అధిక ప్రోటీన్ ప్రమాదకరమా..? అధిక మోతాదు వల్ల..
సాక్షి లైఫ్: శరీరంలోని ముఖ్యమైన పోషకాలలో ఒకటైన ప్రొటీన్, శరీరం తనను తాను రిపేర్ చేయడంలో ఎంజైమ్‌లు, హార్మోన్‌లను ఉత్పత్తి చేయడంతోపాటు మొత్తం పనితీరును నిర్వహించడానికి సహాయపడుతుంది. ఫిట్‌నెస్ ఔత్సాహికులు ప్రోటీన్ బార్‌లు, ప్రోటీన్ షేక్‌లు ఎక్కువగా తీసుకుంటారు. ప్రస్తుతం మార్కెట్లో ప్రోటీన్ నూడుల్స్, ప్రోటీన్ కుకీలు,ప్రోటీన్ డెజర్ట్‌లు వంటి అనేక ప్రోటీన్-రిచ్ ఉత్పత్తులు అందుబాటులో ఉన్నాయి. ఇవి కొంతమేర ఆరోగ్యంగా అనిపించినా, ప్రొటీన్లు ఎక్కువగా తినడం వల్ల ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయని వైద్యనిపుణులు వెల్లడిస్తున్నారు.
ఇది కూడా చదవండి.. టాటూ వేయించుకున్న వాళ్లు రక్తదానంచేయకూడదా..?
ఇది కూడా చదవండి..గుండె రక్తనాళాల్లో పేరుకుపోయిన కాల్షియాన్ని ఎలా తొలగిస్తారు ..?
ఆహారంలో ప్రోటీన్..
శరీరం రోజువారీ విధులకు 50 నుంచి 175 గ్రాముల ప్రోటీన్ సరిపోతుందని పలు అధ్యయనాలు చెబుతున్నాయి. బరువు తగ్గాలనుకునే వ్యక్తులు సాధారణంగా తమ ఆహారంలో ప్రోటీన్‌ను ఎక్కువగా తీసుకుంటారు. కానీ ఫైబర్, నీళ్లు, విటమిన్లు , ఖనిజాలు కూడా ఆరోగ్యానికి చాలా ముఖ్యమైనవి.
అనేక ఆరోగ్య సమస్యలు..
వారి శరీరంలో వీటి స్థాయిలు సమతుల్యంగా లేకపోతే, అనేక ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉందని పరిశోధకులు చెబుతున్నారు. శరీరంలోని ఇతర పోషకాల కంటే ఎక్కువ ప్రొటీన్లను పొందడం వల్ల డీహైడ్రేషన్ సమస్య తలెత్తుతుంది. అదే విధంగా, సిఫార్సు చేసిన దానికంటే ఎక్కువ ప్రోటీన్ తీసుకోవడం వల్ల పనితీరు తగ్గుతుంది.
ఇది కూడా చదవండి..ఉల్లిపాయ రసం రెగ్యులర్ గా తాగడం వల్ల కలిగే లాభాలు మీకు తెలుసా..?
ఇది కూడా చదవండి..చెడు కొలెస్ట్రాల్ ను అంతమొందించే పండు..
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
