కార్డియో వాస్క్యూలర్ డిసీజెస్ అంటే..?  

షేర్ చేయండి:
కార్డియో వాస్క్యూలర్ డిసీజెస్ అంటే..?  

సాక్షి లైఫ్ : కొన్ని దశాబ్దాల క్రితం వరకు గుండె సంబంధిత సమస్యలు కేవలం  అరవై ఏళ్లు దాటిన వారిలోనే ఎక్కువగా వచ్చేవి. కానీ ఇప్పుడు వయస్సుతో సంబంధం లేకుండానే హార్ట్ ప్రోబ్లమ్స్ వస్తున్నాయి. రోజురోజుకీ గుండె జబ్బులు ప్రాణాంతకమైన వ్యాధులుగా మారుతు న్నాయని, కాబట్టి గుండె విషయంలో మరింత అప్రమత్తంగా ఉండాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. గుండె అనేది మనిషి శరీరంలో అత్యంత కీలకమైన అవయవం. కాబట్టి ప్రతి ఒక్కరికీ గుండె ఆరోగ్యం చాలా ముఖ్యం. గత కొన్ని సంవత్సరాలుగా ప్రపంచవ్యాప్తంగా గుండె జబ్బుల కేసులు వేగంగా పెరుగుతున్నాయి.

ఇది కూడా చదవండి.. కిడ్నీలకు హాని కలిగించే ఫుడ్..

ఇది కూడా చదవండి.. లివర్ సంబంధిత సమస్యలను ఎలా గుర్తించాలి..?  

 సీవీడీ..


గుండె సంబంధిత వ్యాధులనే(సీవీడీ) కార్డియో వాస్క్యూలర్ డిసీజెస్ అంటారు. ఈ వ్యాధులకారణంగా 2019లో ప్రపంచవ్యాప్తంగా 17.9 మిలియన్ల మంది మరణించారని అంచనా. ఈ మరణాలలో 85శాతం హార్ట్ ఎటాక్ , హార్ట్ స్ట్రోక్ కారణంగా సంభవించాయి. అభివృద్ధి చెందుతున్న దేశాలతోపోలిస్తే వెనుకబడిన దేశాల్లోనే గుండె జబ్బుల కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ గణాంకాలు వెల్లడిస్తున్నాయి.

 ఊబకాయం, షుగర్.. 
 
ఊబకాయం, షుగర్ వ్యాధిగ్రస్తులు, హైబీపీ ఉన్నవారు, పొగతాగేవారు, ఆల్కహాల్ ఎక్కువగా తీసుకునేవాళ్ళకు గుండె జబ్బులు ఎక్కువగా వచ్చే ప్రమాదం ఉందని పరిశోధకులు చెబుతున్నారు. రోజులో ఎక్కువసేపు ఒకే చోట కూర్చుని జాబ్ చేసేవారు, జంక్ ఫుడ్,  ప్రాసెస్డ్ ఫుడ్స్ తీసుకునేవాళ్ల గుండె ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. గుండె జబ్బులు వయసుతో సంబంధం లేదని, ఎవరికైనా వస్తాయని, అందుకే చిన్నప్పటి నుంచి జీవనశైలి, ఆహారం విషయంలో అప్రమత్తంగా ఉండాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.  

 

ఇది కూడా చదవండి.. చిన్న సూదితో రోగాలు నయమవుతాయా..? 

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి..

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.