూడు గంటలు, నాలుగు గంటల వరకూ కూర్చున్న ప్లేస్ లోనుంచి కదలరు. దీనివల్ల రక్తప్రసరణపై తీవ్ర ప్రభావం పడుతుంది. దీని కారణంగా కాళ్లు తిమ్మిరి పడతాయి.
ఇది కూడా చదవండి..లివర్ సంబంధిత సమస్యలను ఎలా గుర్తించాలి..?
ఇది కూడా చదవండి.. 40 ఏళ్ల తర్వాత ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేసుకోవచ్చా..?
చాలా ఎక్కువ సేపు ఒకే రకమైన భంగిమలో కూర్చుంటే కొంత సమయం తర్వాత కాలు తిమ్మిరి ఎక్కడం వల్ల కదిలించలేకపోవచ్చు.
బాడీ నంబ్నెస్ ప్రాబ్లెమ్ ఎవరిలో ఎక్కువగా వస్తుంది..?
* ఎక్కువ సేపు ఒకే చోట కూర్చొని పనిచేసే వారిలో ఈ సమస్య తలెత్తే అవకాశం ఉంటుంది.
* మద్యపానం అలవాటు ఉన్నవారిలో కూడా బాడీ నంబ్నెస్ ప్రాబ్లెమ్ వస్తుంది.
*అధిక బరువు ఉన్నవారికి ఈ సమస్య వచ్చే ముప్పు ఎక్కువ.
*విటమిన్స్ లోపం వల్ల కూడా ఇది వస్తుంది.
పరిష్కారం..?
వెడల్పాటి పాత్రలో రాతి ఉప్పు, వేడినీళ్లు పోసి అందులో పాదాలను ఉంచి బాగా రుద్దాలి.
నిమ్మరసం,ఉప్పు: ఒక గ్లాసు నీళ్లలో నిమ్మరసం, చిటికెడు ఉప్పు కలిపి తాగితే కాళ్ల నొప్పులు తగ్గుతాయి.
బాదం, జీడిపప్పు: ఒక గిన్నెలో ఐదు బాదంపప్పులు, ఐదు జీడిపప్పులు వేసి నీళ్లు పోసి రాత్రంతా నానబెట్టి మరుసటి రోజు తింటే పాదాల తిమ్మిరి సమస్యకు పూర్తిగా పరిష్కారం లభిస్తుంది.
ఇది కూడా చదవండి.. అధిక ప్రోటీన్ ప్రమాదకరమా..
ఇది కూడా చదవండి.. దీర్ఘకాలిక వ్యాధులు రాకుండాఉండాలంటే..? ఏమి చేయాలి..?
ఇలాంటి కచ్చితమైన ఆరోగ్య సమాచారాన్ని అనుభవజ్ఞులైన వైద్య నిపుణులు అందించే మరిన్ని విషయాలను మీరు తెలుసుకోవాలంటే సాక్షి లైఫ్ ను ఫాలో అవ్వండి..
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
